Title | రారా మా యింటికి | rArA mA yinTiki |
Written By | తెల్లాకుల వెంకటేశ్వర గుప్త | tellAkula VenkaTESvara gupta |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | శహన | Sahana |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | రారా మా యింటికి రయమున గోపాలా బాలుడవని నిన్ను చాలగా నమ్మితీ | rArA mA yinTiki rayamuna gOpAlA bAluDavani ninnu chAlagA nammitI |
అనుపల్లవి anupallavi | ఎంతని వేడినా పంతమేలరా నాపై దంతీ రక్షక నాదు చెంతకు జేరగా | entani vEDinA pantamElarA nApai dantI rakshaka nAdu chentaku jEragA |
చరణం charaNam 1 | మల్లె పువ్వులు ఇవిగో కొల్లగ యీ రేయి చల్లని మారుత మెల్ల వీచుచు నుండే వల్ల జేసుక రారా పల్లవాధరి గోరి సలలితముగా మురళీ సరళీ జూపుదు గాని | malle puvvulu ivigO kollaga yI rEyi challani mAruta mella vIchuchu nunDE valla jEsuka rArA pallavAdhari gOri salalitamugA muraLI saraLI jUpudu gAni |
చరణం charaNam 2 | అత్తా గారున్నారు కత్తీ వంటిది నా అత్తా గారున్నారు కత్తీ వంటిదిరా చిత్తాము నిల్వాదు చెల్వుడా నిను జూడ పంకజ ముఖులతో పంకాలు బలికేవు బింక మేలర వేంకటేశ వరద నేడే | attA gArunnAru kattI vanTidi nA attA gArunnAru kattI vanTidirA chittAmu nilvAdu chelvuDA ninu jUDa pankaja mukhulatO pankAlu balikEvu binka mElara vEnkaTESa varada nEDE |