Title | మోహనాకార యని | mOhanAkAra yani |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | దేశి తోడి | dESi tODi |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | మోహనాకార యని మనవి జేసిన రాడే | mOhanAkAra yani manavi jEsina rADE |
అనుపల్లవి anupallavi | మోహమెటు దీరును మగువ నే తాళాను | mOhameTu dIrunu maguva nE tALAnu |
చరణం charaNam 1 | మనవి జేసుకు పోతె మోమోర జేసేను మన్నాన జేసేది మగువరొ తగునా | manavi jEsuku pOte mOmOra jEsEnu mannAna jEsEdi maguvaro tagunA |
చరణం charaNam 2 | నా సామినీ బాసీ నే తాళలేను నా సరివారిలో నను చౌక జేసెను | nA sAminI bAsI nE tALalEnu nA sarivArilO nanu chauka jEsenu |
చరణం charaNam 3 | రాతిరి నను గూడీ రాడాయ నేడు నాతిని జేరి నను మరచె నేడు | rAtiri nanu gUDI rADAya nEDu nAtini jEri nanu marache nEDu |
చరణం charaNam 4 | సరసూడు లేని ఈ సొగసేలనె మనకు ఓర్వజాలను సామి ఇందు రాడాయనె | sarasUDu lEni I sogasElane manaku OrvajAlanu sAmi indu rADAyane |
చరణం charaNam 5 | కాయజు కేళిలో కలియుట సమయము మాయకాడె వాడు మంగళపురి వాసుడు | kAyaju kELilO kaliyuTa samayamu mAyakADe vADu mangaLapuri vAsuDu |