Title | మనసెట్ల సైరింతు | manaseTla sairintu |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మనసెట్ల సైరింతు మద గజ గామినీ | manaseTla sairintu mada gaja gAminI |
అనుపల్లవి anupallavi | పణతిరొ నా సామిని పిలువావె మానినీ | paNatiro nA sAmini piluvAve mAninI |
చరణం charaNam 1 | విరహ మెచ్చి ప్రాయము వ్యర్థమాయను నేడు మరుని శరములకు మగువరొ తాళజాలరా | viraha mechchi prAyamu vyarthamAyanu nEDu maruni Saramulaku maguvaro tALajAlarA |
చరణం charaNam 2 | పంచబాణుడు వచ్చె నేడు ప్రాణ నాథుడు రాడాయ వంచ న్యాలనే సామికి వారిజాక్షి పిలువావె | panchabANuDu vachche nEDu prANa nAthuDu rADAya vancha nyAlanE sAmiki vArijAkshi piluvAve |
చరణం charaNam 3 | మరచి పోయి నాడేమో మంగళపురి వాసుడు సరస మాడుటకు సఖియరొ తోడి త్యావె | marachi pOyi nADEmO mangaLapuri vAsuDu sarasa mADuTaku sakhiyaro tODi tyAve |