జావళీలలో పదాది యకారాది పదాలు కనిపిస్తాయి. వ్యవహార భాషలో పదాది యకారం తెలుగు నాట ప్రచురంగా ఉండేదని చెప్పడానికి ఈ జావళీలలోని పదాది యకారం మంచి ఉదాహరణ.
| యంతపచారము | యవ్వరికైనా | యింత దుఃఖము |
| యిన్నాళ్ళవలె గాదు | యీశ్వరాజ్ఞ యేమో | యెంతని నే నిటువేడుదు |
| యెంత పాపమింతినైతినే చెలి | యెంతటి మాయ జేసే | యెందాక జూచిన |
| యెందుకురా కోపము | యెటువలె సైతురా | యెట్లు సైతురా |
| యెమ్మికాడు | యేమందునె చెలియా | యేమని సహియింతునే |
| యేమి సేతు సామి | యేమొగాని | యేరా మోడిసేయ |
| యేల బొంకితివి | యేలర నాపై చాలుర మోహము | యే లలనామణి |
యావత్తు చేర్చి అచ్చు వేయడం ఇక విశేష ప్రయోగం. పాడడంలో కూడా యావత్తుతోనే పాడడం కనిపిస్తోంది, వినిపిస్తోంది.
| అరమనియాలరా | చెలి మనక్యాలనే | తగున్యాలరా |
| తిరిగి చూడన్యాలనే | తోడి త్యావే | పక్కకు త్యావే |
| బూటకమ్యాలర | నిదుర్యాలక యుంటినే | చలమ్యాలనే |
| వాని కౌగిట మనక్యాలనే | పోపోవే చెలయారాప్యాలనే | రంగుల విడమ్యాలనే |
ఈనాడు “ఏల” అనే చోట జావళీలలో “యాల” అనే హల్లుతో అచ్చు వేయడం, పాడడం కనిపిస్తోంది.
| ఇకయాలనె | ఇటు సాహసము యాల నాపై | ఉంగలింపుయాలనె |
| కోపము రాదా యవ్వరికైనా | కౌగలింపు యాలనే |