#731 చిన్ననాటి chinnanATi

Titleచిన్ననాటిchinnanATi
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviచిన్న నాటి స్నేహము మరువ వద్దుర నా ప్రియchinna nATi snEhamu maruva vaddura nA priya
అనుపల్లవి anupallaviమరువ వద్దుర నా ప్రియ నిన్ను చూడక
నా మది నిలువ జాలదుర సామిగ
maruva vaddura nA priya ninnu chUDaka
nA madi niluva jAladura sAmiga
చరణం
charaNam 1
సూన శరుని జాలములకు తాళలేదుర నా మది
పాపి మారుడు క్రూరుడై బల్ తాపమొందగ జేసెరా
sUna Saruni jAlamulaku tALalEdura nA madi
pApi mAruDu krUruDai bal tApamondaga jEserA
చరణం
charaNam 2
ప్రాయము నుండి నీపై చాల మరులు కొంటిర
నా పైన నేరమా యేమది బల్కర సామిగ
prAyamu nunDi nIpai chAla marulu konTira
nA paina nEramA yEmadi balkara sAmiga
చరణం
charaNam 3
విరహ బాధ కోర్వ జాలక నీ మరుగున జొచ్చితి
నా మనసున నొప్పించక వేగమె కలయర
viraha bAdha kOrva jAlaka nI maruguna jochchiti
nA manasuna noppinchaka vEgame kalayara
చరణం
charaNam 4
పలు విధముల రతులతో నిన్ను కలయ వలె
నని మనంబు చాల తత్తర పడు చున్నదిరా
palu vidhamula ratulatO ninnu kalaya vale
nani manambu chAla tattara paDu chunnadirA

#730 దారి జూచు dAri jUchu

Titleదారి జూచుdAri jUchu
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviదారి జూచుచుంటిరా నీదు
ప్రేమ కోరి వేచి యుంటిర
dAri jUchuchunTirA nIdu
prEma kOri vEchi yunTira
అనుపల్లవి anupallaviఅలరు విల్తుడు శర జాలము లెద కేయ
నిలువ జాలక తల వాకిట నిలచి నే
alaru viltuDu Sara jAlamu leda kEya
niluva jAlaka tala vAkiTa nilachi nE
చరణం
charaNam 1
మల్లెలు మొల్లలు మంచి విరజాజులు
మెల్లగ తెప్పించి మాలలు గూర్చి నే
mallelu mollalu manchi virajAjulu
mellaga teppinchi mAlalu gUrchi nE
చరణం
charaNam 2
వెన్నెల రేయిది మల్లె పూపాన్పున
కళలంటి సొక్కింతువని యెంచి
vennela rEyidi malle pUpAn&puna
kaLalanTi sokkintuvani yenchi
చరణం
charaNam 3
ఉద్యాన వనమున ఉల్లాసముగ నేడు
ఉపరతి సమరతి తేలింప గలవని
udyAna vanamuna ullAsamuga nEDu
uparati samarati tElimpa galavani

#729 ఇది న్యాయమా idi nyAyamA

Titleఇది న్యాయమాidi nyAyamA
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇది న్యాయమా సామి నీకు యితరుల వలచేదిidi nyAyamA sAmi nIku yitarula valachEdi
అనుపల్లవి anupallaviసదయుడవని నిన్నే నమ్మి యుంటిరాsadayuDavani ninnE nammi yunTirA
చరణం
charaNam 1
చిన్న నాడే నన్ను చేయి బట్టితివి
నన్ను విడనాడనని అన్న మాట నమ్మితి
chinna nADE nannu chEyi baTTitivi
nannu viDanADanani anna mATa nammiti
చరణం
charaNam 2
మక్కువతో నన్ను గూడి మాయలెన్నో జేసి
ముక్కుపచ్చ లారని నన్ను టక్కులెన్నో జేసి పోవు
makkuvatO nannu gUDi mAyalennO jEsi
mukkupachcha lArani nannu TakkulennO jEsi pOvu

#728 ఇంతిరో intirO

TitleఇంతిరోintirO
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaఆదిAdi
Previously Published At680
పల్లవి pallaviఇంతిరో వాని మనసెంతొ చిన్నబోయెనోintirO vAni manasento chinnabOyenO
చరణం
charaNam 1
కాంతుని కౌగిటి లోన కలయగనె నడువరా యనkAntuni kaugiTi lOna kalayagane naDuvarA yana
చరణం
charaNam 2
తరుణిరో అర గడియ నన్ను తాళనివ్వని
మరుడు విరి శరముల బారికి యీ
విరి శరముల బారికి ఎంత దద్దరిల్లితినో
taruNirO ara gaDiya nannu tALanivvani
maruDu viri Saramula bAriki yI
viri Saramula bAriki enta daddarillitinO

#727 ఇది మేలా idi mElA

Titleఇది మేలాidi mElA
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaఅఠాణాaTHANA
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇది మేలా నీకిది మేలా సరసుడ మది
భేదమెంచక తెలుపర సుకుమార మనోహర
idi mElA nIkidi mElA sarasuDa madi
bhEdamenchaka telupara sukumAra manOhara
చరణం
charaNam 1
తళుకారు ముద్దు చెక్కుల నే నెలవంక గోరులుంతునా
పలుగంటు సేయ కమ్మగా పయిపయిన ముద్దులుంతునా
taLukAru muddu chekkula nE nelavanka gOruluntunA
paluganTu sEya kammagA payipayina mudduluntunA
చరణం
charaNam 2
తరి రామ మోవి తేనియల్ దగ తీర గ్రోలి కందు నా
చెలువారు మోవి మోవితో నెలకొల్పి యూరకొండునా
tari rAma mOvi tEniyal daga tIra grOli kandu nA
cheluvAru mOvi mOvitO nelakolpi yUrakonDunA
చరణం
charaNam 3
అనువొంద నీ యురముపై మొనగుబ్బ పోతులుంతునా
నును మేను నాదు కౌగిటిని గూర్చి యదుము కొందునా
anuvonda nI yuramupai monagubba pOtuluntunA
nunu mEnu nAdu kaugiTini gUrchi yadumu kondunA
చరణం
charaNam 4
ఉపమాన రహితమైన యా యుపరతి సుఖమ్ము కందునా
కృప గల్గు సింహ పురవరా రంగేశ సమరతి నుందునా
upamAna rahitamaina yA yuparati sukhammu kandunA
kRpa galgu sim^ha puravarA rangESa samarati nundunA

#726 సమయము మంచిది samayamu manchidi

Titleసమయము మంచిదిsamayamu manchidi
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaదర్బారుdarbAru
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసమయము మంచిదిరా సరసుడా లేచిరారా
సుమ శరు బారికి నే సొక్కితి గదరా
samayamu manchidirA sarasuDA lEcirArA
suma Saru bAriki nE sokkiti gadarA
చరణం
charaNam 1
కోరికలెన్నో మది గోరుచున్న దానరా
మారసుందరా నిన్నేమారను మారనురా
kOrikalennO madi gOruchunna dAnarA
mArasundarA ninnEmAranu mAranurA
చరణం
charaNam 2
ఎన్ని నాళ్ళుగా నిదే నిన్నెలయగ నుంటిరా
వన్నెకాడ నీ సొగసు నే వర్ణించు చుంటిరా
enni nALLugA nidE ninnelayaga nunTirA
vannekADa nI sogasu nE varNinchu chunTirA
చరణం
charaNam 3
ఎమ్మెకాడ గుబ్బ రొమ్మెల్ల నిండెరా
చెమ్మటలు గ్రమ్మెరా సింహ నగరేశ్వరా
emmekADa gubba rommella ninDerA
chemmaTalu grammerA sim^ha nagarESvarA

#725 అకట మరుపాయె akaTa marupAye

Titleఅకట మరుపాయెakaTa marupAye
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaశహనSahana
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఅకట మరుపాయె నౌర అబ్బురమాయె
అక్కర దెలసి రావైతి వదేమిర
akaTa marupAye naura abburamAye
akkara delasi rAvaiti vadEmira
చరణం
charaNam 1
పక్కబాసి పోవు వేళలో
యెక్కడికి యని చెయి పట్టగ
నిక్కముగ నిదె వత్తునని చని
నిన్న ప్రొద్దుట నుండి కనబడవు
pakkabAsi pOvu vELalO
yekkaDiki yani cheyi paTTaga
nikkamuga nide vattunani chani
ninna prodduTa nunDi kanabaDavu
చరణం
charaNam 2
ఏడాది పండుగ నేడే యని యెంచి
నీ జత ఆశించి అలంకరించితి
జలకంబు లాడి చలువ ధరించితి
కస్తూరి బొట్టు తీరుగ నొనరించితి
EDAdi panDuga nEDE yani yenchi
nI jata ASinchi alankarinchiti
jalakambu lADi chaluva dharinchiti
kastUri boTTu tIruga nonarinchiti
చరణం
charaNam 3
నాడు నాటికి వేడుకల్ బల్
పోడిమిగ చెలువుడ ఆడితివ ఆ వాడవాడల
చెలుల నంపిన లేడు లేడని మరలి వచ్చిరి
పడకటింట మంచి వాసన పన్నీటిని చిలికించితి
nADu nATiki vEDukal bal
pODimiga cheluvuDa ADitiva A vADavADala
chelula nampina lEDu lEDani marali vachchiri
paDakaTinTa manchi vAsana pannITini chilikinchiti
చరణం
charaNam 4
రంగైన పుప్పొడి ముగ్గుల అలరించితి
పాన్పు పైన విడి పువ్వులు పరపించితి
వడివడిగ తెల నాకు ముడుపులు
ముడుపులుగ మడిపించితి
rangaina puppoDi muggula alarinchiti
pAn&pu paina viDi puvvulu parapinchiti
vaDivaDiga tela nAku muDupulu
muDupuluga maDipinchiti
చరణం
charaNam 5
నిడుపుగల యా పూసరులు
గ్రుమ్మడి ముడువ పనిబడి నిడితిని
సతి పతులు మరేనాటి కెడబాయక
యుందురని బల్కినది
niDupugala yA pUsarulu
grummaDi muDuva panibaDi niDitini
sati patulu marEnATi keDabAyaka
yundurani balkinadi
చరణం
charaNam 6
సద్దు సేయక పోతివింక గానిమ్ము తడవు సేయక
పోనీ పోనీ వచ్చితివి నీ పుణ్యమా
రంగడ సూనశరు శర జాలములకే
సొక్కిపోతి నరసింహపుర
saddu sEyaka pOtivinka gAnimmu taDavu sEyaka
pOnI pOnI vachchitivi nI puNyamA
rangaDa sUnaSaru Sara jAlamulakE
sokkipOti narasim^hapura

#724 అలసిపోతి alasipOti

TitleఅలసిపోతిalasipOti
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఅలసిపోతి వయ్యొ సామి అంతే చాలు నేటి కిక
కలయుటకు కాలము లేదా మరేమి
alasipOti vayyo sAmi antE chAlu nETi kika
kalayuTaku kAlamu lEdA marEmi
అనుపల్లవి anupallaviకులము వారమై యుండగ
కూడిక సతమై యుండగ
తలపనేల సింహ నగర
ధామ శ్రీ రంగధామ
kulamu vAramai yunDaga
kUDika satamai yunDaga
talapanEla sim^ha nagara
dhAma SrI rangadhAma
చరణం
charaNam 1
బలితపు చెమట సోనల తోడ
వాడిన నెమ్మోము క్రొన్దమి తోడ
వెలయు నిట్టూర్పు సెగల తోడ
విరిసి విరియని కన్దొగల తోడ
balitapu chemaTa sOnala tODa
vADina nemmOmu kron&dami tODa
velayu niTTUrpu segala tODa
virisi viriyani kan&dogala tODa
చరణం
charaNam 2
వడకెడు నును నెమ్మేని తోడ
తడబడు మాటల చవి తోడ
అడలు నట్టి పెన్దొడల తోడ
అసురు సురులతో నీ తోడు
vaDakeDu nunu nemmEni tODa
taDabaDu mATala chavi tODa
aDalu naTTi pen&doDala tODa
asuru surulatO nI tODu
చరణం
charaNam 3
కలిగిన దెల్ల నొక నాడు
కడ జేసుకోగా మరునాడు
కళలు జారిపోయె చూడు
నిలుపుము సింహపురవర నేడు
kaligina della noka nADu
kaDa jEsukOgA marunADu
kaLalu jAripOye chUDu
nilupumu sim^hapuravara nEDu

#723 ఇక నేమందు ika nEmandu

Titleఇక నేమందుika nEmandu
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇక నేమందు చెలియా నా సామికి
నామీద యేమో అలుకాయెనె
ika nEmandu cheliyA nA sAmiki
nAmIda yEmO alukAyene
చరణం
charaNam 1
ఏ మాయలాడి తనే మందిడెనో
ప్రేమతో ముద్దులిడుటె మానుకున్నాడే
నే మాటాడితే యేమో మాటాడాకున్నాడే
E mAyalADi tanE mandiDenO
prEmatO mudduliDuTe mAnukunnADE
nE mATADitE yEmO mATADAkunnADE
చరణం
charaNam 2
దిట్టము తోడ నాదు పక్క పూపాన్పు జేర
చేయి బట్టి పిలిచితే ముట్టవద్దనే
ప్రేమతో బాలచంద్ర నాథుడు
నన్నేలి యే నాతి బోధచే నీతి దప్పెనో
diTTamu tODa nAdu pakka pUpAn&pu jEra
chEyi baTTi pilichitE muTTavaddanE
prEmatO bAlachandra nAthuDu
nannEli yE nAti bOdhachE nIti dappenO

#722 హా ప్రియా hA priyA

Titleహా ప్రియాhA priyA
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
Previously Published At92
పల్లవి pallaviహా ప్రియా యని నిను బాసితె యిక
నే ప్రకారము సహింతునే
hA priyA yani ninu bAsite yika
nE prakAramu sahintunE
చరణం
charaNam 1
పాపి మారుడిటు క్రూరుడై పరితాప మొందగ జేసెనే
పాపి బోధనతో నన్నిటు జేయుట న్యాయమా
pApi mAruDiTu krUruDai paritApa mondaga jEsenE
pApi bOdhanatO nanniTu jEyuTa nyAyamA
చరణం
charaNam 2
నిన్న రాత్రి నన్ను గూడిన వన్నెకాడిటు జేసెనే
కన్నె ననక వాడెన్నో చిన్నెల చిన్నబుచ్చె నా మది
ninna rAtri nannu gUDina vannekADiTu jEsenE
kanne nanaka vADennO chinnela chinnabuchche nA madi
చరణం
charaNam 3
మరుకేళి నను గూడినపుడు నేరమే మొనరించె
నేను రసిక రాజవని పాట పాడితే రాపు జేయుట యేల
marukELi nanu gUDinapuDu nEramE monarinche
nEnu rasika rAjavani pATa pADitE rApu jEyuTa yEla