సంభోగ శృంగారాన్ని వర్ణించడానికి జావళీలలో వాడే పదాలు:
| కంతుని కేళి | జాము కేళి | ననవిల్తుని కేళి | చిత్తజు కేళి | పచ్చవిల్తు కేళి |
| మరు కేళి | రతిపతి కేళి | బంధగతుల చేత జీవేశ్వరుని మెప్పించినదెల్లా | ||
కామశాస్త్రంలో పేర్కొనబడిన ఎనుబది నాలుగు బంధాలే కాక కుక్కుటాహి బంధాలు వంటివి కూడా జావళీలలో ప్రసక్తమయ్యాయి. బంధగతులలో జీవేశ్వరుని మెప్పించాలనేది జావళీకారుల దృష్టి.
పరమేశ్వరునిలో ఐక్యం చెందడానికి జీవుడు ఎంచుకున్న మధుమయ మార్గం ఈ శృంగార మార్గం.
చారునానా బంధోరుచాతురీ (రతిక్రీడా విశేషము)
కౌగిటనెనబటి నాలుగు విధముల గరిడీలు గరపినది.
కుక్కుటాహి బంధముల ముక్కువ పెంపన రతి స్రుక్కజేసి నిక్కముగ
చిత్ర బంధముల చేతి రతి చేయ స్తోత్రము చేసితి.
మన్మథుడు, అతడి పరివారం, అతని బాణాలను విల్లునూ వర్ణించిన విధానం:
- ఈ సుమ శరుని చిగురాకు బాకు
- కాముని బారి
- చక్కెర విలుకాడు శరముల నేసెనె
- కమ్మ విల్తుడు ములుకులేయ
- కాముని విరి శరములు
- సుమ శరుడు
- గండు కోవెల గూయ – కంజారి కాకశేయ
- చల్లని కలువల దాయని చలువ కాకాయనె
- సరగున యిటు జలజ శరుడు నేడు పూని బాణము లేయు
- చిగురు విల్తుడు ములుకులేయ
- కమ్మ విల్తుడు శరము వేయ
- కలువల దొర నాపై సాధించెరా పగ
- తుంట విలుకాడు తనూజంట శరముల
- సరుశరములు
- విరిశరముల బారిని
- మకరాంకుడు వడి పదునగు శరముల నెదపై గ్రుచ్చె
- పూల వింటి వాని పోరు యేలా సైతురా
- కమ్మని విల్తుని గాసి దీర్చనా
- చిలుక రౌతు విరి ములుకులురమునను బలముగ నాటగ
- మారూచాపంబు గల నీపోరు
- కమ్మ విల్తుడేయు అమ్ముల పోటు రొమ్ముల నాటిన
- కుందకారి నిబ్బరించి నందనేడు నొప్పింపుట
ప్రియుణ్ణి వశపరుచుకోవడానికి ఆనాడు మందు పెట్టే పద్ధతి ఉన్నట్లు కొన్ని జావళీలలో వ్యక్తీకరించబడింది.
- అలదాని మాయము వలచిన సామికి తలపనె మందు తలకెక్క
- ఇందుముఖీ వానికెంతటి మందు బెట్టెనో
- ఇందీవరాక్షి బెట్టు మందు తలకెక్కె సఖీ
- తరుణీ బెట్టిన మందు తలకెక్కెనటరా
- తరుణి ఎట్టి వలపు మందు బెట్టెనో
- నా సరసునికేవా సవతీ యెవతో మందు యెందు బెట్టెనో
- మందయాన యెవతె నీకు మందు బెట్టెరా
- మాయలాడి నా సామికి మందు బెట్టెనే
- సుందరి యిడు యా మందుల చేతను పొందగోరువట
- హా సఖా నిను యే సఖీమణి గాసి మందు రాసెరా