#343 ఏమనెనే కోమలీ EmanenE kOmalI

Titleఏమనెనే కోమలీEmanenE kOmalI
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaఫరుజుfaruju
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviయేమనేనే కోమలి తెలుపవే నీతో
యేమనెనే కోమలి
yEmanEnE kOmali telupavE nItO
yEmanenE kOmali
చరణం
charaNam 1
అంగజుబారికి నిలువదరమటే
మంగళవార్తలు మరియేమే నీతో
angajubAriki niluvadaramaTE
mangaLavArtalu mariyEmE nItO
చరణం
charaNam 2
మోహపయోధిలో మునిగితి నికనే
యూహలు సేయుదు నొకసారి నీతో
mOhapayOdhilO munigiti nikanE
yUhalu sEyudu nokasAri nItO
చరణం
charaNam 3
దాసు శ్రీరామ కవిగీతసుధా
ధారుడైన హరి దయచేసి నీతో
dAsu SrIrAma kavigItasudhA
dhAruDaina hari dayachEsi nItO

#342 ఆ నలినముఖి A nalinamukhi

Titleఆ నలినముఖిA nalinamukhi
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఆ నలినముఖీ అందమదేమీ
దానికే నీకును తగు తగు సామీ
A nalinamukhI andamadEmI
dAnikE nIkunu tagu tagu sAmI
చరణం
charaNam 1
మందుల మారుల మాట పసగడి
బందములాయె భళీభళీ సామీ
mandula mArula mATa pasagaDi
bandamulAye bhaLIbhaLI sAmI
చరణం
charaNam 2
తంతరగత్తెల తక్కులు మిగుల
సంతసమాయె సరీసరీ సామీ
tantaragattela takkulu migula
santasamAye sarIsarI sAmI
చరణం
charaNam 3
దాసు కులాంచిత రామకవి సదా ధ్యానము జేసె హరీహరీ సామీdAsu kulAmchita rAmakavi sadA dhyAnamu jEse harIharI sAmI