Title | అపదూరుకు | apadUruku |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | అపదూరుకు లోనైతినే చపల చిత్తము చేతనే | apadUruku lOnaitinE chapala chittamu chEtanE |
అనుపల్లవి anupallavi | ఏ పాపి నాపై దూరెనోగా ఏ పాపము లేక | E pApi nApai dUrenOgA E pApamu lEka |
చరణం charaNam 1 | వేడుకలు జూడనే ఈడు చెలుల తోడనే కూడి అతని మేడ కేగితే వాడు నా చెలికాడనే | vEDukalu jUDanE IDu chelula tODanE kUDi atani mEDa kEgitE vADu nA chelikADanE |
చరణం charaNam 2 | సారెకు నా సామిని దారిని కని నవ్వితే జారిణి యని ఊరి వారలు వేరె పేరిడి నన్ను పిల్చుట | sAreku nA sAmini dArini kani navvitE jAriNi yani Uri vAralu vEre pEriDi nannu pilchuTa |
చరణం charaNam 3 | చిరుత నాటి యుండిన గురుతుచే గుణవంతుడౌ వరద తాళవనేశుని తోడు సరసమాడుచు కూడితినని | chiruta nATi yunDina gurutuchE guNavantuDau varada tALavanESuni tODu sarasamADuchu kUDitinani |