Title | వడిగా గోపాలుని | vaDigA gOpAluni |
Written By | మువ్వనల్లూర్ సభాపతి శివన్ | muvvanallUr sabhApati Sivan |
Book | ||
రాగం rAga | మోహన | mOhana |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | వడిగా గోపాలుని వద్ద జేరమని ప్రాయమేల వచ్చేనే వణకుచునె | vaDigA gOpAluni vadda jEramani prAyamEla vaccEnE vaNakucune |
అనుపల్లవి anupallavi | పడకింటికి ఇక పోవలెనే నిన్న పట్ట పాడు దలచి వెరచేనే | paDakinTiki ika pOvalenE ninna paTTa pADu dalaci veracEnE |
చరణం charaNam 1 | పట్టపగలు ఒంటి పడిన సమయమున పైటలో కైవేసెనే యెటులోర్తునని గట్టుక కెమ్మోవి ఎంగిలి జెసెనే నిజముగానే | paTTapagalu onTi paDina samayamuna paiTalO kaivEsenE yeTulOrtunani gaTTuka kemmOvi engili jesenE nijamugAnE |
చరణం charaNam 2 | ఆడ అతడు నాతో ఆడరాని మాటలాడి నవ్వుకొనేనె ఏడాదిగా నను వేడి ఇచ్చకమాడి యేమేమో చేసెనే ముదముతోనె | ADa ataDu nAtO ADarAni mATalADi navvukonEne EDAdigA nanu vEDi iccakamADi yEmEmO cEsenE mudamutOne |
చరణం charaNam 3 | కలికి గోపాలుడు కరములు పట్టుక వలువ విప్పి వేసెనే చెలియ రాత్రి వాడు జేసిన రచ్చలు చెప్ప సిగ్గాయనే యేమందునే | kaliki gOpAluDu karamulu paTTuka valuva vippi vEsenE celiya rAtri vADu jEsina raccalu ceppa siggAyanE yEmandunE |
AV Link | https://www.youtube.com/watch?v=RaIdsQlOQi0&t=8191s |