4.2.4 జావళీల్ని అంకితం పుచ్చుకున్న ప్రభువులు

  • వసుధ వెలయు శ్రీ పీఠి వంశోదధి సుధాకర
    రసికుడౌ దాని చేకోర రాఘవాచార్య సుధీర
  • ఉవిదరో కవిబుధ లోలుని
    గౌరిశెట్టి కుల ఘన కమలాకర సారసారిని శ్రీరాముని
  • వసుధ వెలయు శ్రీ కొరళ్ళ వంశాబ్ధి సుధాకర
    రసికుడ నిను బాయ సుబ్బరాయ వర నామధేయా
  • సదయుడవౌ శ్రీ దినవహి సద్వజ పురుషోత్తమం
    ముదమున నెరనమ్మినార కదశి గౌగలించవేర
  • రాజిల్ల శ్రీ మాణిక్య రాట్కుల సింధు
    ద్విజ రాజ వెంకట గోపాల రాయ పృధ్వీశుని
  • దివిజ పతి ముఖ వినుద బల దేవ రసిక భుజగ వరుని
    యవిరళ రతి సుఖ సంపద లబ్బు నోయికనబ్బ
  • వనిత శ్రీ కూల్లిపర వంశజుడు శ్రీరాములు
    ఘన మరుబారికి గలహ ద్రోచినం గలయడాయనే
  • తిరుమల దేవరాయ కరివీరకాదీయ
    కరుణతో జూచి గైకొనెనే ఓ
  • సుదతి శ్రీ రావు వంశజ సూర్య నృపతి మది గోరి
    ముదితా యిటు వున్న దాని మోసబుచ్చుట పాయమోవో
  • పంతమున తటాలున లేచి పైట కొంగు జారగా
    కాంత దొంతర విడమొసంగా కౌగలింపు చుండగా
    సోమ భూపాల రమ్మని భామ ప్రేమ మీరగా
    కామకేళి లోన మిగుల కలసి మెలసి యుండగా
  • రావు కులజ మహారాజ కుమార పావప సూర్య నృపాలక యేరా
  • ధైరకయ పిఠాపురి ధాముడవౌ శ్రీ
    సూర్య రాయ సుగుణ విధేయ
    చర్యనుతించిన నీ పర్యార మాశ్చర్య మాయ
  • నాగభూషణావను డిటునలు వురిలో మిగులా
    పోగు జేయదలచి యా యువతి వలలో దగుల
  • వామాక్షి వినవే రావు వంశోదధి సోముడైన
    కామిత మిచ్చెడు గంగాధర రామరాజ
  • తల్లి తండ్రియు నీవే దైవము నీవే
    కల్లగాయె వేంకట సుబ్బరాయేశ
  • కామకేళిలోన కామి నిన్నె చాల
    ప్రేమతో గూడేలిన చామ భూపాలుని చేత
  • అందరు నా గంగానిటు లాచరింలందా మేని
    యందాకాడ శ్రీ కలి రాజా యజ్ఞ భాస్కరాయా పోషా
  • మరువము వున్నిక మనసున వెన్నక
    సరస నారాయణ రాయా సౌస్థవనీయా
  • సోమగోపాల రమ్మని భామ ప్రేమ మీరగా
    కామకేళి లోన మిగుల కలసి మెలసి యుండగా
  • రాజ రాజ రాజ రాజ రాజశేఖరా
    మహారాజ నాజ నామనవి వినవదేమిరా
  • రాజా వేంకట రామా రాయ భూపాలుడు
    భోజరాజ రాజ రాజ నిభుడనియా
    రాజా వాయతనేత్రి రాయబారము సేయ
    యా జీవమని నమ్మినందు కిటులాయెనే
  • దలచుటేల బుచ్చి తమ్మయ్య భూపాల
  • చిన్నరాయ రామ చిన్నరాయ నృప శీలుని కడువడి