1271 అప్పటి మాటలకు appaTi mATalaku

Titleఅప్పటి మాటలకుappaTi mATalaku
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaతోడిtODi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviఅప్పటి మాటలకు దుప్పటిచ్చె గాని
అప్పటి గప్ప నిచ్చెనటే చెలి
appaTi mATalaku duppaTicche gAni
appaTi gappa nicchenaTE cheli
అనుపల్లవి anupallaviతప్ప నేనితరుల దరి జేరనని యెన్నో
చెప్పిన తలచు కొంటినే ఓ చెలి
tappa nEnitarula dari jEranani yennO
cheppina talachu konTinE O cheli
చరణం
charaNam 1
తొలినాటి వగలేయా మలునాటి వగలు మా
చెలిమి కాకియు కోవెల చందమాయెనే
tolinATi vagalEyA malunATi vagalu mA
chelimi kAkiyu kOvela chandamAyenE
చరణం
charaNam 2
పడతి మగవారు బారు పడకింట మితిమీరు
గడప దాటిన వెనుక కారు మనవారు
బడి బడి నాడు వారు బ్రతిమాలి పాదముల
బడి వేడుకొన్న గాని పలుకే మేల్మి బంగారు
paDati magavAru bAru paDakinTa mitimIru
gaDapa dATina venuka kAru manavAru
baDi baDi nADu vAru bratimAli pAdamula
baDi vEDukonna gAni palukE mElmi bangAru
చరణం
charaNam 3
కాసు వీసములిచ్చి గోస గూసల మసి
బూసి నేరేడు గాయ జేసెనే చెలి
వేసాల మారి మా వేణుగోపాల మూర్తి
దాసు శ్రీరామ కవి డాసి యేలుచుండెనే ఓ చెలి
kAsu vIsamulicchi gOsa gUsala masi
bUsi nErEDu gAya jEsenE cheli
vEsAla mAri mA vENugOpAla mUrti
dAsu SrIrAma kavi DAsi yEluchunDenE O cheli

1270 ముద్దుముద్దుగ muddumudduga

Titleముద్దుముద్దుగmuddumudduga
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaఅఠాణaThANa
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviముద్దు ముద్దుగ పిలవనా నా సామిని
ముదుగు ముదుగుగ పిలవనా నా సామిని
muddu mudduga pilavanA nA sAmini
mudugu muduguga pilavanA nA sAmini
అనుపల్లవి anupallaviముద్దు ముద్దుగ పిలువ చులక సేయునేమో
ముదుగు ముదుగుగ పిలువ బాగని తోచేనే
muddu mudduga piluva chulaka sEyunEmO
mudugu muduguga piluva bAgani tOchEnE
చరణం
charaNam 1
పాటలు పాడుదునా మంచి ఆటలు ఆడుదునా
వాటమైన గుబ్బ పోటు జూపింతునా
గోటి కొన చెక్కిలి మీటుదునా
pATalu pADudunA manchi ATalu ADudunA
vATamaina gubba pOTu jUpintunA
gOTi kona chekkili mITudunA
చరణం
charaNam 2
ఆకు మడుపు లిత్తునా మంచి తావి
అత్తరు పైబూతునా
తేకువతో జడ త్రిప్పి కొట్టుదునా
మోక మావి చిగురు మోవి గరతునా
Aku maDupu littunA manchi tAvi
attaru paibUtunA
tEkuvatO jaDa trippi koTTudunA
mOka mAvi chiguru mOvi garatunA
చరణం
charaNam 3
కోపగించకు మందునా యేర వేణు
గ్గోపాల రమ్మందునా
శ్రీపూర్ణమగు దాసు శ్రీరాము మనసున
ప్రాపై నివసించి పాలించమందునా
kOpaginchaku mandunA yEra vENu
ggOpAla rammandunA
SrIpUrNamagu dAsu SrIrAmu manasuna
prApai nivasinchi pAlinchamandunA

1269 కామాంధకారము kAmAndhakAramu

TitleకామాంధకారముkAmAndhakAramu
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviకామాంధకారము కప్పెనా నీవింత
కనుగానక యుంటివి
kAmAndhakAramu kappenA nIvinta
kanugAnaka yunTivi
అనుపల్లవి anupallaviఏమిరా తెలియదా ఇది కాదని నీకు
నీ ముద్దు కోమలి నివసించిన ఇల్లు
EmirA teliyadA idi kAdani nIku
nI muddu kOmali nivasinchina illu
చరణం
charaNam 1
పంజరమున చిలుక పగిది నేనుండగ
పరులకు పని ఏమిరా
సంజ చీకటి దారి జాడ తెలియ లేక
కంజాత నయన ఇక్కడ వచ్చితివా లేక
panjaramuna chiluka pagidi nEnunDaga
parulaku pani EmirA
sanja chIkaTi dAri jADa teliya lEka
kanjAta nayana ikkaDa vacchitivA lEka
చరణం
charaNam 2
వగకాడ నీవంటి వానికి నావంటి
మగువ పొందది ఏలరా
మొగలి పూజిదుమబో ముల్లా కంటిన యట్లు
తగని ఈ నా యిల్లు దారి దాకెనా లేక
vagakADa nIvanTi vAniki nAvanTi
maguva pondadi ElarA
mogali pUjidumabO mullA kanTina yaTlu
tagani I nA yillu dAri dAkenA lEka
చరణం
charaNam 3
భ్రమ లేల నిన్నటి రాతిరి గలసిన
భామ ఇల్లిది గాదురా
రమణీయ దాసు శ్రీరామ కవీంద్రుని
అమల చిత్తాంబుజ మనుకొంటివా లేక
bhrama lEla ninnaTi rAtiri galasina
bhAma illidi gAdurA
ramaNIya dAsu SrIrAma kavIndruni
amala chittAmbuja manukonTivA lEka

1268 వలచితిరా నిను valachitirA ninu

Titleవలచితిరా నినుvalachitirA ninu
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaదర్బారుdarbAru
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviవలచితిరా నిను వదలను సామీ
జలజాక్ష నీ దర్శనమే పది వేలు
valachitirA ninu vadalanu sAmI
jalajAksha nI darSanamE padi vElu
చరణం
charaNam 1
ఇచ్చిన సరే ఇవ్వకున్న సరే
వచ్చి నాతో నొక ముచ్చటాడిన చాలు
icchina sarE ivvakunna sarE
vacchi nAtO noka mucchaTADina chAlu
చరణం
charaNam 2
నీళ్ళనే ముంచు పాలనే ముంచు
కాళ్ళకు మ్రొక్కెద కరుణించరా
nILLanE munchu pAlanE munchu
kALLaku mrokkeda karuNincharA
చరణం
charaNam 3
వేణుగోపాలా వేడితి చాలా
రాణించు దాసు శ్రీరాము నుల్లము వలె
vENugOpAlA vEDiti chAlA
rANinchu dAsu SrIrAmu nullamu vale

1267 వట్టు బెట్టెద vaTTu beTTeda

Titleవట్టు బెట్టెదvaTTu beTTeda
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaఆనంద భైరవిAnanda bhairavi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviవట్టు బెట్టెద నా చై పట్ట రాకురా సామిvaTTu beTTeda nA chai paTTa rAkurA sAmi
అనుపల్లవి anupallaviగట్టిగ పది వేల కరకు వరాల మూట
గట్టి నా కట్టెదుట బెట్టి మాటాడర
gaTTiga padi vEla karaku varAla mUTa
gaTTi nA kaTTeduTa beTTi mATADara
చరణం
charaNam 1
గారాన నొక యమ్మ కని పెంచిన బిడ్డ
యూరకే వచ్చునా తేరా సరిగ చీర
gArAna noka yamma kani penchina biDDa
yUrakE vacchunA tErA sariga chIra
చరణం
charaNam 2
వలచి వచ్చిన వారు ఇలువ బెట్టక పోరు
అలరింతు తేరా మంచి ఆణి ముత్యాల పేరు
valachi vacchina vAru iluva beTTaka pOru
alarintu tErA manchi ANi mutyAla pEru
చరణం
charaNam 3
భాసుర వేణుగోపాల జేజేల మిన్న
దాసు శ్రీరామ కవి డాసి ఏలక యున్న
bhAsura vENugOpAla jEjEla minna
dAsu SrIrAma kavi DAsi Elaka yunna

1266 మగువ నేనెంత maguva nEnenta

Titleమగువ నేనెంతmaguva nEnenta
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893 dAsu1893
రాగం rAgaతోడిtODi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviమగువ నేనెంత మంద బుద్ధినైతి
మగని తూలనాడితి మోసపోయితి
maguva nEnenta manda buddhinaiti
magani tUlanADiti mOsapOyiti
అనుపల్లవి anupallaviతెగువ తొల్లి యిల్లు తిరిగి చూచుచున్న
నగధర నినుజూచి నగరా పొమ్మంటి
teguva tolli yillu tirigi chUchuchunna
nagadhara ninujUchi nagarA pommanTi
చరణం
charaNam 1
బెట్టు విడచి మ్రొక్కు బెట్టు వచ్చిన నన్ను
బట్టకురా నీ బవిసి దెలిసె నంటి
beTTu viDachi mrokku beTTu vacchina nannu
baTTakurA nI bavisi delise nanTi
చరణం
charaNam 2
వాసిగా నా తోడ యూసు లాడెదనన్న
దాసు శ్రీరామకవి డాసి ఏలుకొమ్మంటి
vAsigA nA tODa yUsu lADedananna
dAsu SrIrAmakavi DAsi ElukommanTi

1265 సరియేనో sariyEnO

TitleసరియేనోsariyEnO
Written By
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaజంజూటిjanjUTi
తాళం tALaధాపుdhApu
పల్లవి pallaviసరియేనో సారసాక్ష
చారుగాత్ర క్రూరతనవిదు
sariyEnO sArasAksha
chArugAtra krUratanavidu
అనుపల్లవి anupallaviఇరువనోర్వ తరుళా వరనాకృతిగె
సైరిసదె కరుణిసదె హొర హాకువరె
iruvanOrva taruLA varanAkRtige
sairisade karuNisade hora hAkuvare
చరణం
charaNam 1
పుత్రారహిత అర్థ వ్యర్థావెనుతా
పృథ్వియొళు ఉత్తమరు నుడియవరు
putrArahita artha vyarthAvenutA
pRthviyoLu uttamaru nuDiyavaru
చరణం
charaNam 2
ధనలోభియు నీ ఘనతోషదలిక్షణదోళ్
వన వాసరె తనయా నను కళుహువరే
dhanalObhiyu nI ghanatOshadalikshaNadOL
vana vAsare tanayA nanu kaLuhuvarE
చరణం
charaNam 3
సుగుణవంతా మననెగింత చింతా
కాంతారదొళ్ కళుహూవదు నినగుచితవె
suguNavantA mananeginta chintA
kAntAradoL kaLuhUvadu ninaguchitave

1264 కీర రాజ kIra rAja

Titleకీర రాజkIra rAja
Written By
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaకాంబోజిkAmbOji
తాళం tALaఖ. చాపుkha. chApu
పల్లవి pallaviకీరరాజ బారో పోగువ
సార సాక్షన బళిగె
kIra rAja bArO pOguva
sAra sAkshana baLige
చరణం
charaNam 1
భూరుహదిం భూరుహకె
సారదె నీం పోగదిరు
సానతి నొందె కాపది చెందె
పోగదె ముందె బా హిందెందె
bhUruhadim bhUruhake
sArade nIm pOgadiru
sAnati nonde kApadi chende
pOgade munde bA hindende
చరణం
charaNam 2
కాంతారదొళు కామిని మార్గవను
ఈక్షిసుతిహళు
ఎంతిహళో కాంతె తా నంతరది
బెంతిపళో
గగన విహారి వన సంచారి పరోపకారి
రమ్య శరీరి కీరరాజ బారో పోగువ
kAntAradoLu kAmini mArgavanu
IkshisutihaLu
entihaLO kAnte tA nantaradi
bentipaLO
gagana vihAri vana sanchAri parOpakAri
ramya SarIri kIrarAja bArO pOguva

1263 వాడా నిను vADA ninu

Titleవాడా నినుvADA ninu
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaయదుకుల కాంభోజిyadukula kAmbhOji
తాళం tALaఅటaTa
పల్లవి pallaviవాడా నిను బంపినాడా నను బిల్వ
వనిత నే రాననవే పోపోవే
vADA ninu bampinADA nanu bilva
vanita nE rAnanavE pOpOvE
చరణం
charaNam 1
చింత లేల వాడు
చీటి బంపెనా సంతోషమే యనవే పోపోవే
chinta lEla vADu
chITi bampenA santOshamE yanavE pOpOvE
చరణం
charaNam 2
చిన్న నాట నుండి చేసిన
తన తోడి చెలిమి చాలనవే పోపోవే
chinna nATa nunDi chEsina
tana tODi chelimi chAlanavE pOpOvE
చరణం
charaNam 3
కోప మేటికి తోట్ల వల్లూరి
శ్రీ వేణు గోపాలా తగుననవే
kOpa mETiki tOTla vallUri
SrI vENu gOpAlA tagunanavE
చరణం
charaNam 4
వేయేల దాసు శ్రీరామ హృదయ
వాసివై యుండుమీ యనవే పోపోవే
vEyEla dAsu SrIrAma hRdaya
vAsivai yunDumI yanavE pOpOvE

1262 నా సామీ నీకిది nA sAmI nIkidi

Titleనా సామీ నీకిదిnA sAmI nIkidi
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
Bookదాసు1893dAsu1893
రాగం rAgaఅఠాణాaThANA
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviనా సామీ నీకిది న్యాయమా న్యాయమా
నా సాటి వారిల్లో నగుబాటు లాయెరా
nA sAmI nIkidi nyAyamA nyAyamA
nA sATi vArillO nagubATu lAyerA
చరణం
charaNam 1
సుందరాంగ నిన్ను జూచినప్పటి నుండి
యింద దన్నము నిద్ర యెరుగ నన్నేలరా
అందరా మాని పండ్ల
కాస పడినట్లాయె నా బ్రతు కెందుకిక
నా యందు దయ రాదేమిరా
నా మొరాలించవు
sundarAnga ninnu jUchinappaTi nunDi
yinda dannamu nidra yeruga nannElarA
andarA mAni panDla
kAsa paDinaTlAye nA bratu kendukika
nA yandu daya rAdEmirA
nA morAlinchavu
చరణం
charaNam 2
పాటలాధర నిన్ను పటమున వ్రాసుక
మాటిమాటికి తమి నాటి చూచుకొనుచు
కాటుక కన్నుల వెంటా దీటుగా జారు కన్నీట
మీటిన విచ్చు గుబ్బల పైశాటిదిడిసె
నీకేటి మాటలు
pATalAdhara ninnu paTamuna vrAsuka
mATimATiki tami nATi chUchukonuchu
kATuka kannula venTA dITugA jAru kannITa
mITina vichchu gubbala paiSATidiDise
nIkETi mATalu