ఉమ్మడి సెట్టి వెంకట సామి నాయుడు గారు రచించిన “సంగీత విద్యా దర్పణము” అనే గ్రంథంలో గల శ్లోకాలలో పెక్కులు సంగీత దర్పణ శ్లోకాలుగానే కనిపిస్తున్నాయి. రాగకాల నిర్ణయం చేసేటప్పుడు శ్రీమాన్ సింగరాచార్యుల “నాయక లోచనం” (*** ఇది గాయక లోచనం అయి ఉండవచ్చా? ***) లోని శ్లోకాలనే తాత్పర్యాలతో రాశారని కూడా తెలుస్తోంది.
“గాన భాస్కరం” అనే ఈ గ్రంథం కూడా రాగాలాపన కాల విషయంలో కొన్ని విషయాల్ని ప్రస్తావించింది.
ప్రాతః కాలంలో అనగా వేకువ జామున 3 గం॥మొదలు 6 గం॥వరకు పాడదగిన రాగాలు:
- దేశాక్షి
- దేవగాంధారి
- భాండీ
- ధన్యాసి
- మారువా
- దేవక్రియా
- మందారీ
- గౌరీ
- భూపాలము
ఈ రాగాలు సంగమ కాలంలో అనగా ఉదయం 6 గం॥ వరకూ పాడదగిన రాగాలు: (*** ముద్రారాక్షసం అయి ఉండవచ్చా? 6 గం॥ నుండి 9 గం॥ వరకు అని చెప్పి ఉండాలేమో ***)
- కురంజి
- సాహుళీ
- ఘంటారవము
- రామక్రియ
- బిలహరి
- మలహరి
- ముఖారి
- యమునా
- దేగుప్తీ
- భైరవి
(To be continued. Last edited 3 Jan 2026)