Title | సఖియా తోడి త్యావె | sakhiyA tODi tyAve |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | సఖియా తోడి త్యావె | sakhiyA tODi tyAve |
అనుపల్లవి anupallavi | సుఖమిందు లేదాయ సుదతిరో యీవ్యాళ | sukhamindu lEdAya sudatirO yIvyALa |
చరణం charaNam 1 | ప్రేమ మరచె నేడు ప్రియమింత లేదాయ తామస మ్యాలనె తరుణిరో పోవె | prEma marache nEDu priyaminta lEdAya tAmasa myAlane taruNirO pOve |
చరణం charaNam 2 | మనసిందు లేదాయ ముదితారో వానికి వనజాక్షి సతమ వలపదీ కొన్నాళ్ళు | manasindu lEdAya muditArO vAniki vanajAkshi satama valapadI konnALLu |
చరణం charaNam 3 | కరుణ యింతైన నాపై కడకు లేదాయ వర మంగళపురి వాసుడు వనితల పాలాయ | karuNa yintaina nApai kaDaku lEdAya vara mangaLapuri vAsuDu vanitala pAlAya |