#519 సారసలోచన sArasalOchana

TitleసారసలోచనsArasalOchana
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaహిందుస్థాని కాఫీhindusthAni kAfI
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసారసలోచన వేచెరా వేమారు నీ రాకకుsArasalOchana vEcherA vEmAru nI rAkaku
1కోరి వలచినదిరా మారు సతికి బ్రతిరా
చేరి కవుగలిడరా యేరిని మది గోరదు చెలి
kOri valachinadirA mAru satiki bratirA
chEri kavugaliDarA yErini madi gOradu cheli
2రాజ వదన యెదను వలరా
జుముదము కదుర శర రాజి బఱుప
బెదరి నిజ రాజ వని నిను శరణనెరా
జగతి రా జగతి రా జనవర మనపవుర
rAja vadana yedanu valarA
jumudamu kadura Sara rAji ba~rupa
bedari nija rAja vani ninu SaraNanerA
jagati rA jagati rA janavara manapavura
3ఆ మగువ నగవు మొగమలకలు వల చెలి
గెలిచెడు నా చెలి సొగసుగ నులు తొగల మిగులు
మరాళ గమన సుమా యరాళ చికుర సుమా వరాల తరువు సుమా
కడాని మిసి మిడాల్ దెలుపు బలుపు జిగి బిగి గొను చనులు
పసిడి కడవల దెగడెడుర
కలికిరా చిలుకరా నత భుజంగ పతి వినుత
A maguva nagavu mogamalakalu vala cheli
gelicheDu nA cheli sogasuga nulu togala migulu
marALa gamana sumA yarALa chikura sumA varAla taruvu sumA
kaDAni misi miDAl delupu balupu jigi bigi gonu chanulu
pasiDi kaDavala degaDeDura
kalikirA chilukarA nata bhujanga pati vinuta

swaram is also available for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.

#518 బాలామణి బిగి కవుగిలి bAlAmaNi bigi kavugili

Titleబాలామణి బిగి కవుగిలిbAlAmaNi bigi kavugili
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaబిళహరిbiLahari
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviబాలామణి బిగి కవుగిలి విడజాలి
జాలిమాలి కనుగొనవేరా
వినవౌరా! యనువౌరా!
కినుక యిటు చనునటర
bAlAmaNi bigi kavugili viDajAli
jAlimAli kanugonavErA
vinavaurA! yanuvaurA!
kinuka yiTu chanunaTara
చరణం
charaNam 1
నతి యనెరా గతి యనెరా
సతి కుటిల గతి నీకు
వ్రతమా? మది కఱుగదుర?
nati yanerA gati yanerA
sati kuTila gati nIku
vratamA? madi ka~rugadura?
చరణం
charaNam 2
బెదరు వారి పొదల దూరి పరుగిడు
సుదతి జేరి మదనుడ దయుడై
మదము మీఱి యెదను దూరి తెఱలెడు
ప్రదరమేఱి పదను నూరి గురి యిడె
bedaru vAri podala dUri parugiDu
sudati jEri madanuDadayuDai
madamu mI~ri yedanu dUri te~raleDu
pradaramE~ri padanu nUri guri yiDe
చరణం
charaNam 3
మంగళ మిక నంగనంగన
భుజంగ శయ భుజంగ పుంగవ
శుభంకర యళులకు రంగట
చిలుకల చెంగట కొలకుల ముంగిట
దానలంగి నలంగి తలంగి తొలంగి
మలంగి మెలంగి కలంగెనురా
మరులు కొనెరా మరతజనురా?
పరాకురా బిరాన రారా
mangaLa mika namganamgana
bhujanga Saya bhujanga pungava
Subhamkara yaLulaku rangaTa
chilukala chengaTa kolakula mungiTa
dAnalangi nalangi talangi tolangi
malangi melangi kalangenurA
marulu konerA maratajanurA?
parAkurA birAna rArA

swaram available with sAhityam for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.