Title | వగల వయ్యారి | vagala vayyAri |
Written By | పట్రాయని సీతారామశాస్త్రి | paTrAyani sItArAmaSAstri |
Book | Bunch of jAvaLis | |
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వగల వయ్యారి అదిరా ఆ చిన్నారి వగల వయ్యారి అదిరా | vagala vayyAri adirA A chinnAri vagala vayyAri adirA |
అనుపల్లవి anupallavi | సొగసరి జవరాలు తగినింటి మగనాలు మురిపాల హొయల మైమరపించు ప్రియురాలు | sogasari javarAlu tagininTi maganAlu muripAla hoyala maimarapinchu priyurAlu |
చరణం charaNam 1 | అత్తా మామల వదిన బావా మరదుల మగని చిత్త మెరిగిన నెరజాణ యదిరా సరస సరాగాల చనవైన నయగారాల హితులు సన్నిహితు లోహోయని మెచ్చే | attA mAmala vadina bAvA maradula magani chitta merigina nerajANa yadirA sarasa sarAgAla chanavaina nayagArAla hitulu sannihitu lOhOyani mechchE |
చరణం charaNam 2 | ఇంపైన మాటల సొంపైన పాటల తీరైన నడతల తీయని వలపుల నెనరైన పెనిమిటి మనసు దోచి తనువు నెమ్మనము తనివోవజేసే | impaina mATala sompaina pATala tIraina naDatala tIyani valapula nenaraina penimiTi manasu dOchi tanuvu nemmanamu tanivOvajEsE |