తెలుగు భాషా సౌందర్యాన్ని ఇనుమడింప జేసేవి, కొన్ని ప్రత్యేక అర్థాలలో ప్రయోగింపబడేవి, ఆయా భాషా వ్యవహర్తలకు మాత్రమే అర్థమయ్యేవి, అన్య భాషా వ్యవహర్తలకు సులభ గ్రాహ్యాలు కానివి, సజీవ భావ బంధరమైనవీ, సమకాలీన సామాజికాంశాల ప్రాధాన్యం కలవీ కొన్ని పదాలు కలిసి కొన్ని విశిష్టార్థాలలో రూఢి అయ్యేవీ అయిన జాతీయాలు భాషా ప్రత్యేకితను వ్యక్తపరుస్తాయి.
అటువంటి తెలుగు భాషలోని జాతీయాలను జావళీలలో ప్రయోగించడం అధికంగానే కనిపిస్తుంది. ఉదాహరణకు కొన్ని:
| అత్తింటి కోడలు | నివురు గప్పిన నిప్పు | అమ్మక చెల్ల | బుర్రకు మసి బూసి |
| అలసి సొలసి | భత్య ఖర్చు | ఆ బ్రహ్మ నన్నట్లు పుట్టించెర | మంచికి మంచి లేదు |
| కనుల నీరు కడవలై పార | మందు తలకెక్కె | కన్ను మిన్ను ఎరుగుదుర | మనసు గిల్ల రాకురా |
| కన్నుల పండువ | మాటిమాటికీ | గవ్వ దొరకదు | రాతి మనసు గల నాతి |
| గిరి గీసి గిరి లోన | రేపటి మాపటి | చెక్కిలి గొట్టగ | రేయి పగలు రెప్పపాటు లేక |
| తీరెనురా నీ ఋణము | వలలో చిక్కి | దిక్కు లేని పక్షి | వన్నెచిన్నెలు |
| నా రాత యనుకొంటినే | సంతోష సముద్రం | నిదుర కంటికి రాదు గదవె | సద్దు శాయక |