#798 పోకిరి తనములు pOkiri tanamulu

Titleపోకిరి తనములుpOkiri tanamulu
Written ByభీమేశదాసbhImESadAsa
Book
రాగం rAgaరాగమాలిక rAgamAlika
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviరాగం: శంకరాభరణం
పోకిరి తనములు బాగ తెలియ వచ్చె
ప్రక్క ఇంటికి పోపోరా
మాయింటికి రాకరాక పోపోరా
rAga: SankarAbharaNam
pOkiri tanamulu bAga teliya vachche
prakka inTiki pOpOrA
mAyinTiki rAkarAka pOpOrA
గోపాలు గుడికి నే గుంపు తోను పోతే
వీపు వెనక బట్టి అధరము కొరికేవు
కోపము బట్టు నా కొంగుని పట్టక
మాపటి వేళకు మావారు వచ్చేరు
ప్రక్క ఇంటికి పోపోరా
gOpAlu guDiki nE gumpu tOnu pOtE
vIpu venaka baTTi adharamu korikEvu
kOpamu baTTu nA konguni paTTaka
mApaTi vELaku mAvAru vachchEru
prakka inTiki pOpOrA
రాగ: మోహన
నిన్న దాని ఇంట నీవు జేసిన సైగల
పంగేలు జూచెర లలనామణీ నిన్ను
కన్నులెర్రగ జేసి ఖండిత మాడగ
నిన్నది పదమంటి బతిమాలినది తనకె??
ప్రక్క ఇంటికి పోపోరా
rAga: mOhana
ninna dAni inTa nIvu jEsina saigala
pangElu jUchera lalanAmaNI ninnu
kannulerraga jEsi khanDita mADaga
ninnadi padamanTi batimAlinadi tanake??
prakka inTiki pOpOrA
రాగ: ఆనందభైరవి
సరసము జేసేవు సొగసుగాడ నీవు
పరులు జూచెరె నిన్ను పంతము జేసేరు
మరుని కేళిలో నన్ను మమతతో గూడిన
గురువర భీమేశ విఠలుడు ఈ వేళ
ప్రక్క ఇంటికి పోపోరా
rAga: Anandabhairavi
sarasamu jEsEvu sogasugADa nIvu
parulu jUchere ninnu pantamu jEsEru
maruni kELilO nannu mamatatO gUDina
guruvara bhImESa viThaluDu I vELa
prakka inTiki pOpOra
Audio/ Video Linkhttps://www.youtube.com/watch?v=EXYfEubs-os

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s