ఒకే వర్ణం పదే పదే ఆవృత్తి కావడాన్ని అనుప్రాస అంటారు. ఒకే పల్లవిలో కొన్ని కొన్ని అక్షరాల వ్యవధానంతో ప్రయోగించే సాదృశ్యాక్షరాలు ఆ జావళీని చదివినా, పాడినా, శబ్ద సౌందర్యాన్ని పెంచి, వినడానికి ఇంపుగా, సొంపుగా అలరారుతాయి.
శబ్దాలంకార ప్రాధాన్యం రచనకు అంతా ఇంతా అని చెప్పలేం. చక్కని ఏరు పారినట్లు, మెల్లగా పిల్ల తెమ్మర వీచినట్లు హృదయానంద సంభరితమైన శబ్ద సౌష్టవంతో కూడిన రచన జావళీల సొబగును ఇనుమడింప జేసింది.
ఉదాహరణకు కొన్ని:
- ఇమ్ముగ తను నెర నమ్మితినని పగలు నమ్మిక లిగిదో
కొమ్మని నే పొమ్మని రమ్మని కొమ్మని మ్రొక్కుచు
ముమ్మారు బిలచిన సమ్మతించడే చెలి - మద్దు వద్దు నా వద్దికి వచ్చియొ ముద్దియ తద్దయో
ముద్దివ్వ లేదా – అద్దిర యద్దిని బుద్ధులు వినమో
గద్దించి యీ ప్రొద్దు వద్దు రావద్దన - చిన్నె లెన్నో సేతురా, చిన్ని పలుకులు చాలరా
కన్నె మనసటు మరగితే నిన్ను యేలుట సున్నరా - పిల్ల జల్ల చెల్ల రాయ వల్ల గాదు మళ్ళి పోర
- దుడుగు మనము వాని పైకి – ముడివడ దడబడి
వానితో కడువడి నేస్తము జేసితి - నీ యందంబు – చందంబు – బెందంబు – సందలచి
- మేరగాదు వేవేగయే రారో సారెకు – నీ రాక – నారయచు
- ఉయ్యాల మంచము నూచకురాయది
కయ్యాల గయ్యాళి అయ్యెయ్యో నీతో - నీటి మూట తోటి బూటకము లేటికి
- మితి లేక నే నతి యాసతో తరి కేళికి బతిమాలగా
నాతిరావే యని కేలెత్తి నని బిలచుట - నీరుదాగిపుడె బారి వచ్చేనని తొరుగ తీరున జోరుగ బల్కేవే
సారి నోరూరగ దారి జూచేటటు క్రూరవేరె మీరిపోయె - కమ్మ విల్తుడేయు అమ్ముల పోటున
రొమ్మున నాటన కమ్మ వ్రాసిచ్చిన
కొమ్మనంపి వేగ తోడి తెమ్మని దాని పొమ్మని బలికిన