తెలుగు భాష నిత్యం మార్పులకు లోనై, కాలానుగుణ్యంగా రూపాన్ని మార్చుకునే, అభివ్యక్తికి పరిపూర్ణమైన భాష. ప్రాచీన కాలంలో సంస్కృత ప్రాకృతాది భాషా పదాలను తత్సమ తద్భవాదులు రూపంలో స్వీకరించి, అసంఖ్యాక పదజాలంతో పరిపుష్టిని పొందింది. ప్రాచీన కాలం నుండే అన్యభాషా పదాల వ్యవహారం కావ్యభాషలో కనిపిస్తోంది. “అహేయమన్య దేశీయం యత్తదేవ ప్రయుఝ్యతే” – హేయము కాని అన్యదేశ పదాలు ఏవయినప్పటికీ యథాతథంగా ప్రయోగించవచ్చని శాస్త్రం కూడా ఆమోద ముద్ర వేసింది. దానితో తెలుగు భాషలో పారశీ, ఉర్దూ, అరబ్బీ, పోర్తుగీసు, ఆంగ్లం వంటి అన్యదేశ్య పదాలు మాత్రమే కాక, భారత దేశంలో వివిధ రాష్ట్రాలలో వ్యవహృతమవుతున్న ఆంధ్రేతర భాషా పదాలు కూడా తెలుగు భాషలోనికి వచ్చి విడదీయరానంతగా కలిసిపోయి తెలుగు భాషలో విలీనమయ్యాయి. అలా ప్రవేశించిన అన్యదేశ్య పదాలు కావ్య ప్రక్రియలలో కూడా స్థానాన్ని సంపాదించుకోగలిగాయి.
ఈ నేపథ్యంలోనే తెలుగు జావళీలలో కూడా అన్య భాషా పదాల ప్రయోగం బాహుళ్యంగా కనిపిస్తోంది. ఉదాహరణకు:
- హిందుస్థాని కాపి – ఆది (Posted at https://javali.blog/2020/07/23/151-%e0%b0%98%e0%b0%a8%e0%b0%b0%e0%b0%be%e0%b0%af-ghanaraya/)
ఘనరాయ రాయుని బిల్వబోయనెనె చెలి
అబలనైనను నాపై అలుక బూనకు మంటె
హైసోమజాహూన్మే యని యాదర్బాల యించి యాజ్ మేలాయనెనె
తగదు చైబట్టుట మగనానేనంటె
అగజారి చుంబిణీ వోనైయాతో కంజార్దేఖో యనెనే చెలి
అత్తమామలు వింటే రిత్త కాపురమవునంటే
అత్త గిత్త కుచ్చునై కర్తె గిర్తె తుక్యావు య్దరా ననెనె
సరస గోపాల నాడు సంగతి చాలించు మంటే
అంగుబిడ్డ సమయ మందు చెంగులు పదలదీసి వేడేమొ జేసెనె
2. హిందుస్థాని – అట (Posted at https://javali.blog/2020/05/29/42-%e0%b0%aa%e0%b0%82%e0%b0%a4%e0%b0%ae%e0%b1%81-%e0%b0%b6%e0%b0%be%e0%b0%af%e0%b0%95%e0%b1%81-pamtamu-sayaku/ )
పంతము శాయకు పణతిరో నాపై
ఎంతయు జెప్పిన వినవేమో మాయ
కాంతామణి నీ చెంతను జేరితి
సంతరించుమని జాలగ వేడితి
ఇత్తరి లేవు నక్కిత్తనై కోపమో
పతి యెరియుదెన్ పాపమో ఖర్మమో
మయ్యల్ మీరుదే మయిలే కుయిలే
మల్లిగై ముల్లిగై మాదళం పూవే
చయ్యన జేర్చుము నీ పుణ్యముండున
అన్యుల మాటవిని అలసట బెట్టకు
దిక్కు నీవని దిక్కు జేరితిని
దక్కితివని నీకు చాలగ మ్రొక్కితి
అక్కరుడో యెన్నై యాదరిత్తుకొళ్ళుం
పక్కత్తిల్ పార్తేన్ పరన్‌దోడాడే
అల్లుం పగలుం ఉన్నై నంబిక్కొండిరుందేన్
వంబుగల్ సెయ్యాదె మాడళం పూవే
చల్లగ నాతో పలికిన చాలును
సల్లాపము నాతో సలిపిన చాలును
వాసిగ తిరువల్లిక్కేణిలో నెలకొన్న
పార్థసారథి దయ దప్పి యుండేను
ఆశైయుడనె శ్రీనివాసనైయాళుమే
మోసం శెయ్యాదె పెణ్‌మానే కణ్‌మానే
- యదుకుల కాంభోజి – అట (Posted at https://javali.blog/2020/10/11/312-%e0%b0%95%e0%b1%8b%e0%b0%aa%e0%b0%ae%e0%b1%87%e0%b0%b2%e0%b0%b0%e0%b0%be-kopamelara/ )
కోపమేలరా నాపైని నా మనోహరా
హెవెన్ మన్యు నుండి నీకు లెటర్సు పంపగా
నెవర్ మైండ్ లవర్ ఫ్రెండేని యువర్ విలుగాగ వయరాజైతివి
పొదన్ పొదన్ గదల్చి తుమ్మదల్ రొదల్ మెదల్పగా
మొదల్ మురుండెదన్ సరాల్ గుదుల్ గుదుల్ గుదుంచెరా
ఆస బాస జేసి యీ నిరాస నీ విలాసమా
కేశవా ద్విభాషి పుల్లకవీశ హృద్వాసకమా
ఆంగ్ల భాషా పదాలకు ఉదాహరణ:
4. రచన: కరూరు శివరామయ్య
ఖరహరప్రియ – ఆది (Previously Posted at https://javali.blog/2020/12/08/427-%e0%b0%93-%e0%b0%ae%e0%b1%88-%e0%b0%b2%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80-%e0%b0%b2%e0%b0%b2%e0%b0%a8%e0%b0%be-o-mai-lavli-lalana/)
O my lovely లలనా ఏలనే పొమ్మంటి
ఏమోయని యంటి కామిని నిన్ను
కౌగలింపు వేళ కాంతుడు ఆడిన
కపట మాటలన్ని కనుగొంటినేమో
ఇటువంటి step – is it fit to take
Sit a while here let me convince you
ఎవరి వద్దను dont be angry
శివరాముని పదములు పాడు
పూరి కల్యాణి – మిశ్ర లఘు (Previously posted at https://javali.blog/2021/04/02/658-%e0%b0%a8%e0%b1%80-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f-ni-mata/ )
నీ మాటలేమాయెనుర! సామి బల్కర
ఏమేమొ బోధించి నన్నేమార జేసేవల
చక్కని సామివలె చెక్కిలి నొక్కి రవ
ముక్కెర నీకిచ్చేనని టక్కులచే సొక్కించిన
మాటిమాటికి మరు మాటలాడ బిల్చుచు
పాటీలు నే పంపేనని తాటోటముతో నీటిన
జాలము జేసి కలసేలి రతనాల జువి
కీల జత పంపేనన్న తాలవన లోల అల
దీనికి ఆంగ్లానువాదం:
what has become thy promise! tell my dear friend
what! does though forget your inducing and honeywed words?
why dont you be a gentleman?
kissing the beautiful cheek
the promising of diamond jewels
proved to be false in the end
now and then bbeseeching me
for the conjugal embrace
of my etting ruby-ear-rings
proving to be false in the end
having thus enchanted me
lulled into security
promising the golden bangles,
talavana lOla halo!