5.9.2.2 సాంస్కృతిక సమాసాలు

  1. మరుని కేళి
  2. కామాంధకారము
  3. త్యాగశీలుడు
  4. జలజాక్ష
  5. మోహపయోధి
  6. భాసుర వాక్యము
  7. వేషభాషలు
  8. బహురూప ధరుడు
  9. సామజ వరదుడు
  10. ఉపరతి సుఖము
  11. పరమేష్ఠి ముఖము
  12. మదన జనక
  13. వనజ నయన
  14. మరుశరము
  15. మోహన రూపుడు
  16. మంద బుద్ధి

ఈ విధంగా ఆచ్ఛిక, సాంస్కృతిక సమాసాలే కాక విజయ బిరుదులు, అనేక మార్లు వంటి వైరి సమాసాలు కూడా ఉన్నాయి. తెలుగు జావళీలలో శృంగార ప్రాధాన్యంతో పాటు, భావ ప్రదర్శనం కూడా ఉండడం వల్ల, ఆ భావాన్ని వ్యక్తం చేయడానికి భాషా పాటవం ప్రదర్శించాలి కాబట్టే జావళీ కర్తలు, భాషలో ఉన్న అన్ని విధాలయిన పదాలాన్ని ఉపయోగించి రచన సాగించారు.