5.3 అంత్య ప్రాసలు

అంత్య ప్రాసలు జావళీ నడకకు అందాన్ని చేకూరుస్తాయి. కొన్ని అక్షరాల్ సముదాయం క్రమబద్ధంగా పల్లవి అంతంలో గానీ, చరణాల అంతంలో గానీ, సమానంగా ఉండడం వల్ల రచనకు అందం పెరుగుతుంది.

ఉదాహరణకు:

  1. చేతిలో చెయ్యి వేసి చెంతకు చేరదీసి
    బోదురు యెడబాసీ బుర్రకు మసి బూసీ
  2. నారీ మరునిచే కఠారి వాలు చూపుల దారి
    నడతల వయ్యారి చిన్నారి పొన్నారి కన్నారీ
  3. నాతీ సంపూర్ణ చంద్రవతీ నడతతో గుణవతీ
    జాతిలోకాళవతీ మదవతీ నాదాతీ సుదాతీ
  4. ఈశా! శ్రీ చత్రపురీశా శ్రీ జగన్మోహనసంకాశ
    సరస నాటక విధీశ వద్దేశ ప్రాణేశ లోకేశ
  5. జాణరా! అలివేణిరా! పూబోణి పల్లవ పాణిరా
    దానిగూడని జన్మమేలరా! మానినీ మణినేలరాశ
    సారసంబును బోలురా! కమలారి రసహసించురా
    సారసాక్షి ముఖము ముకురము మీరురా!
  6. పెంచూ! రతి కేళి మెప్పించూ
    చాలగ వలపించూ సరసము దేలించూ
    మిప్పించు మేలించు లాలించు
  7. ఏరా! రారా! చెయి తేరా!
    ఈ మరుబారికి తాళగలేరా
  8. కోపమెంతో చాలాల కోమలశీలా
    రాపు జేసేవేలా రాజగోపబాల
  9. గండు కోవెలలు గూయ కమలాల కాకసేయ
    మెండు తుమ్మెదలు మ్రోయ గుండె ఝతఝత మనెనేయ
  10. నినుబాసి నిదుర రాదు నిమిషమైన ప్రొద్దుపోదు
    మనసిజు బారి కోర్వరాదు మమత నిలువ వశము గాదు