#721 ఎల్లకాల మిట్లైతే ellakAla miTlaitE

Titleఎల్లకాల మిట్లైతేellakAla miTlaitE
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaఅఠాణాaTHANA
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఎల్లకాల మిట్లైతే యెవతె ఓర్చురా సామి
తెల్లవారినది యిల్లువాకి లనుకోవేమిర
ellakAla miTlaitE yevate OrchurA sAmi
tellavArinadi yilluvAki lanukOvEmira
చరణం
charaNam 1
అలదాని నెమ్మోము నిల్వు టద్దమాయెనా ఆ
పొలతి వలపు అపరంజి బంగార మాయెనా
కలికి పెందొడలు తలగడ లాయెనా
aladAni nemmOmu nilvu TaddamAyenA A
polati valapu aparanji bangAra mAyenA
kaliki pendoDalu talagaDa lAyenA
చరణం
charaNam 2
నెలత తరి చెమట పన్నీటి సోనలాయెనా
మేలు సింహపుర పరిపాల నీకిది సరియా
రేపగలు దానిదే లోకమాయెనా
nelata tari chemaTa pannITi sOnalAyenA
mElu sim^hapura paripAla nIkidi sariyA
rEpagalu dAnidE lOkamAyenA

#720 అత్త వారూరికి atta vArUriki

Titleఅత్త వారూరికిatta vArUriki
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaశహనSahana
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఅత్తవారూరికి అంపేరు మా వారు
అయ్యయ్యో ఇకనేమి సేయుదునే
attavArUriki ampEru mA vAru
ayyayyO ikanEmi sEyudunE
అనుపల్లవి anupallaviకత్తి కోతగాడు మగడేమి జేసునో
పొత్తు మరువక యుండు పోయి వచ్చెద సామి
katti kOtagADu magaDEmi jEsunO
pottu maruvaka yunDu pOyi vachcheda sAmi
చరణం
charaNam 1
ఊరికి నే బోయి ఉన్నా యెప్పటికైన
తీరినట్టు గుట్టు తెలుపకు నా సామి
సారెకు మా బావ సవతి యత్త తోడ
పోరాడి యెటులైన బొంకి వచ్చెద సామి
Uriki nE bOyi unnA yeppaTikaina
tIrinaTTu guTTu telupaku nA sAmi
sAreku mA bAva savati yatta tODa
pOrADi yeTulaina bonki vachcheda sAmi
చరణం
charaNam 2
నడిరేయి జామున నను దలచి పక్కలో
ఉలికి దిగ్గున లేచి పలువరించకు సామి
కులుకుగ మన యూరి పొలతులతో గూడి
పడుచు తనమున నీవు వదరకుర సామి
naDirEyi jAmuna nanu dalachi pakkalO
uliki digguna lEchi paluvarinchaku sAmi
kulukuga mana yUri polatulatO gUDi
paDuchu tanamuna nIvu vadarakura sAmi
చరణం
charaNam 3
తిరిగిరాన నెంచకు తిరిగి వచ్చెద సామి
విరజిమ్మి నా యాస విడిపింతు వేమొ
గురిలేక మా మువ్వ గోపాల సామిగ
మరుకేళి గూడుట మరచి పోయెద వేమొ
tirigirAna nenchaku tirigi vachcheda sAmi
virajimmi nA yAsa viDipintu vEmo
gurilEka mA muvva gOpAla sAmiga
marukELi gUDuTa marachi pOyeda vEmo

#719 మోడి జేసేవేలరా mODi jEsEvElarA

Titleమోడి జేసేవేలరాmODi jEsEvElarA
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
Previously Published At676, 707
పల్లవి pallaviమోడి జేసేవేలరా యీడుకాడ నాతో
పాడి సరసమాడి ముద్దీయరా
mODi jEsEvElarA yIDukADa nAtO
pADi sarasamADi muddIyarA
చరణం
charaNam 1
వయ్యారి మాటలతో సయ్యాట లాడుచు
మోహాన నాదు ప్రియువని చెయ్యి బట్టితే
vayyAri mATalatO sayyATa lADuchu
mOhAna nAdu priyuvani cheyyi baTTitE
చరణం
charaNam 2
శృంగారమైన యీడు బంగారు చిన్నదానితో
రంగాన్న వారికే రంగా శుభాంగా
SRngAramaina yIDu bangAru chinnadAnitO
ramgAnna vArikE ramgA SubhAngA
చరణం
charaNam 3
తాళవనేశ మొర లాలించి సమ
కేళి గలసి తేలించు మిదే
tALavanESa mora lAlinchi sama
kELi galasi tElinchu midE
This version appears more complete and accurate than other two we posted!

#718 నేడేలరా యీ nEDElarA yI

Titleనేడేలరా యీnEDElarA yI
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaఅఠాణాaTHANA
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviనేడేలరా యీ జాలము
చాలురా రారా సామి
nEDElarA yI jAlamu
chAlurA rArA sAmi
చరణం
charaNam 1
ఈ లాగున బహు నాళ్ళుగ ప్రేమ లతా బధ్ధులమై
రేయీ పగలూ రతి కేళిలో ఓల లాడుదము
I lAguna bahu nALLuga prEma latA badhdhulamai
rEyI pagalU rati kELilO Ola lADudamu
చరణం
charaNam 2
నిన్న మొదలుగ నొక వన్నెలాడి నిన్ను కను
సన్నలచే బిలచి నట్లు విన్నానురా లేకున్నను
ninna modaluga noka vannelADi ninnu kanu
sannalachE bilachi naTlu vinnAnurA lEkunnanu
చరణం
charaNam 3
అందగత్తె యని మది యందు భ్రమ జెందకురా
డెందము రాయిరా మచ్చు మందులమారి గదా
andagatte yani madi yandu bhrama jendakurA
Dendamu rAyirA machchu mandulamAri gadA
చరణం
charaNam 4
పాలు నీరు బోలి మనమేకమై యెట్లుందిమో ఆ
లీలగా నుందాము శ్రీ లోలా సింహపురి పాలా
pAlu nIru bOli manamEkamai yeTlundimO A
lIlagA nundAmu SrI lOlA sim^hapuri pAlA

#717 అలవాటు కాలేదురా alavATu kAlEdurA

Titleఅలవాటు కాలేదురాalavATu kAlEdurA
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaఅఠాణాaTHANA
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఅలవాటు కాలేదురా అందుకు బాగalavATu kAlEdurA anduku bAga
అనుపల్లవి anupallaviవగకాడ శ్రీ సింహ నగర రంగేశాvagakADa SrI sim^ha nagara rangESA
చరణం
charaNam 1
మొగ్గ చన్గవ లేత మోవి చెక్కులు తొడలు
అగ్గలంపు సేతల కట్టా యోర్వను సామి
mogga chan&gava lEta mOvi chekkulu toDalu
aggalampu sEtala kaTTA yOrvanu sAmi
చరణం
charaNam 2
వలరాయుని గన్న వాడవనుచు నిన్ను
వలచితిని లేర వయ్యారి సామి
valarAyuni ganna vADavanuchu ninnu
valachitini lEra vayyAri sAmi
చరణం
charaNam 3
ఎగతాళి గాదుర యెంత సేపాయె
వగకాడ శ్రీ సింహ నగర రంగేశా
egatALi gAdura yenta sEpAye
vagakADa SrI sim^ha nagara rangESA

#716 విరహము తాళలేనే virahamu tALalEnE

Titleవిరహము తాళలేనేvirahamu tALalEnE
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAm
రాగం rAgaకాపిkApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవిరహము తాళలేనే
వినవె నా సఖియరో
virahamu tALalEnE
vinave nA sakhiyarO
అనుపల్లవి anupallaviఇంత రాత్రి వేళలో నిదుర బోవగ
మోసగించినాడు చెలీ
ముద్దు బెట్టి పోయెనమ్మా
inta rAtri vELalO nidura bOvaga
mOsaginchinADu chelI
muddu beTTi pOyenammA
చరణం
charaNam 1
కాము నన్నొచ్చి నిదుర మోమున
కన్నులకు గానరాడె కలయక పోయెనమ్మ
kAmu nannochchi nidura mOmuna
kannulaku gAnarADe kalayaka pOyenamma

#715 ఇంత పంతమేల inta pantamEla

Titleఇంత పంతమేలinta pantamEla
Written By
Bookగడ్డిభుక్త సీతారాం gaDDibhukta sItArAm
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇంత పంతమేల ప్రాణకాంతుడా
అంతరంగుడవని ఆదరించితిని
inta pantamEla prANakAntuDA
antaranguDavani Adarinchitini
చరణం
charaNam 1
చెంత జేరితి కంతు కేళికి రావా
ఇంతలోనె జేరి పంతమాడుటేరా
chenta jEriti kantu kELiki rAvA
intalOne jEri pantamADuTErA

#714 ఎంతటి కులుకే entaTi kulukE

Titleఎంతటి కులుకేentaTi kulukE
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookhttps://karnatik.com/c16930.shtml
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaరూపకrUpaka
Previously Published At632
పల్లవి pallaviఎంతటి కులుకే ఇంతిరో కాంతుని కిపుడుentaTi kulukE intirO kAntuni kipuDu
అనుపల్లవి anupallaviపంతము గల పరాంభోజ ముఖి పెనగినందుకు ?pantamu gala parAmbhOja mukhi penaginanduku ?
చరణం
charaNam 1
హొయలు మీరి వీధిలోన బయలుదేరి నన్ను జూచి
భయము లేక పాట పాడి కన్ను సైగ జేయునే ఇది
hoyalu mIri vIdhilOna bayaludEri nannu jUchi
bhayamu lEka pATa pADi kannu saiga jEyunE idi
చరణం
charaNam 2
మరపు లేక నిన్న రేయి ధరపురీశుడైన సామి
మరుని కేళి లోన నాతో మాటలాడేమిటిది
marapu lEka ninna rEyi dharapurISuDaina sAmi
maruni kELi lOna nAtO mATalADEmiTidi
AV Linkhttps://www.youtube.com/watch?v=cD6p4HedIjk

#713 సారమైన sAramaina

TitleసారమైనsAramaina
Written Byస్వాతి తిరునాళ్svAti tirunAL
Bookhttps://karnatik.com/c2634.shtml
రాగం rAgaబేహాగ్ bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసారమైన మాటలెన్నొ చాలు చాలు రాsAramaina mATalenno chAlu chAlu rA
అనుపల్లవి anupallaviసారసాక్ష మీమెంతో ? సంతోషము మేలుsArasAksha mImentO ? santOshamu mElu
చరణం
charaNam 1
సోముడు దయమాయనేమి సుదతికి మహా భాగ్య
మాయనే కామకోటి సుందర మా భాగ్య మిటులాయనే
sOmuDu dayamAyanEmi sudatiki mahA bhAgya
mAyanE kAmakOTi sundara mA bhAgya miTulAyanE
చరణం
charaNam 2
మనవి వినర సామి నిన్ను నమ్మియున్నాను మరేమి
ఘనుడైన శేషునివై వెలయు శ్రీ పద్మనాభ
manavi vinara sAmi ninnu nammiyunnAnu marEmi
ghanuDaina SEshunivai velayu SrI padmanAbha

#712 మథురా నగరిలో mathuraa nagarilO

Titleమథురా నగరిలోmathuraa nagarilO
Written Byచిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళైchittUr subrahmaNya piLLai
Bookhttps://www.karnatik.com/c1025.shtml
రాగం rAgaఆనందభైరవిAnandabhairavi
తాళం tALaఆదిAdi
Previously Posted At690
పల్లవి pallaviమధురా నగరిలో చల్ల నమ్మ పొదు
దారి విడుము కృష్ణా, కృష్ణా
madhurA nagarilO challa namma podu
daari viDumu kRshNA, kRshNA
అనుపల్లవి anupallaviమాపటి వేళకు తప్పక వచ్చెద
పట్టకురా కొంగు గట్టిగాను కృష్ణా
maapaTi vELaku tappaka vachcheda
paTTakuraa kongu gaTTigaanu kRshNA
చరణం
charaNam 1
అత్త చూసిన నన్ను ఆగడి చేయును
ఆగడమేలరా అందగాడ కృష్ణా
atta chUsina nannu AgaDi chEyunu
AgaDamElarA andagADa kRshNA
చరణం
charaNam 2
కొసరి కొసరి నాతో సరసము లాడకు
రాజ మార్గమిదే కృష్ణా కృష్ణా
kosari kosari naatO sarasamu laaDaku
raaja mArgamidE kRshNA kRshNA
చరణం
charaNam 3
వ్రజ వనితలు నను చేర వత్తురిక
విడు విడు నా చేయి కృష్ణా కృష్ణా
vraja vanitalu nanu chEra vatturika
viDu viDu nA chEyi kRshNA kRshNA