| Title | చారుమతి | chArumati |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | చారుమతి యుపచారము లేటికే | chArumati yupachAramu lETikE |
| అనుపల్లవి anupallavi | మీరిన శోకము లేరీతి దీరు | mIrina SOkamu lErIti dIru |
| చరణం charaNam 1 | సరసుడు జూడని యాభరణము లేటికే మరచెనటవే కరుణాశాలి | sarasuDu jUDani yAbharaNamu lETikE marachenaTavE karuNASAli |
| చరణం charaNam 2 | వేగమే ప్రాణేశుడు రాగలడో జాగు జేయునో నాగ వేణిరో | vEgamE prANESuDu rAgalaDO jAgu jEyunO nAga vENirO |
| చరణం charaNam 3 | సుందరాంగుడిపు డెందు బోయెనో నా యందం బెవరు యిందు జూచేరు | sundarAnguDipu Dendu bOyenO nA yandam bevaru yindu jUchEru |
| AV Link | https://www.youtube.com/watch?v=APEhGtssujc |
#670 నన్ను విడనాడుట nannu viDanADuTa
| Title | నన్ను విడనాడుట | nannu viDanADuTa |
| Written By | వేంకట సుబ్బరాయర్ | vEnkaTa subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | నన్ను విడనాడుట న్యాయమా సామి | nannu viDanADuTa nyAyamA sAmi |
| అనుపల్లవి anupallavi | నా నేరమేమి నాతో బల్కుమి | nA nEramEmi nAtO balkumi |
| చరణం charaNam 1 | నిన్నే నమ్మితి చాల సేపని చాలా కనికరించ వేల గాసి జేయుట మేలా | ninnE nammiti chAla sEpani chAlA kanikarincha vEla gAsi jEyuTa mElA |
| చరణం charaNam 2 | భయము జూపేవు గదా పలుకరించవు వాదా ప్రియుడ దయ రాదా పెండ్లాడ లేద | bhayamu jUpEvu gadA palukarinchavu vAdA priyuDa daya rAdA penDlADa lEda |
| చరణం charaNam 3 | తల్లి తండ్రియు నీవే దైవము నీవే కల్ల గాదు వేంకట సుబ్బరాయేశ | talli tanDriyu nIvE daivamu nIvE kalla gAdu vEnkaTa subbarAyESa |
#669 ఓ మై లవ్లీ O mai lavlI
| Title | ఓ మై లవ్లీ | O mai lavlI |
| Written By | బెంగుళూరు చంద్రశేఖర శాస్త్రి | benguLUru chandraSEkhara SAstri |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖరహర ప్రియ | kharahara priya |
| తాళం tALa | ఆది | Adi |
| Previously posted at | 427 | |
| పల్లవి pallavi | ఓ మై లవ్లీ లలనా ఏలనే పొమ్మంటి | O my lovely lalanA ElanE pommanTi |
| అనుపల్లవి anupallavi | ఏమోయని యంటి కామినీ నిన్ను | EmOyani yanTi kAminI ninnu |
| చరణం charaNam 1 | కౌగలింపు వేళ కాంత వాడినది కపట మాటలని కనుగొంటిని | kaugalimpu vELa kAnta vADinadi kapaTa mATalani kanugonTini |
| చరణం charaNam 2 | ఇటువంటి స్టెప్ ఈస్ ఇట్ ఫిట్ టు టేక్ సిట్ ఎ వైల్ హియర్ లెట్ మి కన్విన్స్ యు | iTuvanTi step is it fit to take sit a while here let me convince you |
| చరణం charaNam 3 | ఎవరి వద్దను డోంట్ బి ఏంగ్రీ శివరాముని పదముల బాడు | evari vaddanu dont be angry SivarAmuni padamula bADu |
| AV Link | https://youtu.be/5VKdzICjE88?si=XQYGwaO1FJ6uEnEU |
#668 వెగటాయె గదే vegaTAye gadE
| Title | వెగటాయె గదే | vegaTAye gadE |
| Written By | బెంగుళూరు చంద్రశేఖర శాస్త్రి ?? | benguLUru chandraSEkhara SAstri ?? |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | చతురశ్ర ఏక | chaturaSra Eka |
| Previously Published At | 263 | |
| పల్లవి pallavi | వెగటాయె గదే చెలి వానికి | vegaTAye gadE cheli vAniki |
| అనుపల్లవి anupallavi | మగువ ఎవతె బోధించెనో తెలియదుగా | maguva evate bOdhinchenO teliyadugA |
| చరణం charaNam 1 | పాపపు మారుడు పూశరము కైనను బాయకనే నహి పాటిబడు ప్రియుడౌ మన మోహనాంగునికి | pApapu mAruDu pUSaramu kainanu bAyakanE nahi pATibaDu priyuDau mana mOhanAnguniki |
| చరణం charaNam 2 | బాల సుధాకరుడు చాన నీ మోమని వాలకయే నన్ను జూచుచును కలకాలము ద్రోసిన దొరకు | bAla sudhAkaruDu chAna nI mOmani vAlakayE nannu jUchuchunu kalakAlamu drOsina doraku |
#667 ఏ కామిని E kAmini
| Title | ఏ కామిని | E kAmini |
| Written By | బెంగుళూరు చంద్రశేఖర శాస్త్రి | benguLUru chandraSEkhara SAstri |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | నాటకురంజి | nATakuranji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏ కామిని బోధించెనో | E kAmini bOdhinchenO |
| అనుపల్లవి anupallavi | ఏమి తెలియని నా సామి కిపుడు | Emi teliyani nA sAmi kipuDu |
| చరణం charaNam 1 | పాటలాధరి యేపాటున నున్న నా మాట లెపుడు జవ దాటని వాని | pATalAdhari yEpATuna nunna nA mATa lepuDu java dATani vAni |
| చరణం charaNam 2 | తోయజ ముఖీ నిన్ బాయగలనా యని రేయి బగలు నెడ బాయని వాని | tOyaja mukhI nin bAyagalanA yani rEyi bagalu neDa bAyani vAni |
| చరణం charaNam 3 | ముందు నన్నేలి యానందము జెందిన సుందరుడౌ బాలచంద్ర నా సామి | mundu nannEli yAnandamu jendina sundaruDau bAlachandra nA sAmi |
#666 ఇటు సాహసములు iTu sAhasamulu
| Title | ఇటు సాహసములు | iTu sAhasamulu |
| Written By | స్వాతి తిరునాళ్ మహారాజా | svAti tirunAL mahArAjA |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సైంధవి | saindhavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇటు సాహసములు ఏల నాపై చక్కని సామి | iTu sAhasamulu Ela nApai chakkani sAmi |
| అనుపల్లవి anupallavi | ఇట్లు వగలు తాళ నా తరమా | iTlu vagalu tALa nA taramA |
| చరణం charaNam 1 | ఇక చిన్న దాన నేను మగవారిని ముఖము ఎరుగ నే యున్నాన వగ కాసారి నీకిది మేరగాదే వలపు న్యాయ మెరుగు నా సామి | ika chinna dAna nEnu magavArini mukhamu eruga nE yunnAna vaga kAsAri nIkidi mEragAdE valapu nyAya merugu nA sAmi |
| చరణం charaNam 2 | మనసు రంజితమయ్యే నీకు తగిన మగువతో ఈ వగలుంచ వలను వినవయ్యా నాపలుకులు ఈ వేళను వింతలు చాలు నా సామి | manasu ranjitamayyE nIku tagina maguvatO I vagaluncha valanu vinavayyA nApalukulu I vELanu vintalu chAlu nA sAmi |
| చరణం charaNam 3 | సరసిజ నేత్రుడ నీ కరుణ వల్ల చాల యవ్వనము వచ్చె నాడు మరుకేళి లోనే నిను లాలించుదును సరస పంకజ నాభ నా సామి | sarasija nEtruDa nI karuNa valla chAla yavvanamu vachche nADu marukELi lOnE ninu lAlinchudunu sarasa pankaja nAbha nA sAmi |
#665 పాయరాని pAyarAni
| Title | పాయరాని | pAyarAni |
| Written By | తిరుపతి విద్యల నారాయణస్వామి | tirupati vidyala nArAyaNasvAmi |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | పాయరాని బాళిచే భామ నంపిన రావు | pAyarAni bALichE bhAma nampina rAvu |
| అనుపల్లవి anupallavi | కాయజుని బారికి కరిగి చింత నొంది బిగి కౌగిట జేర్తువని ప్రీతి యేల తలప వలదే | kAyajuni bAriki karigi chinta nondi bigi kaugiTa jErtuvani prIti yEla talapa valadE |
| చరణం charaNam 1 | నాడే నిను కోరిన (చిన) చెలియ నెట్లు సైతురా ఎన్నడైన నీమాట కెదురాడి యుంటే సన్నుతాంగ తిరుపతి పుర నివాస వేంకటేశ | nADE ninu kOrina (china) cheliya neTlu saiturA ennaDaina nImATa kedurADi yunTE sannutAnga tirupati pura nivAsa vEnkaTESa |
| Audio Link | https://www.youtube.com/watch?v=XW-YowkKes0 (Some differences in lyrics) | |
| https://www.youtube.com/watch?v=a1bMqQMtTQA | ||
#664 వగలాడి vagalADi
| Title | వగలాడి | vagalADi |
| Written By | తిరుపతి విద్యల నారాయణస్వామి | tirupati vidyala nArAyaNasvAmi |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | వగలాడి బోధనలకు వలచితివో సామి – ఆ | vagalADi bOdhanalaku valachitivO sAmi – A |
| అనుపల్లవి anupallavi | పగటి మోసకత్తె యని పలుమారులు వినివిని ఆ | pagaTi mOsakatte yani palumArulu vinivini A |
| చరణం charaNam 1 | పడక టింటిలో పదుగురనే పదిల పరచి యుండే | paDaka TinTilO paduguranE padila parachi yunDE |
| చరణం charaNam 2 | సరసుని కా చాన పొందు విరస మౌనని యెంచి తిరుపతి పుర వేంకటేశ తెలియక నేడు | sarasuni kA chAna pondu virasa mounani yenchi tirupati pura vEnkaTESa teliyaka nEDu |
#663 కలగన్నటు kalagannaTu
| Title | కలగన్నటు | kalagannaTu |
| Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కేదార గౌళ | kEdAra gauLa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కల గన్నటు లాయరా కామజనక | kala gannaTu lAyarA kAmajanaka |
| అనుపల్లవి anupallavi | జల తీరమున నన్ను అలయించి వలపించి గులుకు గొప్పుననంటి పలుకరించు కొన్నది | jala tIramuna nannu alayinchi valapinchi guluku goppunananTi palukarinchu konnadi |
| చరణం charaNam 1 | జలజాక్షి వేసమిడి చెలులతో కూడికొని ఇలుజొచ్చి కలకంఠి వలె పలుకుల నుంచి కలవారలను పలు కలలచే మెప్పించి పలుమారు నను యేచి మనసు దోచిన దెల్ల | jalajAkshi vEsamiDi chelulatO kUDikoni ilujochchi kalakanThi vale palukula nunchi kalavAralanu palu kalalachE meppinchi palumAru nanu yEchi manasu dOchina della |
| చరణం charaNam 2 | నిను పాడమని చాల చనవున బల్కిన తన నాథుని యటు దాపున తొలగించి కనరాని వింతల కాలము గడిపించి నను పాడి పలుమారు మనసు దోచిన దెల్ల | ninu pADamani chAla chanavuna balkina tana nAthuni yaTu dApuna tolaginchi kanarAni vintala kAlamu gaDipinchi nanu pADi palumAru manasu dOchina della |
| చరణం charaNam 3 | వేదాంతమున గల నాదాత్మకుడైన జగ న్నాధ గోప కన్యా వినోద జగన్మోహన కాదా నన్నేలనిక వాదా శ్రీనివాసుడు కాదా జాగు సేయకు రాధా రమణ పొందు | vEdAntamuna gala nAdAtmakuDaina jaga nnAdha gOpa kanyA vinOda jaganmOhana kAdA nannElanika vAdA SrInivAsuDu kAdA jAgu sEyaku rAdhA ramaNa pondu |
#662 సరసము sarasamu
| Title | సరసము | sarasamu |
| Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | హిందుస్థానీ కాపీ | hindusthAnI kApI |
| తాళం tALa | దేశాది | dESAdi |
| పల్లవి pallavi | సరసము లాడేటందుకు సమయ మిది గాదురా నా సామి | sarasamu lADETanduku samaya midi gAdurA nA sAmi |
| అనుపల్లవి anupallavi | విరసముతో నా ఇంటి వారలున్నారు విధి తప్పక కనుగొన్న గూడిన వేళ నాతో | virasamutO nA inTi vAralunnAru vidhi tappaka kanugonna gUDina vELa nAtO |
| చరణం charaNam 1 | నిగ నిగ వెన్నెల గాయుచున్నది నిక్కముగా ఇటుల జేసేది నీకు తగదురా ఈ వీధిలో వచ్చువారు న్నట్టున్నది నిను చూస్తే నవ్వి తిట్టుదురు గనుక | niga niga vennela gAyuchunnadi nikkamugA iTula jEsEdi nIku tagadurA I vIdhilO vachchuvAru nnaTTunnadi ninu chUstE navvi tiTTuduru ganuka |
| చరణం charaNam 2 | ఏకాంతముగా జరిగిన సంగతి ఎంతైన బైట పడేది న్యాయమా శ్రీకాంత నీకేల ఇంత దూరము శ్రీనివాసార్చిత బావి నీళ్ళు వెల్లి గొన్నదిరా | EkAntamugA jarigina sangati entaina baiTa paDEdi nyAyamA SrIkAnta nIkEla inta dUramu SrInivAsArchita bAvi nILLu velli gonnadirA |
| AV Link | https://www.youtube.com/watch?v=96T0dEEYTMI |