1.5 జావళీ పదవ్యుత్పత్తి – నిర్వచనాలు jAvaLI padavyutpatti – nirvachanAlu

ఆంధ్రుల సంగీత సంప్రదాయంలో నేడు కచేరీలలో చివరిగా వినిపించేది జావళీ. ఇది కేవలం గానానుకూలమైనదే కాక, అభినయ పూర్వక ప్రదర్శన పరమార్థం కలిగినది. జావళీ అనే ప్రక్రియ ఆంధ్ర వాగ్గేయకారులను పలువురను ఆకర్షించింది.

ప్రసిద్ధ కవి పండితుల చేతిలో రూపు దిద్దుకున్న ఈ జావళీలు కేవలం తుచ్ఛ శృంగార రచనలనే సాహిత్యాభిప్రాయం ఆధునిక కాలంలో కొందరికి కలిగింది. ముఖ్యంగా ప్రసిద్ధ విమర్శకులు సి. ఆర్. రెడ్డి గారు, సంగీత సాహిత్య ప్రియంభావుకులు అయిన రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు వీటిని వలపు పాటలుగా, అసభ్య శృంగార రచనలుగా పరిగణించుటతో తెలుగునాట ఆ అభిప్రాయం జలబిందు తైలమై పోయింది.

ఈ ప్రక్రియ ఆరంభ వికాసాలను గూర్చి పరిశోధించగా తేలిన సారాంశమేమంటే – మధుర భక్తి ప్రేరకాలై జీవుని వేదన ప్రధానమై – పురుషోత్తముని తోడి సమ్యోగానికై జీవుని హృదయం చేసే గానమే జావళీ పుట్టుకకు కారణమని నిర్ణయించడానికి లభించిన ఆధారాలు నిర్ధారిస్తున్నాయి.

అయితే – ఈ జావళీ పద స్వరూప స్వభావాలు, అర్థ పరమార్థాల గురించి, వివిధ భాషా నిఘంటువులు పేర్కొన్న విశేషాలను వివిధ సంగీతజ్ఞుల వివరణలను వివరింప వలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. వరుసగా ఆయా విషయాలను వివరించి చివరగా పద స్వరూపం నిర్ధరించడం ప్రథమ కర్తవ్యంగా ఈ ప్రథమాధ్యాయాన్ని కూర్చడం జరిగింది.

జావళీ పద వ్యుత్పత్తికి సంబంధించినంత వరకూ వివిధ నిఘంటువులు పేర్కొన్న ఆధారంగా జావళీ పదానికి గల రూపాంతరాల్ని తెలుసుకోవడం ద్వారా జావళీ పద విశేషాల్ని తెలుసుకోవచ్చు.

నిఘంటువులు:

  1. ఆంధ్ర దీపిక:
    శ్రీ మామిడి వేంకటాచార్యులు (1764-1834) కూర్చింది. వీరు ‘ పండిత రాయ ‘, ‘ బాలామర ‘, ‘ సాహిత్య చరవర్తి ‘ బిరుదాంకితులు. ఈ నిఘంటువులో జావళీ పదానికి అర్థం ఇలా ఉంటుందని పేర్కొన్నారు.
    “జావడము: అపౌరుషము, పిరికితనము, గుర్రపు తట్టు, ఒక జాతి డేగ
    జావళము: గుర్రపు తట్టు
    జావళి: గీత విశేషము”
    అను అర్థాలు గలవు.
  2. Brown’s Telugu English Dictionary printed at the S.P.C.K. Press (Veppery, Madras, 1993)
    “జావడము – జావళము (dzAvadamu) (Tel) n. A country horse, a hack గుర్రపు తట్టు. A falcon. The Shahin, Jerdon, Catal No. 29. గుర్రపు జావడము; a Mule గోడిగ జావడములు Colts, fillies. ఆడ గుర్రపు తట్లు A.11.122 IV 36. H.D. 1.531 Unmanliness అపౌరుషము Timidity పిరికితనము.
    జావడి (dzAvadi) (Tel) n.A. Washerman చాకలివాడు.
    జావళి (dzAvali) (Tel) n.A. kind of song గీత విశేషము.”
  3. వావిళ్ళ నిఘంటువు: 1951
    “జావళీ – జావళి. దే. వి. గీత విశేషము (పుట 1225)
  4. ఆంధ్ర వాచస్పత్యం: ప్రథమ సంపుటం (1953)
    “జావళి – (దే.వి.) ఒకానొక గీతం.
    (జావళీలు హాస్యరసంతో కూడిన గీతములు) రూ. జావడి – స్వరము”
  5. సూర్యరాయాంధ్ర నిఘంటువు: (పుట 313)
    “జావళి – గీత విశేషము (తృ. సం. 1981)”
  6. శబ్దరత్నాకరం:
    “జావళి (దే.వి.) గీతవిశేషము”
  7. తెలుగు నిఘంటువు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ.
    “జావళి – శృంగారగీతము”
  8. తెలుగు వ్యుత్పత్తికోశం:
    “జావడి – శృంగారగీతం
    జావళము – అశ్వగతి
    జావళి – జావడి. రూ. శృంగారగీతం
    జావళీ – జావడి – జావళి – శృంగారగీతం
    జావళీ – గీతవిశేషషం. (మూ.సం.) ఆంధ్రా యూనివర్శిటీ ప్రెస్ 1981″
  9. ఆంధ్ర, తమిళ, కన్నడ: త్రిభాషా నిఘంటువు ఆం. ప్ర. అకాడెమీ 1979
    “తెలుగు తమిళం కన్నడం
    జావళి జావళి శృంగార రసవుళ్ళ హాట
    సింగార పాట్టుగళ్ “
  10. తమిళ నిఘంటువు:
    “కావళి – ఉర్దూమాట – ఝ్వలి (Jhawali) నుండి పుట్టినది. సరియైన ఆధారాలు లేవు” (కవ్వాలి?)
  11. తుళు – ఇంగ్లీషు నిఘంటువు:
    “జావడి – (Javadi) A kind of verse”
  12. ప్రొ. ఎఫ్. కిట్టిల్ (Kittel) – కన్నడ – ఇంగ్లీషు నిఘంటువు (మైసూరు) 1968
    “జావడి – a kind of lewd poetry”
  13. Kittel’s Kannada English Dictionary, Vol III 1969 (M.U.)
     
    14. Dictionary of Telugu – Urdu Kondala Rao P 425
       జావడము – జావళము – జావళి    ఆషిఖానాగీత్
    15. A Dravidian Etymological Dictionary by T. Burrow & M.E. Emeneau Second Edition
       “Ta Cavali – Cloth, Piece of grids
         Ma Cavali – any cloth
         Ka Javli  – Cloth of any kind
         Tv Javali – Jauli Cloth
         Te Javali – Cloths”
    ఇంతవరకు సాహిత్య సంబంధి, భాషా సంబంధి నిచంటువులలోని అర్థం వివరింపబడింది. ఇక సంగీతవేత్తల నిర్వచనాలు.
  14. సంగీత శబ్దార్థ చంద్రిక (1954)
  15. గానకళా విశారద శ్రీ అరిపిరాల సత్యనారాయణ మూర్తి గారు రూపొందించిన సంగీత శబ్ద నిఘంటువు. ఇందులో
  16. “జావళి: పర్షియన్ ‘ గజల్స్ ‘ నుండి అభివృద్ధి పరుపబడింది. వినోదం కొరకు రచింపబడిన సంగీత రచనలకు గల పేరు. ఇందు జావళి లక్షణాలను గాక పద ఆవిర్భావాన్ని గురించి చెప్పబడింది.”

కర్ణాటక సంగీత పారిభాషిక శబ్దకోశము: (మైసూరు యూనివర్సిటీ) 1963
డా|| వి. ఎస్. సంపత్ కుమారాచార్య గారు కర్ణాటక సంగీత శాస్త్రంలో ఉపయుక్తమయ్యే పారిభాషిక పదాలకు అర్థాల్ని వివరించారు.
“జావళి – కన్నడ జావడికి రూపాంతరం 15వ శతాబ్ది నుండి ఉన్న్నట్టుగా కనిపిస్తోంది. శృంగార రస ప్రధానమైనది.
జావడి: కన్నడ ప్రేమ గీతం. హిందుస్థాని ‘ గజల్స్ ‘ని పోలి ఉంటాయి.”

విజ్ఞాన సర్వస్వము: సం. 14 లలిత కళలు
“జావళీలు – సంగీత సంబంధమైన కర్ణాటక సంగీత రచనలు. 19వ శతాబ్ది నుండి మాత్రమే కాననగుచున్నది. కేవలం ఆధునిక రచన.” (సుసర్ల శివరాం)

భాగవత సంప్రదాయము
“యక్షగానము లేక జక్కుల భాగవతముతో బాటు శాస్త్రీయ సంగీత ఫణతులే కాక, దేశీ సంగీత రీతి యగు ‘ జావళి ‘ ఆట పాటగా ప్రాచుర్యం గాంచింది.” (పుట 469)

నృత్య సంగీతము
“(ట్రావంకోర్) తంజావూర్ క్వార్టెట్
జావళీ: మధ్యమ కాలపు శృంగార రచన.” (పుట 485)
జావళీలు శుద్ధ సంగీత శాఖకు చెందినవి. (మంగిపూడి రామలింగ శాస్త్రి) పుట 785, 786.

Encyclopedia Brittanica: Vol. 27
“Pada and Javali are two kinds of love songs using the poetic imagery. Characteristic of the romance – devotional movement mentioned earlier”

భారత సంగీత ఇతిహాసము:
“జావళీ – మహారాష్ట్ర దేశపు లావణీ వలెనే అభినయ యోగ్యము.”
“భరత నాట్యములో వీనికి అగ్రస్థానమున్నది. అరియకుడి రామానుజ అయ్యంగారి వంటి రసిక గాయకులు ప్రత్యేకముగా తమ కచేరీలలో స్థానమిచ్చారు.” రామలింగ శాస్త్రి, మంగిపూడి.
శ్రీ కె. వి. ఆచార్ గారు కన్నడ జావళీలను గూర్చి రాసిన అభిప్రాయాలను ఇక్కడ ఉదహరిస్తున్నాను.

కన్నడ జావళీలు: కె. వి. ఆచార్, బి. యు. ప్రెస్ 1977.

  1. జావళి – జావడి రెండు రూపాలూ ఉన్నాయి.
    ఇది కన్నడ పదం అవచ్చు, కాకపోవచ్చు.
    (స్వర – సర) స్వరావళి – సరవళి – స-అవళి – సా-అవళి – జావళి – జావడి – అయి ఉండవచ్చు. ఊహ మాత్రమే.
  2. జావళి – కన్నడ పదం. ‘ జావడి ‘ మూలం.
  3. జావళి – జ్యావళి – మన్మథ బాణాలు.
    ఆవళీ – పొది, తుమ్మెదల గుంపు. కామ ప్రచోదన శక్తి గలవి.
  4. జావ – యామ. ఈ యామంలో నాయకి నాయకుని పిలుస్తుంది.
  5. మరాఠీలో మూడు చోట్ల జుట్టు వదలి గుండు చెయ్యడం ‘ జావళ ‘
    హిందూస్థానీలో ‘ జావ్య ‘ – జ్యావ్ – అని కూడా అంటారు.
    జ్యావ్ + ఆడి – ళి – అని కూడా అనవచ్చు.
  6. జావళీ – నిరుపయోగమైన, క్షుద్రార్ధము కలిగినది.
    జావడి – A kind of lewd poetry Kettel’s కన్నడ కోష్.
  7. డా|| శివరామ కారంత్ తన ‘సిరి కన్నడ అర్థకోష్’ లో జావళి ఒక గీతం.
    జావడి, (జావళి) అల్ప దుర్బలమైనది.
    స్త్రీలు కాళ్ళు, చేతులకి రాసుకునే లేపనం.
  8. కన్నడ కస్తూరి పండిత్ జె. వి. కవలి
    జావళి – చావడి – జావడీ
    అల్ప క్షుద్ర దుర్బల జావడి. చావకి మంటప
  9. మన దేశంలో జానపద సాహిత్యం మానవుడి పుట్టుక నుండి అభివృద్ధి చెందుతోంది. దాని ప్రభావం సంగీత రాగాల మీద పడి అనేక రాగాలు పుట్టాయి. శృంగార పాటలు దీని ప్రభావమే. దాస సాహిత్యం అలా వచ్చిందే.
  10. జావడి – జక్కుడి
    మోహన తరంగిణి రాగంలో కనక దాసరు పాడిన దాంట్లో కనిపిస్తోంది.
  11. లావణి – మాహారాష్ట్ర నుండి వచ్చింది. శృంగార సంగీతం. నాయికా నాయకుల పరంగా ఉంటుంది.
    జావడిరస – ఆదపిల్లలు కాళ్ళకు రాసుకునే రసం (ఒక ద్రవం)
  12. జావళి – ఒక ఊరు పేరు
  13. వడి – తెనుగు నుండి కన్నడం లోకి వచ్చిందని కొందరి అభిప్రాయం. ద్రావిడ భాషలలో కన్నడ సాహిత్యం తెలుగు సాహిత్యం కంటే ప్రాచీనం.
    జావళి విషయంలో తెలుగు నుండి కన్నడం లోకి పచ్చి ఉంటాయని, తెలుగు జావళీలు ముందు వచ్చాయని కొందరి విద్వాంసుల అభిప్రాయం.
    వడి తెలుగు నుండి 17వ శతాబ్దంలో కన్నడంలోకి వచ్చినట్లే జావళీలు తెలుగు నుండి కన్నడం లోకి వచ్చి ఉంటాయి.
    వడి – వళి – యతి
    కవి జిహ్వాబంధనంలో అయిదు రకాలు వడులున్నాయి. అందులో కూడా ముఖ్యమైన చందస్సుకు సంబంధించినదా అన్న విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
  14. జావడి – జావళ (గా)
    శృంగార రస ప్రధాన గీతం. కామ గీతం. ప్రణయ గీతం.
  15. కర్ణాటక సంగీత సంప్రదాయ పరంగా రాసిన పద వర్ణం, తిల్లానలు రాసిన వారే జావళీలు రాశారు. జావళీలు సంప్రదాయ పరంగా రాసినవి. శృంగార భావం కలవి.
  16. తమిళంలో తెలుగులో జావళీ అనే అంటారు.
    జావడి (నా) జావళీ గీతాల్ని రచించినవారు.
    జావడికారుడు. టుమ్రికారుడు.
    నిత్య జీవితంలో లీలా విలాసాలను రచించారు.
    భారతీయ సంస్కృతి దర్శన – జావడి + కార
    కాలు – శబ్ద రత్నాకరం
  17. గీత విశేషము – జావళీ – సూర్యరాయ నిఘంటువు
  18. జేవూడ, జేవడె, జేవడి – జావడి – ధనుష్టంకార – శృంగార ప్రధానమైన జావాళీలు పాడేడప్పుడు నర్తకులు మన్మథ లీలని అభినయిస్తారు. శ్రోతలను ఉత్తేజ పరుస్తాయి.
    ఆతువంటి ప్రభావం గల పదాల్ని జావళీకారులు ఏర్చి కూర్చి వుండవచ్చు.
    ‘జ్యా’ సంస్కృతం. వోడే, పోడే కన్నడ పదాలు. కన్నడ మాట అవుతుంది.
  19. వడి – ఆది, కాలు, పాడం.
    వళి – పంక్తులు, సాలు
    డ, ళ లకు భేదం లేదు.
  20. జావ పదావళి – జావళి అవుతుంది.
    దేవదాసీలు అంగ భోగ సేవలో, దేవుని లక్ష్యంగా చేసి పాడి ఉండవచ్చు. శ్రీ కె. వి. ఆచార్ గారి పరిశోధనలో జావళి కన్నడ పదమని, శ్రంగార భావ అభినయ ప్రధానాలు జావళీలని నిగ్గు తేల్చారు.

ఇవి అన్నియు నిఘంటువులలోని వివరాలు. ఇక సంగీతజ్ఞుల, సాహిత్యకారుల అభిప్రాయాలు, వివిధ గ్రంథాలలోని విషయాలు.

Leave a comment