5.1 తెలుగు జావళీ – భాషా వైలక్షణ్యం

ఏ సాహితీ ప్రక్రియకైన దాని మనుగడ, వ్యాప్తి, ఆ సాహితీ ప్రక్రియ స్వీకరించిన భాషపై ఆధారపడి ఉంటుంది. భాషాపరంగా దేశి భాషకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చినట్లయితే ఆ ప్రక్రియ అధిక సంఖ్యాకుల ఆదరణకు నోచుకుంటుంది. సామాన్య జనానికి కూడా అందుబాటు లోనికి వస్తుంది. తద్వారా బహుళ ప్రాచుర్యాన్ని పొందుతుంది.

పద కవితా పితామహునిగా ఖ్యాతి వహించిన సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమాచార్యులు భాష విషయంలో అత్యంత శ్రద్ధను కనపర్చాడు. పండితామోదం కోసం సంస్కృత పదాలతో ఉన్న సంకీర్తనల్ని ఒక వైపు రచిస్తూనే, పామర రంజకంగా ఉండేందుకు వ్యావహారిక భాషను, జన వ్యవహారంలో నిత్య నూతనంగా ఉండే సహజ సిద్ధమైన వ్యావహారిక పదాలను యథాతథంగా ప్రయోగించాడు.

అన్నమయ్య శ్రిష్ట వ్యవహారానికి, సామాన్య ప్రజా వ్యవహారానికి, గ్రాంథికానికి మూడింటికీ సమానమైన ప్రాధాన్యాన్నిచ్చాడు. తెలుగు భాషకు సహజ సిద్ధంగా సంక్రమించే నుడికారపు సొంపుల్ని, పలుకుబడుల్ని, జాతీయాల్ని, సాంఎతల్ని ఎన్నెంటినో ప్రయోగించాడు.

ఈరుదియ్య బేను వచ్చు (1)
తల్లికి లేనిది ముద్దు దాదికా (2)
ఉప్పు చిందినుమడించె (3)
కట్టు వదలిన క్రేపు (4)
వంటి జాతీయాలు

అంగళ్ళు ముంగిళ్ళు (5)
చింతలు సిలుగులు (6)
ఒరపో మెరపో (7)
అనలు కొనలు (8)
వంటి జంట పదాలు

కన్నుల మొక్కు (9)
వలపు బండ్ల వచ్చు (10)
అట్టలు గట్టి నవ్వు (11)
కారపు బొంకులు (12)
వలపు గంప చెట్టు (13)
వంటి సజీవ భావ బంధురమైన ప్రయోగాల్ని గ్రంథస్థం చేశాడు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి పస్తోందంటే – ప్రక్రియల్లో, ముఖ్యంగా గేయాత్మకంగా, లయాత్మకంగా సాగే ప్రక్రియల్లో జన సామాన్యాన్ని ఆకర్షించేందుకు భాషలో నిత్య జన వ్యవహారంలో ఉన్న పదాల్ని వాడడం మహత్ప్రయోజనకారి అవుతుందని మన తొలి తరం వాగ్గేయకారులే గుర్తించారు. క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వారు కూడా సజీవ పద ప్రయోగాలకే అధిక ప్రాధాన్యాన్నిచ్చారు.

భాష నిత్య పరిణామ శీలం కలిగినటువంటిది. మారే కాలంతో వచ్చే భాషా ప్రయోగాల్ని గుర్తించి, వాటిని తమ రచనలలో ప్రయోగిస్తే సమకాలీన సమాజానికి దగ్గరగా ఉంటుంది. అంతే కాక, తదుపరి తరాల వారికి, ఆ తరం తాలూకూ జాతి, భాషా, సంస్కృతుల చరిత్రని అందించే మహత్భాగ్యం కలుగుతుంది. అదే విధంగా తెలుగులో వివిధ కాలాలలో వచ్చిన జావళీలలో కూడా వ్యావహారిక భాషకే ప్రాధాన్యత నిచ్చినట్లు కనిపిస్తుంది.

జావళీలలోని భాషా విశేషాల్ని పరిశీలించగా సాధారణంగా జావళీలు అచ్చ తెలుగు పద భరితాలై ఉండడం కనిపిస్తుంది. వాడుక భాషా పరిమళంతో జావళీల భాష సరళ మధురంగా ఉంటుంది. జావళీల నుండి సేకరించిన కొన్ని అచ్చ తెలుగు పదాలు:

అగడుఅడవిఅప్పళించు
అమ్మకచెల్లఅరమరలేలనెఆరడించెనె
ఆలిముచ్చుఉగ్గలింపుఏరాలు
కటకన్నడశాయకుకాపటికుడు
కారుచిచ్చుకాకకుస్తరించుక్రొమ్మించు
గురుపాటుగారడమేలాగాసిచేయు
గోడుచట్టిచేతికిచ్చుటచెయ్యన
చలముచలువరేడుచాడికోరు
చాడిచెప్పుచిటుకు మంటే కోపమైతేచిన్నెలు
చిరుత ప్రాయముచీటిచులకన
చేతి సంచిచేతిలో చేయి వేసిచౌక సేయకు
జాన జోడిగం తరచు మ్మాటలు
 తలతడిపి తత్తరించు తాటొటము
 తొగవిందు తోరంబు దాపురించు
 దారి చూచు దురుసుగ నన్నే మారజేసేవేల నా జోలి నీకేలనే
 నాణెంపు పలుకుల నిల్తాము నెలవెన్నెల
 పగటి మోసగత్తె పదనించె పస
 పిలువ పిలువ బిగువులాయే పిల్ల చేష్టలు పైట కొంగు
 పొగరు మాటలు ప్రొద్దాయె పోకిరి కుక్కలు
 పోరా బజారి బలిజ యేల బాలామణీ
 బడ్డాయి సేయకు బాగాల్ గొని బాస జేసెనె
 బాసలుంచుట బావి నీళ్ళు వెల్ల్లిగొన్నదిరా బాళి
 బిగువులాయె బువ్వకై రుసుము బూటకము
 బేజారము బేజారకు మంచి వాడవలేరా
 మగని కోత మదిగట్టిబడి మరుబాసరి కోర్వలేనురా
 మరులు కోసం మాట తప్పి యున్నవాడు మిన్నానంటి యుంటి
 ములుకు మొలక ప్రాయము రచ్చ బెట్టు
 రవ్వ సేయ రాపు సేయు రాపేల జేసేవు
 రాతి మనసు గల నారి పంచనాపర వగల మాటలు
 మేజారెను ముట్టవద్దురా వగలాడి బోధనలు
 విడిది విన్నాణపు దొంగ వెగటాయె గదె
 వెక్కసము సద్దు శాయక సిగ్గు తియ్య బోకురా
 సొక్కించు హొయలు 

“యకారంబును, వు, వూ, వొ, వోలు తెలుగు మాటకు మొదట లేవు” (14) అని చిన్నయ సూరి బాల వ్యాకరణంలో సూత్రీకరించారు. లక్షణయుక్తమైన భాషకు ఈ నియమం వర్తిస్తుంది. కానీ జావళీలు జన వ్యవహారం కోసం వాడుక భాషలో రచించి ఉండడం వల్ల పదాది యకారం కనిపిస్తోంది. అయితే ఇక్కడ –

“సంధి లేని చోట స్వరంబు కంటెం బరంబయిన
స్వరంబునకు యడాగమంబగు” (15)

అన్న చిన్నయ సూరి సంధి పరిచ్ఛేదంలో పేర్కొన్న సూత్రాన్ని అనుసరించి, సంధి రాని చోట వచ్చే యడాగమాన్ని వాడడం జావళీల్లో కనిపిస్తుంది.

(1) అన్నమాచార్య సంకీర్తనములు – 29 – 260
(2) అన్నమాచార్య సంకీర్తనములు – 8 – 163
(3) అన్నమాచార్య సంకీర్తనములు – 13 – 463
(4) అన్నమాచార్య సంకీర్తనములు – 12 – 75
(5) అన్నమాచార్య సంకీర్తనములు – 14 – 162
(6) అన్నమాచార్య సంకీర్తనములు – 2 – 118
(7) అన్నమాచార్య సంకీర్తనములు – 12 – 129
(8) అన్నమాచార్య సంకీర్తనములు – 3 – 126
(9) అన్నమాచార్య సంకీర్తనములు – 24 – 472
(10) అన్నమాచార్య సంకీర్తనములు – 26 – 221
(11) అన్నమాచార్య సంకీర్తనములు – 15 – 178
(12) అన్నమాచార్య సంకీర్తనములు – 26 – 257
(13) అన్నమాచార్య సంకీర్తనములు – 26 – 18

(14) బాల వ్యాకరణం – సంజ్ఙా పరిచ్ఛేదం – సూ. 17.
(15) బాల వ్యాకరణం – సంజ్ఙా పరిచ్ఛేదం – సూ. 3.