4.1.1 జావళీకారులు jAvaLIkArulu

పైన పేర్కొన్న ప్రాచీన జావళీకారుల రచనలతో ఆవిర్భవించిన జావళీలను అర్వాచీనులు సాదరంగా ఆహ్వానించి రచించారు. ఈ కింద పేర్కొన్నవారు అర్వాచీన కాలంలో ప్రధానంగా లభించిన జావళీ కర్తలు.

  • చిన్నయ పిళ్ళై
  • స్వాతి తిరునాళ్
  • మాడుగుల వీరభద్ర సీతారామం
  • నేతి సుబ్బరామ శాస్త్రి
  • రామనాథపురం శ్రీనివాస అయ్యర్
  • దాసు శ్రీరాములు
  • పంతుల బ్రహ్మదేవ కవి
  • బెంగళూరు చంద్రశేఖరయ్య
  • శివరామయ్య
  • పూసపాటి ఆనంద గజపతి రాజు
  • కరూరు దక్షిణా మూర్తి
  • ధర్మవరం రామకృష్ణమాచార్యులు
  • కోట్రీక పుల్లయ్య సెట్టి
  • ద్విభాష్యం పుల్లకవి
  • దంపూరి సుబ్బారావు
  • గబ్బిట యజ్ఞన్న కవి
  • ఆదిభట్ల నారాయణ దాసు
  • దుర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు
  • దుడ్డు సీతారామయ్య
  • మైనంపాటి కామయ్య
  • మైనంపాటి నరసింహా రావు
  • మైనంపాటి హనుమంత రావు
  • గరిమెళ్ళ వేంకటేశ్వర కవి
  • కీర్తి వేంకటరామ కవి
  • కార్యంపూడి రాజమన్నారు కవి
  • తాటితోపు పట్టాభి రామయ్య
  • విద్యల తిరుపతి నారాయణ స్వామి నాయుడు
  • పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
  • ధర్మపురి సుబ్బారావు
  • కరూరు చినదేవడయ్య
  • వీణ కృష్ణమాచార్యులు
  • తచ్చూర్ పెద సింగరాచార్యులు, చిన సింగరాచార్యులు

వంటి పండిత కవులు, వాగ్గేయకారులు కూడా జావళీలను రచించడమే జావళీల విశిష్టతకు గల తార్కాణం. జావళీలోని తుచ్ఛ శృంగారం అనే భావన వారికి ఉన్నట్లయితే జావళీలు రసవంతంగా ఈ మహనీయుల చేతిలో రూపు దిద్దుకొని ఉండేవి కావు.