#801 వగల వయ్యారి vagala vayyAri

Titleవగల వయ్యారిvagala vayyAri
Written Byపట్రాయని సీతారామశాస్త్రిpaTrAyani sItArAmaSAstri
BookBunch of jAvaLis
రాగం rAgaకాపిkApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవగల వయ్యారి అదిరా ఆ చిన్నారి
వగల వయ్యారి అదిరా
vagala vayyAri adirA A chinnAri
vagala vayyAri adirA
అనుపల్లవి anupallaviసొగసరి జవరాలు తగినింటి మగనాలు
మురిపాల హొయల మైమరపించు ప్రియురాలు
sogasari javarAlu tagininTi maganAlu
muripAla hoyala maimarapinchu priyurAlu
చరణం
charaNam 1
అత్తా మామల వదిన బావా మరదుల
మగని చిత్త మెరిగిన నెరజాణ యదిరా
సరస సరాగాల చనవైన నయగారాల
హితులు సన్నిహితు లోహోయని మెచ్చే
attA mAmala vadina bAvA maradula
magani chitta merigina nerajANa yadirA
sarasa sarAgAla chanavaina nayagArAla
hitulu sannihitu lOhOyani mechchE
చరణం
charaNam 2
ఇంపైన మాటల సొంపైన పాటల
తీరైన నడతల తీయని వలపుల
నెనరైన పెనిమిటి మనసు దోచి
తనువు నెమ్మనము తనివోవజేసే
impaina mATala sompaina pATala
tIraina naDatala tIyani valapula
nenaraina penimiTi manasu dOchi
tanuvu nemmanamu tanivOvajEsE

#800 మోసపోతినే mOsapOtinE

TitleమోసపోతినేmOsapOtinE
Written Byకవి రంగదాసkavi rangadAsa
Book
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమోసపోతినే చెలియా మోసపోతినే
మోహనాంగుని చేరి నే
వాని మాట నమ్మి నే
mOsapOtinE cheliyA mOsapOtinE
mOhanAnguni chEri nE
vAni mATa nammi nE
అనుపల్లవి anupallaviఆశలు పెట్టి నాపై దోసమెంచెనేASalu peTTi nApai dOsamenchenE
చరణం
charaNam 1
వద్దంటే నాతో కూడి ముద్దు ముద్దుగా మాటలాడి
నిద్దుర పోయే వేళ సద్దు లేక పోయినాడె
vaddanTE nAtO kUDi muddu muddugA mATalADi
niddura pOyE vELa saddu lEka pOyinADe
Audio Linkhttps://www.youtube.com/watch?v=46jNyT4utHU

#799 బరువనో బారనో baruvanO bAranO

Titleబరువనో బారనోbaruvanO bAranO
Written Byశ్రీనాథ విఠ్ఠలSrInAtha viThThala
Book
రాగం rAgaసింధు భైరవిsindhu bhairavi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviబరువనో బారనో ప్రియనుbaruvanO bAranO priyanu
చరణం
charaNam 1
కరెదరె బార సుమనిరలార
తరుణిగె దీవన మనవు తిలివుదు
karedare baara sumaniralaara
taruNige dIvana manavu tilivudu
చరణం
charaNam 2
ఆసెపూరిస బేకు ఇల్లవె బిడ బేకు
శ్రీశ శ్రీనాథ విఠ్ఠల నల్లి మనవిడ బేకు
AsepUrisa bEku illave biDa bEku
SrISa SrInAtha viThThala nalli manaviDa bEku
Audio Linkhttps://www.youtube.com/watch?v=Mp1wm6RTEXM

#798 పోకిరి తనములు pOkiri tanamulu

Titleపోకిరి తనములుpOkiri tanamulu
Written ByభీమేశదాసbhImESadAsa
Book
రాగం rAgaరాగమాలిక rAgamAlika
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviరాగం: శంకరాభరణం
పోకిరి తనములు బాగ తెలియ వచ్చె
ప్రక్క ఇంటికి పోపోరా
మాయింటికి రాకరాక పోపోరా
rAga: SankarAbharaNam
pOkiri tanamulu bAga teliya vachche
prakka inTiki pOpOrA
mAyinTiki rAkarAka pOpOrA
గోపాలు గుడికి నే గుంపు తోను పోతే
వీపు వెనక బట్టి అధరము కొరికేవు
కోపము బట్టు నా కొంగుని పట్టక
మాపటి వేళకు మావారు వచ్చేరు
ప్రక్క ఇంటికి పోపోరా
gOpAlu guDiki nE gumpu tOnu pOtE
vIpu venaka baTTi adharamu korikEvu
kOpamu baTTu nA konguni paTTaka
mApaTi vELaku mAvAru vachchEru
prakka inTiki pOpOrA
రాగ: మోహన
నిన్న దాని ఇంట నీవు జేసిన సైగల
పంగేలు జూచెర లలనామణీ నిన్ను
కన్నులెర్రగ జేసి ఖండిత మాడగ
నిన్నది పదమంటి బతిమాలినది తనకె??
ప్రక్క ఇంటికి పోపోరా
rAga: mOhana
ninna dAni inTa nIvu jEsina saigala
pangElu jUchera lalanAmaNI ninnu
kannulerraga jEsi khanDita mADaga
ninnadi padamanTi batimAlinadi tanake??
prakka inTiki pOpOrA
రాగ: ఆనందభైరవి
సరసము జేసేవు సొగసుగాడ నీవు
పరులు జూచెరె నిన్ను పంతము జేసేరు
మరుని కేళిలో నన్ను మమతతో గూడిన
గురువర భీమేశ విఠలుడు ఈ వేళ
ప్రక్క ఇంటికి పోపోరా
rAga: Anandabhairavi
sarasamu jEsEvu sogasugADa nIvu
parulu jUchere ninnu pantamu jEsEru
maruni kELilO nannu mamatatO gUDina
guruvara bhImESa viThaluDu I vELa
prakka inTiki pOpOra
Audio/ Video Linkhttps://www.youtube.com/watch?v=EXYfEubs-os

#797 ఏమి సేతునే Emi sEtunE

Titleఏమి సేతునేEmi sEtunE
Written ByDr పసుమర్తి విఠల్Dr pasumarti viThal
Book
రాగం rAgaఅభేరిabhEri
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఏమి సేతునే చెలియా ఏమనందునే ఏఁ
ఏమి సేతునే చెలియా నిన్నేమనందునే ఏఁ
Emi sEtunE cheliyA EmanandunE E@M
Emi sEtunE cheliyA ninnEmanandunE E@M
దొరయైన నా స్వామి దొంగిలించె మనము || ఏమి||dorayaina nA swAmi dongilinche manamu || Emi||
పలుమారు నను పలుకరించి సరసమాడి పోయేనే || ఏమి||palumAru nanu palukarinchi sarasamADi pOyEnE || Emi||
నిన్న మొన్న దాక నన్ను రవ్వ చేసినాడే
వీనుల విందుగ నాతో మధుర భాష లాడెనే
కమ్మని పిలుపుతో విఠలుని కబురు పంపితే గదవే || ఏమి||
ninna monna dAka nannu ravva chEsinADE
vInula vinduga nAtO madhura bhAsha lADenE
kammani piluputO viThaluni kaburu pampitE gadavE || Emi||

#796 అరుళ్వాయ్ మురుగా aruLvAy murugA

Titleఅరుళ్వాయ్ మురుగాaruLvAy murugA
Written Byచిత్రవీణ రవికిరణ్chitravINa ravikiraN
Bookrasikas.org
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఅరుళ్వాయ్ మురుగా మయిల్ మీదేరి వన్aruLvAy murugA mayil mIdEri van
అనుపల్లవి anupallaviవిళైయాడి ఓడి పాడి నాం కళిత్తిడవే నీ విరైవిల్ వన్viLaiyADi ODi pADi nAm kaLittiDavE nI viraivil van
చరణం
charaNam 1
సోమశేఖరన్ ప్రేమ సుతనే రామన్ మరుగనే కుమరనే కురమగళ్
కామ సుందరనే రవి శశి వేణ్డుం పుణ్ణియనే నీ వన్
sOmaSEkharan prEma sutanE rAman maruganE kumaranE kuramagaL
kAma sundaranE ravi SaSi vENDum puNNiyanE nI van
చరణం
charaNam 2
తామదం ఎన్నాల్ తాళ ఇయలవిల్లై కరుణై సైవాయ్ ఉయర్
సామం పుగళుం శీలనే తమిళ్ లోలనే వడివేలనే
tAmadam ennAl tALa iyalavillai karuNai seivAy uyar
sAmam pugazhum SIlanE tamizh lOlanE vaDivElanE
Audio Link:https://www.youtube.com/watch?v=_ynPQ_5XcXw
Took the liberty to write ళ్ (L) instead of ‘zh’ – since that is the closest that Telugu script supports for the Tamil sound zh

#795 ఇన్నాళ్ళవలె innALLavale

Titleఇన్నాళ్ళవలెinnALLavale
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaతోడిtODi
తాళం tALa
పల్లవి pallaviఇన్నాళ్ళవలె గాదమ్మ మా గోపాలుడు
ఎన్నెన్నొ నేర్చినాడమ్మా
innALLavale gAdamma mA gOpAluDu
ennenno nErchinADammA
చరణం
charaNam 1
నన్ను కనుల మూసి నా చెంతనుండి
సన్నుతాంగి మోసి చప్పరించెనె
nannu kanula mUsi nA chentanunDi
sannutAngi mOsi chapparinchene
చరణం
charaNam 2
పదరాకనూ వాగు గోపాలుడు నను జూడ
మదిరాక్షిరొ దాని మమత జేర్చుకొనెనె
padarAkanU vAgu gOpAluDu nanu jUDa
madirAkshiro dAni mamata jErchukonene
చరణం
charaNam 3
కొదమ గుబ్బల పైని కోకాడు దలగింప
కదిలి నే నడిగితె తుద నన్ను గూడెనె
kodama gubbala paini kOkADu dalagimpa
kadili nE naDigite tuda nannu gUDene

#794 యేమొ చెలియా yEmo cheliyA

Titleయేమొ చెలియాyEmo cheliyA
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకమాస్kamAs
తాళం tALa
పల్లవి pallaviయేమొ చెలియా మోసమాయె యేమి చేతునే
ఓ చెలియా నేనేమి చేతునే
చెలియా నేనేమి చేతునే
yEmo cheliyA mOsamAye yEmi chEtunE
O cheliyA nEnEmi chEtunE
cheliyA nEnEmi chEtunE
చరణం
charaNam 1
ప్రేమ పాత్రుడైన సామి యిక యేమొ దయలేక
సుందరాంగుడైన నా సఖుడెందుకో రాడాయెనయ్యో
prEma pAtruDaina sAmi yika yEmo dayalEka
sundarAnguDaina nA sakhuDendukO rADAyenayyO
చరణం
charaNam 2
గరపురీశుడైన (?) సామి కరుణ తోనె నాదు కరము బట్టి
సరస మాడి మరులు చేసి పోయెనయ్యో
garapurISuDaina (?) sAmi karuNa tOne nAdu karamu baTTi
sarasa mADi marulu chEsi pOyenayyO

#793 మగడొచ్చి magaDochchi

Titleమగడొచ్చిmagaDochchi
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALa
పల్లవి pallaviమగడొచ్చి పిలచేడు పోయి వత్తుర ప్రీతి
మరువ కుండుర నా సామి
magaDochchi pilachEDu pOyi vattura prIti
maruva kunDura nA sAmi
చరణం
charaNam 1
పగవారు జూచిన పలు విధముల నన్ను
నగుబాటు జేతురు వగపూల బాలను నా
pagavAru jUchina palu vidhamula nannu
nagubATu jEturu vagapUla bAlanu nA
చరణం
charaNam 2
సరసాన నీ వదనము అర నిమిష మైనను
దర్శించకుంటె భరియింప ప్రాణముల్
sarasAna nI vadanamu ara nimisha mainanu
darSinchakunTe bhariyimpa prANamul
చరణం
charaNam 3
సరగూన వచ్చి నీ పరితాప మార్చెద
నెరదాత వైనట్టి వరద వేణుగోపాల
saragUna vachci nI paritApa mArcheda
neradAta vainaTTi varada vENugOpAla

#792 నా హృదయ nA hRdaya

Titleనా హృదయ nA hrudaya
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaసురటsuraTa
తాళం tALa
పల్లవి pallaviనా హృదయ ఫలకమున యా నాతి రూపు
రేఖా విలాసములు నాటి పోయెగా
nA hRdaya phalakamuna yA nAti rUpu
rEkhA vilAsamulu nATi pOyegA
చరణం
charaNam 1
చీమ చిటుకుమన్న మరల
చెలియ వచ్చెనని యెంతొ
యేమేమో తీరుల నెంచు చుంటినిగా
chIma chiTukumanna marala
cheliya vachchenani yento
yEmEmO tIrula nenchu chunTinigA
చరణం
charaNam 2
ఆ హొయలును ఆ నడలు
ఆ పలుకులు ఆ కులుకులు
ఆహా నా మదికి మరపు రాక యుండెగా
A hoyalunu A naDalu
A palukulu A kulukulu
AhA nA madiki marapu rAka yunDegA