అచ్చ తెలుగు భాషలోని స్త్రీ పర్యాయ పద ప్రయోగాలు అసంఖ్యాకంగా జావళీలలో చోటు చేసుకున్నాయి.
అలరుబోణి
అతివ
ఇంచుబోణి
అబల
చిగురుబోడి
ఇంతి
ననబోణి
ఉవిద
పూబోడి
కలికి
విరిబోణి
కన్నెరో
కాంత
కులుకులాడి
కొమ్మ
చిటుకులాడి
కోమలి
టక్కులాడి
చాన
మాయలాడి
చిన్నది
వనలాడి
చెలియ
వన్నెలాడి
చేడియ
హోయలాడి
జవరాలు
జావరో
చిలుకల కొలికి
నెలత
మన్మధ మొలికి
పడతి
వలపుల కలికి
పణతి
పొలతి
తమ్మికంటీ
ప్రోయాలు
వాలుగంటి
బజారి
బోటి
మగువ
పసిగోల
మిటారీ
మగనాలు
ముదిత
లేమ
వయారి / వయ్యారి
వెలది
స్త్రీ సౌందర్యాన్ని వర్ణించే సందర్భంలోనూ వ్యక్తీకరించే ప్రయోగాలలోనూ సంస్కృత సమాసాలలో కూర్చిన పద బంధాలను జావళీ కర్తలు రసరమ్యంగా ప్రయోగించారు. నడక, కళ్ళు, అధరం, ముఖం, కంఠం, శిరోజాలు ఇలా వేటికవే వివిధ రూపాలలో జావళీలలో వర్ణించబడ్డాయి. స్త్రీల హావభావ విన్యాసాల్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రయోగించినట్లు ఈ ప్రయోగాల వల్ల తెలుస్తోంది.