తెలుగు జావళీలలో పురుషులకు పర్యాయ పదాలుగా వాడే పదాలు సాధారణంగా అచ్చ తెలుగుకు సంబంధించిన పదాల్నే ప్రయోగిస్తూ ఉంటారు. తత్సమ పదాలను కూడా పురుష వాచక ప్రయాయ పదాలుగా వాడడం కనిపిస్తోంది.
అచ్చ తెలుగు:
| అందగాడు | కాపటికుడు | ఎమ్మెకాడు | కుందకారి | ఎమ్మెలాడు |
| చెలువుడు | కోడెకాండ్రు | దోసకారి | మోసకాడు | నెరజాణడు |
| వన్నెకాడు | చక్కని సామి | విటకాడు | చొక్కపు దొర | సొగసుకాడు |
మొదటి పదం తెలుగు, రెండవ పదం సంస్కృతంతో తయారు చేసిన మిశ్ర సమాస ప్రయోగాలు కూడా జావళీలలో క్వచిత్కంగా కనిపిస్తున్నాయి.
ఉదా: మగ ధీరుడు
తత్సమాలు:
| ఉదారుడు | మనోహరుడు | కాంతుడు | రసికుడు |
| కోమలాంగుడు | శ్యామ సుందరాంగుడు | జారచోరుడు | సరసుడు |
| పంగనామముడు | కమల నేత్రుడు | ప్రాణ సఖుడు | నీరజాక్షుడు |
| ప్రియుడు | సరసిజాక్షుడు | సారస నేత్రుడు | మారకోటి సుకుమార |
| జార శిఖామణి | మార సుందర | ధీర | గంభీర |
| ప్రాణనాథ | సదయుడ | ప్రియ | సుందర |