Title | సఖియ వినుమా | sakhiya vinumA |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ఇంగ్లీషు మెట్టు | inglIshu meTTu |
తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
పల్లవి pallavi | సఖియ వినుమా సరిగ చనుమా సఖుని రమ్మనుమా | sakhiya vinumA sariga chanumA sakhuni rammanumA |
అనుపల్లవి anupallavi | సఖుని రమ్మనుమా ఇంత జాలమేలమ్మా ఇంత జాలమేలమ్మా నే సైపలేనమ్మా | sakhuni rammanumA inta jAlamElammA inta jAlamElammA nE saipalEnammA |
చరణం charaNam 1 | పంచ శరము డెద పొంచి శరముల మించి వేసె గదే మించి వేసె గదే సహించ రాదు గదే సహించ రాదు గదే ప్రేమించడాయె గదే | pancha Saramu Deda ponchi Saramula minchi vEse gadE minchi vEse gadE sahincha rAdu gadE sahincha rAdu gadE prEminchaDAye gadE |
చరణం charaNam 2 | సవతి మాటలు చాల విని నను చౌక జేసె గదే చౌక జేసె గదే నాపై చలము బూనె గదే చలము బూనె గదే మోసంబు జేసె గదే | savati mATalu chAla vini nanu chauka jEse gadE chauka jEse gadE nApai chalamu bUne gadE chalamu bUne gadE mOsambu jEse gadE |
చరణం charaNam 3 | వసుధ మానేపల్లి పురమున వాసి కెక్కె గదే వాసి కెక్కె గదే నను బాసి పోయె గదే బాసి పోయే గదే గోపాల స్వామి గదే | vasudha mAnEpalli puramuna vAsi kekke gadE vAsi kekke gadE nanu bAsi pOye gadE bAsi pOyE gadE gOpAla svAmi gadE |