Title | కరుణ జూడ | karuNa jUDa |
Written By | భూసురపల్లి వేంకటేశ్వర్లు | bhUsurapalli vEnkaTESvarlu |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | కాపీ | kApI |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | కరుణ జూడ డేలనో కాంచనాంగి చెప్పి రావె | karuNa jUDa DElanO kAnchanAngi cheppi rAve |
అనుపల్లవి anupallavi | కలలో నైనా స్వామిని గాంచక నే నుండ లేను | kalalO nainA svAmini gAnchaka nE nunDa lEnu |
చరణం charaNam 1 | మనసంతా అతడె నిండి మగువకు దాగుట తగవా అతనికి చేతనైనచొ నా మనసు నుంచి పొమ్మనవే | manasantA ataDe ninDi maguvaku dAguTa tagavA ataniki chEtanainacho nA manasu nunchi pommanavE |
చరణం charaNam 2 | వాంఛ కాదు వనితా యిది వలపు పెంచు కొంటి విభుని కిది తగదని చెప్పవేమె తడవు లేక రమ్మనవే | vAnCha kAdu vanitA yidi valapu penchu konTi vibhuni kidi tagadani cheppavEme taDavu lEka rammanavE |