Title | సరోజాక్షిరొ | sarOjAkshiro |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | పూర్వీ కల్యాణి | pUrvI kalyANi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | సరోజాక్షిరొ నా మాట సైసదాయ సామీ రాడాయ యింకేమి నే జేతూనే | sarOjAkshiro nA mATa saisadAya sAmI rADAya yinkEmi nE jEtUnE |
చరణం charaNam 1 | సదా యుడవని చాలా నమ్మియుంటి మదావతిరో నేడేల రాడాయనె | sadA yuDavani chAlA nammiyunTi madAvatirO nEDEla rADAyane |
చరణం charaNam 2 | చేరా వచ్చీ మును జేసిన చెలిమి కోరితిని గాని కోర్కె దీరదాయ | chErA vachchI munu jEsina chelimi kOritini gAni kOrke dIradAya |
చరణం charaNam 3 | కరుణెందు బోయెనో మరువలేనే నేడు కారణ మేమి కలికిరో యీవేళ | karuNendu bOyenO maruvalEnE nEDu kAraNa mEmi kalikirO yIvELa |
చరణం charaNam 4 | వెలదీరొ అలనాడు వుపరతి వేళలో కలసిన రీతెల్ల కలికి నే మరువాను | veladIro alanADu vuparati vELalO kalasina rItella kaliki nE maruvAnu |
చరణం charaNam 5 | ప్రేమ మరచానే యేమి సేతు నేను మోము జూడడె మంగాళ పురీశుడు | prEma marachAnE yEmi sEtu nEnu mOmu jUDaDe mangALa purISuDu |