| Title | ఏమి మాయము | Emi mAyamu |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఏమి మాయము జేసి పోతివి శ్యామ సుందరాంగ నాతో | Emi mAyamu jEsi pOtivi SyAma sundarAnga nAtO |
| అనుపల్లవి anupallavi | నా మనో భావంబులెల్ల వేమారు నే వెరిగియు నాయెడ | nA manO bhAvambulella vEmAru nE verigiyu nAyeDa |
| చరణం charaNam 1 | నీరు దాగిపుడే పారి వచ్చేనని తీరుగ తీరున జోరుగ బల్కేవే సారి నోరూరగ దారి జూచెటటు క్రూర వేరె మీరిపోయె కొన | nIru dAgipuDE pAri vachchEnani tIruga tIruna jOruga balkEvE sAri nOrUraga dAri jUcheTaTu krUra vEre mIripOye kona |
| చరణం charaNam 2 | మంగళ స్నానము రంగుగ జేసే ఉప్పొంగుచు నీ మృదు అంగ సంగముతో కౌగలించేనని వంగి వంగి శ్రీ మంగళాంగుడౌ తాళవనేశుని | mangaLa snAnamu ranguga jEsE upponguchu nI mRdu anga sangamamutO kaugalinchEnani vangi vangi SrI mangaLAnguDau tALavanESuni |
#650 ఏమి సేయుదు Emi sEyudu
| Title | ఏమి సేయుదు | Emi sEyudu |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమి సేయుదునటే ఏణాక్షి | Emi sEyudunaTE ENAkshi |
| అనుపల్లవి anupallavi | నోము ఫలమేమొ నాసామి కేసతి నానామ మంటే కాకనే మేమన్నదో గాన | nOmu phalamEmo nAsAmi kEsati nAnAma manTE kAkanE mEmannadO gAna |
| చరణం charaNam 1 | సరసుడు నన్నే సదా సరసమాడే సైకల సారసాక్షి విని దూరనేమో గాన | sarasuDu nannE sadA sarasamADE saikala sArasAkshi vini dUranEmO gAna |
| చరణం charaNam 2 | మేడపై మేమిర్వురు జోడు గూడే కడు వేడుకెల్ల నాచేడె చెరిచెనే | mEDapai mEmirvuru jODu gUDE kaDu vEDukella nAchEDe cherichenE |
| చరణం charaNam 3 | మొలక నవ్వుతోను మై పులకరించేలిన తాళవనీశుని చాలించెనే సవతి | molaka navvutOnu mai pulakarinchElina tALavanISuni chAlinchenE savati |
15 May 2021: Minor correction
#649 రారా నమ్మినారా rArA namminArA
| Title | రారా నమ్మినారా | rArA namminArA |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | రారా నమ్మినారా నా చై కోరాదటరా సామిగ | rArA namminArA nA chai kOrAdaTarA sAmiga |
| అనుపల్లవి anupallavi | సారెకు నేనీ రాక నే గోరుచు వేసారి తిటు | sAreku nEnI rAka nE gOruchu vEsAri tiTu |
| చరణం charaNam 1 | నీరజ వైరి తన క్రూర కిరణాలతో బీరుచు నాపై వెన్నెల బోరున గాచెరా ప్రియ | nIraja vairi tana krUra kiraNAlatO bIruchu nApai vennela bOruna gAcherA priya |
| చరణం charaNam 2 | సామి నేనీ తీరున కామియై యుండ పెను పామువలె కాముండిటు వేమారు శరముల్వేసె | sAmi nEnI tIruna kAmiyai yunDa penu pAmuvale kAmunDiTu vEmAru SaramulvEse |
| చరణం charaNam 3 | బాల నే తాళనురా తాలవనేశ మరుకేళి సుఖ లీలలో నన్నేలి రతి తేలించుమీ | bAla nE tALanurA tAlavanESa marukELi sukha lIlalO nannEli rati tElinchumI |
#648 కోపమెటుల kOpameTula
| Title | కోపమెటుల | kOpameTula |
| Written By | పట్టాభిరామయ్య?? | paTTAbhirAmayya?? |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 253 | |
| పల్లవి pallavi | కోపమెటుల రాక యుండునురా కోమలాంగ నీపై | kOpameTula rAka yunDunurA kOmalAnga nIpai |
| అనుపల్లవి anupallavi | పాపి యింటనే కాపురమై నీ రూపము కంటికి జూపక యుండిన | pApi yinTanE kApuramai nI rUpamu kanTiki jUpaka yunDina |
| చరణం charaNam 1 | నిన్నటి రాత్రి నిన్నిటు రమ్మని విన్నప మిచ్చి మా కన్యను బంపితే చిన్ననాటి నా నేస్తము నెంచకా చిన్నది మెచ్చన నన్న మాటలు విన | ninnaTi rAtri ninniTu rammani vinnapa michchi mA kanyanu bampitE chinnanATi nA nEstamu nenchakA chinnadi mechchana nanna mATalu vina |
| చరణం charaNam 2 | కాసుకు కాని యా దాసితోను పరిహాస మాడుచు నుల్లాసమై పయ్యెద దీసి తిన్నగ మూసి ముద్దిడు నీ సరసంబులు మోసము నేలిన | kAsuku kAni yA dAsitOnu parihAsa mADuchu nullAsamai payyeda dIsi tinnaga mUsi muddiDu nI sarasambulu mOsamu nElina |
| చరణం charaNam 3 | వేమరు వేడిన నీ మనసంత యా రామపాల్ జేసి విరాముడై వేడ్కతో కాముకేళి యా లేమ గూడిన చామ భూపాల నే నీ మమతలు విన | vEmaru vEDina nI manasanta yA rAmapAl jEsi virAmuDai vEDkatO kAmukELi yA lEma gUDina chAma bhUpAla nE nI mamatalu vina |
| Audio Link | https://www.youtube.com/watch?v=YVryeUtO9R8 |
#647 నన్ను చులకన nannu chulakana
| Title | నన్ను చులకన | nannu chulakana |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | వసంత | vasanta |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | నన్ను చులకన జేసె వినవే నా సామి | nannu chulakana jEse vinavE nA sAmi |
| అనుపల్లవి anupallavi | వెనుకటి నెనరుల తనమది నునుచగ | venukaTi nenarula tanamadi nunuchaga |
| చరణం charaNam 1 | అను దినమును సరి వనిత లెదుట పెను కనికరము జూపి శ్లాఘన సలిపిన దొర | anu dinamunu sari vanita leduTa penu kanikaramu jUpi SlAghana salipina dora |
| చరణం charaNam 2 | పరిపరి విధముల సరస మాడక నాతో అర నిమిష ముండని సరసుడే దూరోవిని | paripari vidhamula sarasa mADaka nAtO ara nimisha munDani sarasuDE dUrOvini |
| చరణం charaNam 3 | పలుకు పలుకును మొలక నవ్వు నవ్వి మై పులకరింప జేసేలు అల తాలవనేశుడు | paluku palukunu molaka navvu navvi mai pulakarimpa jEsElu ala tAlavanESuDu |
#646 నీ లాలన nI lAlana
| Title | నీ లాలన | nI lAlana |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | థన్యాసి | thanyAsi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | నీ లాలన చాలు నిల్పరా శ్రీ తాలవాధిప | nI lAlana chAlu nilparA SrI tAlavAdhipa |
| అనుపల్లవి anupallavi | చాల వేడి నా యిరు కాళ్ళకు మ్రొక్కుచు బల్కెడి | chAla vEDi nA yiru kALLaku mrokkuchu balkeDi |
| చరణం charaNam 1 | నిన్న రేతిరాడిన మాటలు మనసార నే వినియుండగా మానిని నీ కనులాన నిన్నేమన లేదను | ninna rEtirADina mATalu manasAra nE viniyunDagA mAnini nI kanulAna ninnEmana lEdanu |
| చరణం charaNam 2 | కుటిలాత్మ నీవటు మార్గ కాపటికుడని నేనటు పోవగా వెంట వచ్చి కంటి కట్టు విప్పి చనులంటెడి | kuTilAtma nIvaTu mArga kApaTikuDani nEnaTu pOvagA venTa vachchi kanTi kaTTu vippi chanulanTeDi |
| చరణం charaNam 3 | మితిలేక నే నతియాసతో రతికేళికి బతిమాలగా నాతి రావేయని చేతులీడ్చి నను బిలిచేటి | mitilEka nE natiyAsatO ratikELiki batimAlagA nAti rAvEyani chEtulIDchi nanu bilichETi |
#645 ఈలాగున IlAguna
| Title | ఈలాగున | IlAguna |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | దర్బార్ | darbAr |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఈలాగున నుండవచ్చునా ఓ నీలవేణి తాళవన లోలుని వ్యాకుల మెల్ల తెలిసి నీవిపు (డీలాగున) | IlAguna nunDavachchunA O nIlavENi tALavana lOluni vyAkula mella telisi nIvipu (DIlAguna) |
| చరణం charaNam 1 | అంగనామణి నీదు భృంగ కుంతలములు కని నీ అంగ సంగ మెటు గల్గునని కుంగుచుండు నా ఇంగితం బెరింగి నన్ను కౌంగలించి నాదు తనువు ఉప్పొంగ మాటలాడి పెద్ద పంగ నామముడను దలచి | anganAmaNi nIdu bhRnga kuntalamulu kani nI anga sanga meTu galgunani kunguchunDu nA ingitam beringi nannu kaungalinchi nAdu tanuvu upponga mATalADi pedda panga nAmamuDanu dalachi |
| చరణం charaNam 2 | కీరవాణి నాకై ఇంటి దూరమనుచు పేరిడి గాన కుండునటు లేమార జేయుచు చేరి నాదు శయ్యపై వెయ్యారు వగచి వెరువకనుచు ధీరతరముతో వేమారు మూరవేసి ముదము చెరచి | kIravANi nAkai inTi dUramanuchu pEriDi gAna kunDunaTu lEmAra jEyuchu chEri nAdu Sayyapai veyyAru vagachi veruvakanuchu dhIrataramutO vEmAru mUravEsi mudamu cherachi |
#644 కొమ్మరో వాని kommarO vAni
| Title | కొమ్మరో వాని | kommarO vAni |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కొమ్మరో వాని కెంత బిగువే పిలచిన పలుక కున్నాడేమి సేయుదునే | kommarO vAni kenta biguvE pilachina paluka kunnADEmi sEyudunE |
| చరణం charaNam 1 | అంతరంగున కెదురేగి తెచ్చి వానికి ఆకుమడు పొసగితే హుం పొమ్మనెనే | antaranguna kedurEgi techchi vAniki AkumaDu posagitE hum pommanenE |
| చరణం charaNam 2 | పదయుడ కెదనానుచు పోట్లాడితే తిరిగి తిరిగి జూచుచు హుం పొమ్మనెనే | padayuDa kedanAnuchu pOTlADitE tirigi tirigi jUchuchu hum pommanenE |
| చరణం charaNam 3 | ధర్మపురీశునితో నే సమరసి తీర్చితే నపుడు వాడు హుం పొమ్మనెనే | dharmapurISunitO nE samarasi tIrchitE napuDu vADu hum pommanenE |
#643 పరులన్న మాట parulanna mATa
| Title | పరులన్న మాట | parulanna mATa |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | పరులన్న మాట నమ్మవద్దు ప్రాణ నాయకా | parulanna mATa nammavaddu prANa nAyakA |
| అనుపల్లవి anupallavi | మోము జూప మ్రొక్కితే మర్మమేమిరా మాయలాడి బోధనము బాగ జేసెరా | mOmu jUpa mrokkitE marmamEmirA mAyalADi bOdhanamu bAga jEserA |
| చరణం charaNam 1 | మందయాన ఎవతె నీకు మందు బెట్టెరా ముందు దెల్పు మిపుడు మోవి విందు బెట్టరా | mandayAna evate nIku mandu beTTerA mundu delpu mipuDu mOvi vindu beTTarA |
| చరణం charaNam 2 | ధర్మపురిని స్థిరముగ నెలకొన్న సామిగా ధర్మమున నేలుకోరా నిన్ను మ్రొక్కేరా | dharmapurini sthiramuga nelakonna sAmigA dharmamuna nElukOrA ninnu mrokkErA |
| AV Link | https://www.youtube.com/watch?v=0nU_PkGb_jM |
#642 ఏమందునే EmandunE
| Title | ఏమందునే | EmandunE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమందునే ముద్దు బాలామణి చెలి ఏమని విన్నవింతునే ఓ చెలి | EmandunE muddu bAlAmaNi cheli Emani vinnavintunE O cheli |
| అనుపల్లవి anupallavi | చెలియ పల్కులు చెలువునకు దెల్పితినే చెలియ మైమరచితినే | cheliya palkulu cheluvunaku delpitinE cheliya maimarachitinE |
| చరణం charaNam 1 | మును నను గలసి మర్మము లెరిగిన శ్రీ ధర్మపురీశు డున్నాడే ఓ చెలి | munu nanu galasi marmamu lerigina SrI dharmapurISu DunnADE O cheli |