| Title | వాని పొందు | vAni pondu |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ ? | dharmapuri subbarAyar ? |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| Previously Posted At | 265 ? | |
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | వాని పొందు చాలు వద్దనే వనితామణి అల | vAni pondu chAlu vaddanE vanitAmaNi ala |
| అనుపల్లవి anupallavi | చానమాటలేల దాని సదనమే సతమనుచు నుండెడి | chAnamATalEla dAni sadanamE satamanuchu nunDeDi |
| చరణం charaNam 1 | కమ్మవిల్తు డేయు అమ్ముల పోటున రొమ్మున నాటిన కమ్మ వ్రాసిచ్చిన కొమ్మ నంపి వేగతోడి తెమ్మని నే దాని పొమ్మని బల్కిన | kammaviltu DEyu ammula pOTuna rommuna nATina kamma vrAsichchina komma nampi vEgatODi temmani nE dAni pommani balkina |
| AV Link | https://www.youtube.com/watch?v=H8YreNmzwRs |
#640 స్మర సుందరాంగుని smara sundarAnguni
| Title | స్మర సుందరాంగుని | smara sundarAnguni |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| Previously Posted at | 583 | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | స్మర సుందరాంగుని సరి యెవ్వరే సరస కోటిలోన వజీరుహమీరె | smara sundarAnguni sari yevvarE sarasa kOTilOna vajIruhamIre |
| చరణం charaNam 1 | ఆడిన మాటకు అడ్డము బలుకడే ఏ చేడియలను కనుల జూడడే | ADina mATaku aDDamu balukaDE E chEDiyalanu kanula jUDaDE |
| చరణం charaNam 2 | వీనుల కింపుగ వీణ వాయించి అలి వేణి నే పాడగ శాభాషిచ్చునే | vInula kimpuga vINa vAyinchi ali vENi nE pADaga SAbhAshichchunE |
| చరణం charaNam 3 | ధరణిలో రతిదేల్చు ఉదార శ్రీ ధర్మపురాధిపు డైనట్టి మా | dharaNilO ratidElchu udAra SrI dharmapurAdhipu DainaTTi mA |
#639 నారీమణి nArImaNi
| Title | నారీమణి | nArImaNi |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | నారీమణి నీకైనదిరా జారచోర – మా | nArImaNi nIkainadirA jArachOra – mA |
| అనుపల్లవి anupallavi | ధీర వినరా శ్రీ ధర్మపురాధిప మా చక్కని | dhIra vinarA SrI dharmapurAdhipa mA chakkani |
| చరణం charaNam 1 | బోటి నేర్పిన రతి పాటలు సైయాటలేవ ధూటియ సరిసాటిల పాటియన కాదట మా | bOTi nErpina rati pATalu saiyATalEva dhUTiya sarisATila pATiyana kAdaTa mA |
| చరణం charaNam 2 | మారు బల్కెరు గని మానిని గదరా కామినీ తారాధిప నీ బావ కాదనరె సరసకు | mAru balkeru gani mAnini gadarA kAminI tArAdhipa nI bAva kAdanare sarasaku |
| చరణం charaNam 3 | మారవీరుని విరి శరముల కోర్వదిక రారా సరగునను చేకోరా మరుకేళికి – మా | mAravIruni viri Saramula kOrvadika rArA saragunanu chEkOrA marukELiki – mA |
| AV Link | https://www.youtube.com/watch?v=7WSxRQ3D-Bw |
#638 మరుబారి marubAri
| Title | మరుబారి | marubAri |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మరుబారి తాళలేనురా ఔరా నాసామి | marubAri tALalEnurA aurA nAsAmi |
| చరణం charaNam 1 | మరుని బారికి నెంతని తాళుదురా నే జార శిఖామణి రారా | maruni bAriki nentani tALudurA nE jAra SikhAmaNi rArA |
| చరణం charaNam 2 | చెంత రమ్మని నేనెంతని వేడుదురా నే పంతము సేయకు రారా | chenta rammani nEnentani vEDudurA nE pantamu sEyaku rArA |
#637 అది నీపై adi nIpai
| Title | అది నీపై | adi nIpai |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | యమునా కల్యాణి (యమన్) | yamunA kalyANi (yaman) |
| తాళం tALa | దేశాది | dESAdi |
| పల్లవి pallavi | అది నీపై మరులు కొన్నదిరా | adi nIpai marulu konnadirA |
| చరణం charaNam 1 | రామ రఘురామ అభిరామ రామ రామ నీ సమమును కానకలేరా | rAma raghurAma abhirAma rAma rAma nI samamunu kAnakalErA |
| చరణం charaNam 2 | దాతలలో నెఱదాతవౌ శ్రీ ధర్మపురీశ తామస మేలనురా | dAtalalO ne~radAtavau SrI dharmapurISa tAmasa mElanurA |
#636 ఇది నీకు idi nIku
| Title | ఇది నీకు | idi nIku |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| Previously Posted At | 565 | |
| రాగం rAga | బేగడ | bEgaDa |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఇది నీకు మరియాదగా ఏరా నా సామి | idi nIku mariyAdagA ErA nA sAmi |
| అనుపల్లవి anupallavi | ఇది నీకు మరియాదగా దానింటికి పోయి అలసి సొలసి గూడి ఇందు రావైతి వయ్యో | idi nIku mariyAdagA dAninTiki pOyi alasi solasi gUDi indu rAvaiti vayyO |
| చరణం charaNam 1 | పట్టె మంచము బిగి పట్టించి నా పడ కింట పవ్వళించమని వేడితే నాతో సద్దు సేయక మువ్వ సుదతి యింటికి పోయి వట్టి నేలలో పవ్వళించితి వయ్యో | paTTe manchamu bigi paTTinchi nA paDa kinTa pavvaLinchamani vEDitE nAtO saddu sEyaka muvva sudati yinTiki pOyi vaTTi nElalO pavvaLinchiti vayyO |
#635 ప్రాణ సఖుడిటు prANa sakhuDiTu
| Title | ప్రాణ సఖుడిటు | prANa sakhuDiTu |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సెంజురుటి | senjuruTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ప్రాణ సఖుడిటు జేసెనే సఖి | prANa sakhuDiTu jEsenE sakhi |
| చరణం charaNam 1 | ఇదిగొ వచ్చెదనని ఇతవులాడి అల దానిల్లటు జేరెనే సఖి | idigo vachchedanani itavulADi ala dAnillaTu jErenE sakhi |
| చరణం charaNam 2 | నన విలుతుని కేళికి బిలిచితే వాడు అనరాని మాట్లాడెనే (సఖి) | nana vilutuni kELiki bilichitE vADu anarAni mATlADenE (sakhi) |
| చరణం charaNam 3 | మును నను కలసి మర్మము లెరిగిన ధర్మపురి వాసుడు నన్ను మరచెనే (సఖి) | munu nanu kalasi marmamu lerigina dharmapuri vAsuDu nannu marachenE (sakhi) |
| Audio Link | https://www.youtube.com/watch?v=gyKjHyfOMfY |
#634 ఏరా తగునటరా ErA tagunaTarA
| Title | ఏరా తగునటరా | ErA tagunaTarA |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏరా తగునటరా – సరిగాదురా | ErA tagunaTarA – sarigAdurA |
| అనుపల్లవి anupallavi | రారాపు సేయకురా – రాజ గంభీర | rArApu sEyakurA – rAja gambhIra |
| చరణం charaNam 1 | పర సతులతో పరిహాసము లాడుచు మరి మరి నొప్పించెదవు ఎట్ల సైతురా | para satulatO parihAsamu lADuchu mari mari noppinchedavu eTla saiturA |
| చరణం charaNam 2 | వర ధర్మపురమున స్థిరముగ నెలకొన్న వరదుడ మారుకేళిలో నన్ను గూడరా | vara dharmapuramuna sthiramuga nelakonna varaduDa mArukELilO nannu gUDarA |
#633 వారేమి జేసెదరే vArEmi jEsedarE
| Title | వారేమి జేసెదరే | vArEmi jEsedarE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Published At | 568 | |
| పల్లవి pallavi | వారేమి జేసెదరే – ఊరి వారేమి జేసెదరే – ప్రియుడు | vArEmi jEsedarE – Uri vArEmi jEsedarE – priyuDu |
| అనుపల్లవి anupallavi | జార చోరుడనే పేరైతే జార చోరుడనే పేరైతే ఊరి | jAra chOruDanE pEraitE jAra chOruDanE pEraitE Uri |
| చరణం charaNam 1 | ఇంతిరో నీవిపుడు – ఆడ వేసమై కుల కాంతల నేచితే – ఎట్లోర్తురే – ఊరి | intirO nIvipuDu – ADa vEsamai kula kAntala nEchitE – eTlOrturE – Uri |
| చరణం charaNam 2 | నీరజ ముఖి వాడా రమణి మగని తీరున పోయేడు – నేరము లాడితే – ఊరి | nIraja mukhi vADA ramaNi magani tIruna pOyEDu – nEramu lADitE – Uri |
| చరణం charaNam 3 | శ్రీకరుడగు శ్రీ ధర్మపురీశుడు లోకాపకీర్తికి – లోనైతే ఈ ఊరి | SrIkaruDagu SrI dharmapurISuDu lOkApakIrtiki – lOnaitE I Uri |
#632 ఎంతటి కులుకే entaTi kulukE
| Title | ఎంతటి కులుకే | entaTi kulukE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఎంతటి కులుకే? ఇంతిరో కాంతుని కిపు(డెంతటి) | entaTi kulukE? intirO kAntuni kipu(DentaTi) |
| అనుపల్లవి anupallavi | పంతము గల పరాంభోజముఖిని పెనగి నందున (కెంతటి) | pantamu gala parAmbhOjamukhini penagi nanduna (kentaTi) |
| చరణం charaNam 1 | హొయలు మీరి వీధిలోన బయలుదేరి నన్ను జూచి భయము లేక పాట పాడి కను సైగ జేయునే | hoyalu mIri vIdhilOna bayaludEri nannu jUchi bhayamu lEka pATa pADi kanu saiga jEyunE |
| చరణం charaNam 2 | వరకు లేక నిన్న రేయి ధరపురీశుడైన సామి మరుని కేళిలోను గూడి మాటలాడ డేమిది | varaku lEka ninna rEyi dharapurISuDaina sAmi maruni kELilOnu gUDi mATalADa DEmidi |
| AV Link | https://www.youtube.com/watch?v=cD6p4HedIjk |