5.6 విరహ వ్యక్తీకరణ ప్రయోగాలు

విరహిణి భావాలను వ్యక్తీకరించడంలో జావళీకారులు పూర్వ కవుల పద్ధతినే అనుసరించారు. ప్రకృతిలోని వెన్నెల, పూవులు, శుకపికాలాపాలు, విరహంలో ఉన్నవారికి బాధ కలిగించే విధానాన్ని రమ్యంగా జావళీలలో వర్ణించబడ్డాయి.

  • వెన్నెల రేయిని వేడిమి తాళను
  • వెన్నెల గాయగ మిగుల తాపమాయనే
  • నెలవెన్నెల వేడిమిచే
  • కోన వెన్నెలాయరా
  • కమలవైరి కాకలకేకంది యుండు
  • చల్లని కలువల రాయుని చలువ కాకాయనె
  • కలువల రాయుని కాక మెండాయె
  • చలువరేడు గాయమె సెగదోచెనే – యెటువలె సైతునే విరహము
  • కన్నుల పండువై కాచెడు వెన్నెల మనసు కెంతో గాసిని పుట్టించెనే
  • వెన్నెల నా మదికి వెగటుగ దోచెనే
  • వెన్నెల కాకల వెత జెందలేనే
  • వెన్నెల బోరున గాచెరా ప్రియ
  • కన్నుల నీరు కడవలై పారెనయ్యో
  • తల వాకిలిల్లుగ తలచియుందు గదర
  • నిద్దుర కంటికి రాదుగదె
  • అన్నము నోటికింపుగ లేదె – నానుబాల జుంట తేనియె చేదే
  • రేయి పగలతని రాక జూచి నా రాత యనుకొంటి
  • మీరిన శోకము లేరీతి తీరు
  • నిను బాసి నిదుర రాదు నిమిషమైన ప్రొద్దుపోదు
  • చక్కెర విలుకాని పోరు యెక్కువలాయె
  • పెను పామువలె కాముండిటు వేమూరు శరముల్ వేసె

నాయకుడికి నాయిక ప్రియమారగా ప్రేమలేఖ రాసి చెలి చేతికిచ్చి పంపడం, తనకు సమాధానంగా కమ్మ రాయమని వేడుకోవడం, తాను పంపిన లేఖను ప్రియుడు చదివాడా లేదా అని తెలుసుకోవాలనే కుతూహలాన్ని నాయిక ప్రదర్శించడం మొ॥ విషయాలు జావళీలలో చోటు చేసుకున్నాయి.

  1. ఉత్తర మంపిన చదువుకొనెనా
  2. నే వ్రాయు చీటి చూచెనా
  3. కమ్మ విల్తుడేయ అమ్ముల పోటున
    రొమ్మన నాటిన కమ్మ వ్రాసిచ్చిన
    కొమ్మునంపి వేనతోడి తెమ్మనవే దాని పొమ్మని బల్కిన
  4. హెవెన్ మన్యునుండి నీకు లెటర్స్ పంపగా