నా పరిశోధనకు పర్యవేక్షకులుగా వ్యవహరించి, అడుగడుగునా నన్ను ప్రోత్సహించిన డాక్టర్ కొండపల్లి సుదర్శన రాజు గారికి, తెలుగు శాఖాధ్యక్షులయిన ఆచార్య ఎలవర్తి విశ్వనాథ రెడ్డి గారికి –
నా పరిశోధనలో క్రీ.శ.1450 నాటికే జావళీ పుట్టిందని నిరూపిస్తూ శ్రీ కొండగుంటూరి నాగభూషణ కవి రచించిన ప్రాచీన అర్వచీన జావళీలతో కలసి ఉన్న “ప్రాచీన నవీన జావళీలు” అనే పుస్తకాన్ని లండన్ నుండి పంపి సహాయపడిన ఆచార్య వెల్చేరు నారాయణరావు గారికి –
నా పరిశోధనకు ముఖ్యంగా సహకరించిన మద్రాసు యూనివర్సిటీ సంగీత శాఖకు చెందిన డాక్తర్ శ్రీ రాఘవన్, శ్రీమతి వేదవల్లి గార్లకు –
శ్రీ పార్థసారథి గారు (ఒకనాటి మ్యూజిక్ అకాడెమీ సెక్రెటరీ), శ్రీ వి.ఎ.కె. రంగారావు, మా సంగీత కళాశాల గురువు గారైన శ్రీమతి బృంద, బెంగళూరుకు చెందిన శ్రీ బి.వి.కె. శాస్త్రి, వీణ శేషన్న గారి మనుమడు వారందించిన సహాయ సహకారాలకూ –
మద్రాసుకు చెందిన శ్రీ చిత్రవీణ నరసింహం రవికిరణ్, శృతి పట్టాభిరామన్ కు –
తెలుగు సాహితీవేత్తలు శ్రీ తూమాటి దోణప్ప, శ్రీ ఆండ్ర శేషగిరిరావు, శ్రీ జి.వి. సుబ్రహ్మణ్యం, శ్రీ ఆరుద్ర, శ్రీమతి పొన్నా లీలావతమ్మ, శ్రీ ఇంద్రగంటి సూర్యనారాయణ, శ్రీ సన్నిధానం నరసింహ శర్మ, సంగీతవేత్తలైన శ్రీ శ్రీపాద పినాకపాణి, శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, శ్రీ రేగుళ్ళ సుబ్బారావు, నృత్యవేత్తలైన శ్రీ నటరాజ రామకృష్ణ, శ్రీ సప్పా దుర్గాప్రసాద్, శ్రీమతి మంజుభార్గవి, శ్రీమతి స్వప్నసుందరి, ఆలయ నర్తకీ మణులైన శ్రీమతి సరిదె మాణిక్యం, అన్నాబత్తుల సోదరీమణులు –
వీరందరికీ సర్వదా కృతజ్ఞురాలను!
సినీ నిర్మాత శ్రీ కె. విశ్వనాథ్ గారికి, ఆకాశవాణి దైరెక్టర్ శ్రీమతి ప్రయాగ వేదవల్లి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
అడిగిన వెంటనే కావలసిన పుస్తకాలను, ఫొటో కాపీలను అందించిన మద్రాసు మ్యూజిక్ అకాడెమీ గ్రంథాలయం వారికీ, గౌతమీ గ్రంథాలయం – రాజమండ్రి, వేటపాలెం (చీరాల) గ్రంథాలయం వారికీ, ఠాగూర్ స్మారక గ్రంథాలయం (విజయవాడ), రామమోహన్ గ్రంథాలయం (విజయవాడ), వాసవీ గ్రంథాలయం (విజయవాడ), కుముదవల్లి గ్రంథాలయం (భీమవరం) వారికి, ఆంధ్రా యూనివర్సిటీ గ్రంథాలయం వారికీ –
నా పరిశోధనకు అవకాశం, అనుమతి నిచ్చిన శ్రీమతి పానాదేవి భర్తియా థియొసాఫికల్ జూనియర్ కళాశాల మేనేజ్‌మెంట్ వారికి కృతజ్ఞురాలను.
చిన్నప్పటి నుండి నా అభివృద్ధిని కాంక్షించి విద్యా బుద్ధులతో పాటు, సంగీతాన్ని కూడా నేర్పించి నన్నీ స్థితికి తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకు –
నా పరిశోధన నిమిత్తం నాతో పాటే శ్రమించి, సహకరించి నా పురోభివృద్ధే ధ్యేయంగా అనుకుని, ఫలితాన్ని అందుకునే సమయానికి, తిరిగి రాలేని లోకాలకు వెళ్ళిన నా శ్రీవారు శ్రీ భావరాజు వేణుగోపాల్ కు –
ఏయే దేశాల్లో ఉంటున్నా, నన్ను నిరుత్సాహ పరచకుండా, సహకరిస్తున్న నా పుత్రులు చిరంజీవి కిషొర్, ప్రకాష్‌లకు, మిగిలిన కుటుంబ సభ్యులకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలవేమో!
ఈ పరిశోధన గ్రంథాన్ని అందంగా కంప్యూటర్ చేసి, సకాలంలో అందించిన డా॥ బి.వి. రమణా రెడ్డి గారికి నా కృతజ్ఞతలు.
– మొక్కపాటి లలితాదేవి