#521 చానరొ వే చనవే chAnaro vE chanavE

Titleచానరొ వే చనవేchAnarovE chanavE
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaవసంతvasanta
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviచానరొ వే చనవే సకి పాలికిchAnaro vE chanavE saki pAliki
చరణం
charaNam 1
మానము వలదిక నా
మౌనము విడదగు నా
మనవి వినుమనవె
mAnamu valadika nA
maunamu viDadagu nA
manavi vinumanave
చరణం
charaNam 2
ఆ మగువ బిగువు చనుగవ బల్
సొగసు గనగ నెద బిగి
తటాలుననె పటాలు మను
తుటారి మిటారి వటారి కటారి యగు బలె
A maguva biguvu chanugava bal
sogasu ganaga neda bigi
taTAlunane paTAlu manu
tuTAri miTAri vaTAri kaTAri yagu bale
చరణం
charaNam 3
ఆ కలికి చిలుకల కొలికి సుమా
వలపు గెలుపు గొన గ-
ళలూర గదిసి నీ పనుపును దా-
నయముగా భయముగా
గొను భుజంగ వినుతు
రతుల కృతుల నతుల గతుల
ననగియు బెనగియు
మనుప దెలుపవె
A kaliki chilukala koliki sumA
valapu gelupu gona ga-
LalUra gadisi nI panupunu dA-
nayamugA bhayamugA
gonu bhujanga vinutu
ratula kRtula natula gatula
nanagiyu benagiyu
manupa delupave

swaram is also available for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.

#520 సామి చెలి నిను sAmi cheli ninu

Titleసామి చెలి నినుsAmi cheli ninu
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసామి చెలి నిను వలచి పిలిచెరా
సమయ మిదియ సకి గలయ
ఆ మెలత కలత కల నిను గని
కలియగ జని యులికి పడు
sAmi cheli ninu valachi pilicherA
samaya midiya saki galaya
A melata kalata kala ninu gani
kaliyaga jani yuliki paDu
చరణం
charaNam 1
ఆ పడతుక యొడలి యొడుపు నడక
వడువు దొడల బెడగు గన
జడ వడుగులు నెడదలు కడు
సడల సుడివడు దురుర
A paDatuka yoDali yoDupu naDaka
vaDuvu doDala beDagu gana
jaDa vaDugulu neDadalu kaDu
saDala suDivaDu durura
చరణం
charaNam 2
నిక్కు చనుల పయి నొక్కులు పఱచుచు
చెక్కిలి పలు మఱు నొక్కుచు వలపుల
హాళి జాలి కేళి దేలి కిల కిల నగవుల
గొలుపుచు సొగియర
nikku chanula payi nokkulu pa~rachuchu
chekkili palu ma~ru nokkuchu valapula
hALi jAli kELi dEli kila kila nagavula
golupuchu sogiyara
చరణం
charaNam 3
అంగజుడు గనయ ముంగొనయ ముంగొలి పెర
భుజంగ నర పుంగవ వరద
తాళ గలదుర వేళ గడపక లీల నేలర
angajuDu ganaya mumgonaya mumgoli pera
bhujanga nara pungava varada
tALa galadura vELa gaDapaka lIla nElara

swaram is also available for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.