Title | పిలచితె నేను | pilachite nEnu |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | పూర్వీ కల్యాణి | pUrvI kalyANi |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Published At | 392 | |
పల్లవి pallavi | పిలచితె నేను బల్కవేమి దేమిరా | pilachite nEnu balkavEmi dEmirA |
అనుపల్లవి anupallavi | కాని దాని మాట వినీ కరుణ మరచె దేమిరా | kAni dAni mATa vinI karuNa marache dEmirA |
చరణం charaNam 1 | మంచి వాడవని నేను మరులైతిని గదరా కొంచ కాడ అవులేరా కోర్కె దీరదాయా | manchi vADavani nEnu marulaitini gadarA koncha kADa avulErA kOrke dIradAyA |
చరణం charaNam 2 | మనసు తెలియకను మగువ పొందు జేరితివి కనికర మింతైన లేక కలసిట్లు జేసితివి | manasu teliyakanu maguva pondu jEritivi kanikara mintaina lEka kalasiTlu jEsitivi |
చరణం charaNam 3 | మారుని బారికి మనసు సైరిసదాయ మరచేది న్యాయమా మంగళపురి శ్రీనివాస | mAruni bAriki manasu sairisadAya marachEdi nyAyamA mangaLapuri SrInivAsa |