Title | ఏమి సేతునమ్మా | Emi sEtunammA |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | సావేరి | sAvEri |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏమి సేతునమ్మా నేను సామీ రాడాయనె | Emi sEtunammA nEnu sAmI rADAyane |
చరణం charaNam 1 | మోహము యెటులా సైతు నేను ముదితారొ నేడు రాడాయ మోహనాంగి వినవే మనసు నే నిలుపలేను | mOhamu yeTulA saitu nEnu muditAro nEDu rADAya mOhanAngi vinavE manasu nE nilupalEnu |
చరణం charaNam 2 | సరసుడు లేని జన్మ మ్యాలే సరివారలు నవ్వనాయా మారుని బాధకు వోర్వను నేను మమతలు మరువలేను | sarasuDu lEni janma myAlE sarivAralu navvanAyA mAruni bAdhaku vOrvanu nEnu mamatalu maruvalEnu |
చరణం charaNam 3 | మంగళపురి వాసుడు మరచినాడే నేడు శృంగారము మనకేలనె సొగసెవ్వరు జూచేరే | mangaLapuri vAsuDu marachinADE nEDu SRngAramu manakElane sogasevvaru jUchErE |