| Title | మనసెట్ల సైరింతు | manaseTla sairintu |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మనసెట్ల సైరింతు మద గజ గామినీ | manaseTla sairintu mada gaja gAminI |
| అనుపల్లవి anupallavi | పణతిరొ నా సామిని పిలువావె మానినీ | paNatiro nA sAmini piluvAve mAninI |
| చరణం charaNam 1 | విరహ మెచ్చి ప్రాయము వ్యర్థమాయను నేడు మరుని శరములకు మగువరొ తాళజాలరా | viraha mechchi prAyamu vyarthamAyanu nEDu maruni Saramulaku maguvaro tALajAlarA |
| చరణం charaNam 2 | పంచబాణుడు వచ్చె నేడు ప్రాణ నాథుడు రాడాయ వంచ న్యాలనే సామికి వారిజాక్షి పిలువావె | panchabANuDu vachche nEDu prANa nAthuDu rADAya vancha nyAlanE sAmiki vArijAkshi piluvAve |
| చరణం charaNam 3 | మరచి పోయి నాడేమో మంగళపురి వాసుడు సరస మాడుటకు సఖియరొ తోడి త్యావె | marachi pOyi nADEmO mangaLapuri vAsuDu sarasa mADuTaku sakhiyaro tODi tyAve |
Author: Javali Lyrics
My mother collected hundreds of jAvaLi lyrics as part of her research on the literary values in jAvaLi. Instead of publishing them as a book, which would have had limited reach, we chose to post them as a blog. Then we found many more lyrics and kept posting...
Lot more can be done - finding notation, links to audio/video, any further corrections, offer a meaning for each word / line,...
Contact us at javaliwebsite@gmail.com
#762 ఎందుకు రాడాయ enduku rADAya
| Title | ఎందుకు రాడాయ | enduku rADAya |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 402 | |
| పల్లవి pallavi | ఎందుకు రాడాయ ఎవరేమన్నారు | enduku rADAya evarEmannAru |
| చరణం charaNam 1 | సరసుని ప్రేమ సతమని యుంటినె కరుణ మరచెనె కలికిరో నేడు | sarasuni prEma satamani yunTine karuNa marachene kalikirO nEDu |
| చరణం charaNam 2 | చందన పరిమళ ఆనందముగా యుంటినే సుందరాంగుడు రాడాయ మందయాన ఈ వ్యాళ | chandana parimaLa AnandamugA yunTinE sundarAnguDu rADAya mandayAna I vyALa |
| చరణం charaNam 3 | కోరిన వ్యాళలో కోపము యాలనే వర మంగళ పురీశుని వేగమె పిలువవె | kOrina vyALalO kOpamu yAlanE vara mangaLa purISuni vEgame piluvave |
#761 మోహనాకార యని mOhanAkAra yani
| Title | మోహనాకార యని | mOhanAkAra yani |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | దేశి తోడి | dESi tODi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | మోహనాకార యని మనవి జేసిన రాడే | mOhanAkAra yani manavi jEsina rADE |
| అనుపల్లవి anupallavi | మోహమెటు దీరును మగువ నే తాళాను | mOhameTu dIrunu maguva nE tALAnu |
| చరణం charaNam 1 | మనవి జేసుకు పోతె మోమోర జేసేను మన్నాన జేసేది మగువరొ తగునా | manavi jEsuku pOte mOmOra jEsEnu mannAna jEsEdi maguvaro tagunA |
| చరణం charaNam 2 | నా సామినీ బాసీ నే తాళలేను నా సరివారిలో నను చౌక జేసెను | nA sAminI bAsI nE tALalEnu nA sarivArilO nanu chauka jEsenu |
| చరణం charaNam 3 | రాతిరి నను గూడీ రాడాయ నేడు నాతిని జేరి నను మరచె నేడు | rAtiri nanu gUDI rADAya nEDu nAtini jEri nanu marache nEDu |
| చరణం charaNam 4 | సరసూడు లేని ఈ సొగసేలనె మనకు ఓర్వజాలను సామి ఇందు రాడాయనె | sarasUDu lEni I sogasElane manaku OrvajAlanu sAmi indu rADAyane |
| చరణం charaNam 5 | కాయజు కేళిలో కలియుట సమయము మాయకాడె వాడు మంగళపురి వాసుడు | kAyaju kELilO kaliyuTa samayamu mAyakADe vADu mangaLapuri vAsuDu |
#760 పిలచితె ప్రేమ pilachite prEma
| Title | పిలచితె ప్రేమ | pilachite prEma |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | దేశి కాపి | dESi kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | పిలచితె ప్రేమ లేదాయ పొలతిరో నేడు | pilachite prEma lEdAya polatirO nEDu |
| చరణం charaNam 1 | మార మోహనాంగునికి మనసిందు లేదాయ గారడము జేసుట ఘనమేమే సామికీ | mAra mOhanAnguniki manasindu lEdAya gAraDamu jEsuTa ghanamEmE sAmikI |
| చరణం charaNam 2 | కలికిరో నా సామి కలసిట్లు జేసితె పలచన గాదటె పణతుల లోను | kalikirO nA sAmi kalasiTlu jEsite palachana gAdaTe paNatula lOnu |
| చరణం charaNam 3 | మరచినాడె ఈ వ్యాళ మంగళపురి వాసుడు పరమాప్త మని యుంటినె ప్రాణేశుని నేను | marachinADe I vyALa mangaLapuri vAsuDu paramApta mani yunTine prANESuni nEnu |
#759 పిలచితె నేను pilachite nEnu
| Title | పిలచితె నేను | pilachite nEnu |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | పూర్వీ కల్యాణి | pUrvI kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Published At | 392 | |
| పల్లవి pallavi | పిలచితె నేను బల్కవేమి దేమిరా | pilachite nEnu balkavEmi dEmirA |
| అనుపల్లవి anupallavi | కాని దాని మాట వినీ కరుణ మరచె దేమిరా | kAni dAni mATa vinI karuNa marache dEmirA |
| చరణం charaNam 1 | మంచి వాడవని నేను మరులైతిని గదరా కొంచ కాడ అవులేరా కోర్కె దీరదాయా | manchi vADavani nEnu marulaitini gadarA koncha kADa avulErA kOrke dIradAyA |
| చరణం charaNam 2 | మనసు తెలియకను మగువ పొందు జేరితివి కనికర మింతైన లేక కలసిట్లు జేసితివి | manasu teliyakanu maguva pondu jEritivi kanikara mintaina lEka kalasiTlu jEsitivi |
| చరణం charaNam 3 | మారుని బారికి మనసు సైరిసదాయ మరచేది న్యాయమా మంగళపురి శ్రీనివాస | mAruni bAriki manasu sairisadAya marachEdi nyAyamA mangaLapuri SrInivAsa |
#758 చాలుర నీ పొందు chAlura nI pondu
| Title | చాలుర నీ పొందు | chAlura nI pondu |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | మాయామాళవ గౌళ | mAyAmALava gauLa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | చాలుర నీ పొందు సరసిజ నయన చాలు చాలు యింక సామిగ వినరా | chAlura nI pondu sarasija nayana chAlu chAlu yinka sAmiga vinarA |
| చరణం charaNam 1 | వేడుకొని అది వేగామె పిలచితె మోది జేసి యిందు మోహనాంగిని గూడితివి | vEDukoni adi vEgAme pilachite mOdi jEsi yindu mOhanAngini gUDitivi |
| చరణం charaNam 2 | యంతని వినవింతు పంతము యాలరా కాంతుడ నీ పొందు చింతకు లోనైతి | yantani vinavintu pantamu yAlarA kAntuDa nI pondu chintaku lOnaiti |
| చరణం charaNam 3 | ముచ్చు వగలు దాచు మంగళపురి వాస మోసము జేసుట మేరగాదు పోరా | muchchu vagalu dAchu mangaLapuri vAsa mOsamu jEsuTa mEragAdu pOrA |
#757 చిత్తము రాదె chittamu rAde
| Title | చిత్తము రాదె | chittamu rAde |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఏక | Eka |
| Previously Posted At | 387 | |
| పల్లవి pallavi | చిత్తము రాదె యాలనె నాపైన | chittamu rAde yAlane nApaina |
| చరణం charaNam 1 | అంతరంగము తోను కాంతుడు నను గూడి పంతము యాలనే చెంత రాడాయనే | antarangamu tOnu kAntuDu nanu gUDi pantamu yAlanE chenta rADAyanE |
| చరణం charaNam 2 | సరసుడు రాడాయ సకియరొ యేమి సేతు మరచినాడె నన్ను మగువరో యీ వేళ | sarasuDu rADAya sakiyaro yEmi sEtu marachinADe nannu maguvarO yI vELa |
| చరణం charaNam 3 | కాముని బారికి కలికి నే నోర్వను మమతెందు బోయనో మంగళపురి వాసునికి | kAmuni bAriki kaliki nE nOrvanu mamatendu bOyanO mangaLapuri vAsuniki |
#756 వాని పొందు vAni pondu
| Title | వాని పొందు | vAni pondu |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | దేశి కాపి | dESi kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వాని పొందు చాలునే వనజాక్షిరో నేడు | vAni pondu chAlunE vanajAkshirO nEDu |
| చరణం charaNam 1 | సరసుడనుచు నేను సరస మాడితి గాని సారసాక్షుల తోను సరసము పెంచను | sarasuDanuchu nEnu sarasa mADiti gAni sArasAkshula tOnu sarasamu penchanu |
| చరణం charaNam 2 | సదయు డనుచు నేను సకియ కోరితి గాని సుదతుల పాలాయ చెలియ నేనేమి సేతు | sadayu Danuchu nEnu sakiya kOriti gAni sudatula pAlAya cheliya nEnEmi sEtu |
| చరణం charaNam 3 | ప్రేమ మరచె నేడు మంగళపురి వాసుడు ఆ మగువ పొందు జేరీ మమతలు మరచెను | prEma marache nEDu mangaLapuri vAsuDu A maguva pondu jErI mamatalu marachenu |
#755 సామిగా నాపై sAmigA nApai
| Title | సామిగా నాపై | sAmigA nApai |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | దేశి కాపి | dESi kApi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | సామిగా నాపై చాలుర మోహము | sAmigA nApai chAlura mOhamu |
| చరణం charaNam 1 | మట్టు దెలిసెను లేరా మాయకాడ అవురా మాటలు చాలుర మొగవాడ వైతివి | maTTu delisenu lErA mAyakADa avurA mATalu chAlura mogavADa vaitivi |
| చరణం charaNam 2 | మాయదారికి నీవు మరులైతి వేమిరా ఆయలేర దెలిశా అవుర బాగాయ | mAyadAriki nIvu marulaiti vEmirA AyalEra deliSA avura bAgAya |
| చరణం charaNam 3 | మంగళపురి వాస మమతెందు బోయర మంగళాంగిని గూడిన మోహమెటు బోయర | mangaLapuri vAsa mamatendu bOyara mangaLAngini gUDina mOhameTu bOyara |
#754 మొగవారిని నమ్మరాదె mogavArini nammarAde
| Title | మొగవారిని నమ్మరాదె | mogavArini nammarAde |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | పూర్వీ కల్యాణి | pUrvI kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మొగవారిని నమ్మరాదె మగువ సామి రాడాయ | mogavArini nammarAde maguva sAmi rADAya |
| చరణం charaNam 1 | కులుకుచూ నాతోను కలసి మెలసి యుండిన పలుకు లెందు బోయనో పణతిరో నేడు | kulukuchU nAtOnu kalasi melasi yunDina paluku lendu bOyanO paNatirO nEDu |
| చరణం charaNam 2 | వెలదిరో అలనాడు వుపరతి వ్యాళలో అలసి కౌగిలించిన అక్కరెందు బోయనో | veladirO alanADu vuparati vyALalO alasi kaugilinchina akkarendu bOyanO |
| చరణం charaNam 3 | వర మంగళపురీశుని వలపెందుంచి నాడో మరియాదె వానికి మమతెందు బోయనో | vara mangaLapurISuni valapendunchi nADO mariyAde vAniki mamatendu bOyanO |