sangIta praSamsa సంగీత ప్రశంస

‘సామవేదాదిదం గీతం సంజగ్రాహ పితామహః’ – సంగీత రత్నాకరము.

సంగీతం, సామవేదం నుండి బ్రహ్మచే గ్రహింపబడి, లోకోపకారమైన భరతాదుల చేతనూ ఇతర వాగ్గేయకారుల చేతనూ వెల్లడి చేయబడిన శాస్త్రం. కనుక ఈ సంగీత విద్య మహనీయులచే కొనియాడబడుతోంది.

శ్లో|| గీతిగానేన యోగస్యాత్

యోగా దేవ శివైక్యతా

గీతిజ్ఞోయది యోగేన

సయాతి పరమేశ్వరం || (సూత సంహిత)

భక్తితో చేయబడు గానం యోగమవుతోంది. ఆ యోగవశం చేత పురుషుడు పరమాత్మతో ఐక్యాన్ని పొందుతున్నాడు.

శ్లో|| కావ్యాలాపాశ్చ యేకేచి

ద్గీతాని సకలానిచ 

శబ్దమూర్తి ధరస్యైతే 

విష్ణోరంశా మహాత్మనః || (శ్రీ విష్ణు పురాణము)

శబ్ద స్వరూపమైన కావ్యాలు, సంగీతం భగవంతుని స్వరూపాంశ సంభూతమని భావం. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల్ని సాధించడానికి ఈ సంగీతమే ముఖ్య సాధనం. 

శ్లో|| నాహం వసామి వైకుంఠే  

సయోగి హృదయే రహి

మద్భక్తా యత్ర గాయంతే 

తత్ర తిష్ఠామి  నారద ||

ఓయి నారదా! నేను వైకుంఠములో వసింపలేను. యోగుల హృదయం లోనూ వసింపలేను. నా భక్తులు ఎచ్చట గానం చేస్తారో అచ్చట నేనున్నాను. ఈ భగవద్వాక్యం వలన గానం సర్వోత్కృష్టమైన యోగమని తెలుస్తోంది. 

శ్లో|| వీణావాదన తత్వజ్ఞః

శృతిజాతి విశారదః

తాళజ్ఞస్చా ప్రయాసేవ

మోక్షమార్గం నగచ్ఛతి  || (యాజ్ఞవల్క్య స్మృతి)

Leave a comment