ఒక జాతి జీవ నాడిని పట్టుకుని హితబోధ గావించే పద్ధతిలో నీతిని అందించేవిగా సాంఎతల్ని పేర్కొనవచ్చు. పెద్దవారి అనుభవం, ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, అజ్ఞాత కర్తృత్వం మొ॥ లక్షణాలు కల ఈ సామెతలు భాషా వ్యవహర్తల జిహ్వాగ్రాలపై సజీవంగా నిలిచి, పారంపర్యంగా సంక్రమిస్తాయి.
తెలుగు భాష లోని నుడికారపు సొంపులతో పాటుగా సామెతల మాధుర్యాన్ని కూడా జావళీలు పొందుపరిచాయి.
- అందని మానిపండ్లు
- అందరాని పండ్లగా చెందిన పొందుగాను వృధా పోవును
- ఎంచిన మేడి పండ్లు
- కోరి పిలువగానే శుక్రవార మన్నట్లు
- గులాబి పువ్వు విడిచి మోగవిరి గొన్న రీతి
- చల్లకి వచ్చి ముంత దాచ నేల
- నీటి మూట తోటి సాటి బూటకము లేటి
- నీరజాక్షుల మాట నీళ్ళలో మూట
- బూరుగు చెంత వలచి నిలుచు చిలుక సామెత
- మనసు నందొకటి మరి వాక్కు నందొకటి
- ముంజేటి కంకణముల కద్దమేల
- రెంటా చెడిన నావంటి
- ఎండమావులు పగిది
- వనితల గోడ బెట్టిన రీతి బొంకెదరు
- సారసరిపుని గోరుచకోర గతి
వంటి సామెతలు అసంఖ్యాకంగా జావళీలలో ఉన్నాయి.