| Title | రారా సుకుమార | rArA sukumAra |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| Previously Published at | 413 | |
| పల్లవి pallavi | రారా సుకుమార ధీర రాజాధి రాజ లేరా పరిమళ మిదే గంధ మిదే పట్టి పూసేది రారా | rArA sukumAra dhIra rAjAdhi rAja lErA parimaLa midE gandha midE paTTi pUsEdi rArA |
| చరణం charaNam 1 | లేదా నాపై ప్రేమా రాదా నాపై దయ సరసుడ లేచి రారా సమయ మిదే రారా | lEdA nApai prEmA rAdA nApai daya sarasuDa lEchi rArA samaya midE rArA |
| చరణం charaNam 2 | వన్నెకాడ నిన్నె చాల నమ్మి యుంటీర మరీ సుందరాకారా నిన్నే చాలగ నమ్మితిరా | vannekADa ninne chAla nammi yunTIra marI sundarAkArA ninnE chAlaga nammitirA |
| చరణం charaNam 3 | మల్లె పూల హారములు మెడ నిండ వేసెదరా జాస్మిన్ సెంటు యిదే జేటా జేటా జల్లెదరా | malle pUla hAramulu meDa ninDa vEsedarA jAsmin senTu yidE jETA jETA jalledarA |
| చరణం charaNam 4 | పగ దానిగ నను పాటింపకు రావేమిరా సరసుడా రావేమిరా మోహనాకారా మోహమాయెరా మోహనాంగా నిను నమ్మితి గదరా మోహమాపా జాలను రావేమిరా | paga dAniga nanu pATimpaku rAvEmirA sarasuDA rAvEmirA mOhanAkArA mOhamAyerA mOhanAngA ninu nammiti gadarA mOhamApA jAlanu rAvEmirA |
| చరణం charaNam 5 | విరు శరములు నాపై విపరీత మాయే మరులు కొంటిరా మోహనాకారా మరు కొల్పునకు సమయ మిదేరా రావేమిరా | viru Saramulu nApai viparIta mAyE marulu konTirA mOhanAkArA maru kolpunaku samaya midErA rAvEmirA |
#571 ముందటివలె mundaTivale
| Title | ముందటివలె | mundaTivale |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | ముందటి వలె నాపై నెనరున్నదా సామి ముచ్చటలిక ఏలరా | mundaTi vale nApai nenarunnadA sAmi muchchaTalika ElarA |
| అనుపల్లవి anupallavi | ఎందుకీ మొగ మిచ్చకపు మాట లాడేవు యిది మేర గాదురా ఏరా నా సామి | endukI moga michchakapu mATa lADEvu yidi mEra gAdurA ErA nA sAmi |
| చరణం charaNam 1 | పిలువ నంపిన రావు పిలచిన గైకొనవు పలుమారు వేడిన పలుకవు వలపు నిలుప లేక చెలువు డనుచు నిన్ను తలచి తలచి చాల తల్లడిల్లుటే కొని | piluva nampina rAvu pilachina gaikonavu palumAru vEDina palukavu valapu nilupa lEka cheluvu Danuchu ninnu talachi talachi chAla tallaDilluTE koni |
| చరణం charaNam 2 | చిన్న నాటి నుండి చేరిన దెంచక నన్ను చౌక చేసేది న్యాయమా వన్నెకాడ నీదు వంచన లెరుగక నిన్నన బని లేదు నే జేయు పూజకు | chinna nATi nunDi chErina denchaka nannu chauka chEsEdi nyAyamA vannekADa nIdu vanchana lerugaka ninnana bani lEdu nE jEyu pUjaku |
| చరణం charaNam 3 | కలువల రేడంచు కంచి వరదా నిన్ను లలనా యింత దూరము రానిచ్చేనా అలరు విల్తుని కేళిని నలుము కొనుచు నన్ను కలసిన పాపాన కాకన్నుల జూడ వచ్చితి ఓ | kaluvala rEDanchu kanchi varadA ninnu lalanA yinta dUramu rAnichchEnA alaru viltuni kELini nalumu konuchu nannu kalasina pApAna kAkannula jUDa vachchiti O |
| చరణం charaNam 4 | కన్యను గద నేను కన్నెత్తి చూడవేరా వన్నెకాడ లేచి రారా వగలు చెందకురా | kanyanu gada nEnu kannetti chUDavErA vannekADa lEchi rArA vagalu chendakurA |
#570 చాలులేరా chAlulErA
| Title | చాలులేరా | chAlulErA |
| Written By | పట్టాభిరామయ్య? | paTTAbhirAmayya? |
| Book | ||
| రాగం rAga | బేగడ | bEgaDa |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | చాలులేరా నీ నేస్తము తాళవన లోలా నీదు పరిహాసము | chAlulErA nI nEstamu tALavana lOlA nIdu parihAsamu |
| చరణం charaNam 1 | ధీర నీవు ఆలకించితి యని క్షీరము నా హారమునే మనసార నీకు జేరనీవు నొల్లక పారద్రోసి దురీ జోరు తోనే పోతివి | dhIra nIvu Alakinchiti yani kshIramu nA hAramunE manasAra nIku jEranIvu nollaka pAradrOsi durI jOru tOnE pOtivi |
| చరణం charaNam 2 | ఎవ్వరైను రేపు మాపు కోపమెల్ల బాపెరా ప్రియా పరితాప మెల్ల బాసి నన్ను గూడిన దాపు జేర తాపమార తాపమార్చుకకనే పోతివి | evvarainu rEpu mApu kOpamella bAperA priyA paritApa mella bAsi nannu gUDina dApu jEra tApamAra tApamArchukakanE pOtivi |
#569 ఏమందునే చెలియా EmandunE cheliyA
| Title | ఏమందునే చెలియా | EmandunE cheliyA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | ఏమందునే చెలియా నా సామి నా మీద ఏమో అలకాయెనిక | EmandunE cheliyA nA sAmi nA mIda EmO alakAyenika |
| చరణం charaNam 1 | ఏ మాయలాడి వాని కే మందు బెట్టెనో దిట్టముగా నాదు పట్టు పాన్పు చేరి పట్టి పిలిచితే నన్ను ముట్టవద్దనే యిక | E mAyalADi vAni kE mandu beTTenO diTTamugA nAdu paTTu pAn&pu chEri paTTi pilichitE nannu muTTavaddanE yika |
| చరణం charaNam 2 | ప్రీతితో బాలచంద్ర నాతోను కూడితే ఆ నాతి బోధనచే ప్రీతి తప్పెను ఇక | prItitO bAlachandra nAtOnu kUDitE A nAti bOdhanachE prIti tappenu ika |
#568 వారేమి చేసెదరే vArEmi chEsedarE
| Title | వారేమి చేసెదరే | vArEmi chEsedarE |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | వారేమి చేసెదరే ప్రియుడు జార చోరుడనే వేరైతే | vArEmi chEsedarE priyuDu jAra chOruDanE vEraitE |
| చరణం charaNam 1 | ఊరివారు యింతిరో భిగుడాడ వేసమై కులకాంతల నేచితే ఎట్లోర్తురే | UrivAru yintirO bhiguDADa vEsamai kulakAntala nEchitE eTlOrturE |
| చరణం charaNam 2 | నీరజముఖి వాడా రమణి మగని తీరున పోయుట తానే పైకొంటే | nIrajamukhi vADA ramaNi magani tIruna pOyuTa tAnE paikonTE |
| చరణం charaNam 3 | శ్రీకరుడగు శ్రీ ధర్మ పురీశుడు లోకాప కీర్తికి లోనైతే ఈ వూరివారేమి చేసెదరే | SrIkaruDagu SrI dharma purISuDu lOkApa kIrtiki lOnaitE I vUrivArEmi chEsedarE |
#567 చెలువుడ నీవు cheluvuDa nIvu
| Title | చెలువుడ నీవు | cheluvuDa nIvu |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| రాగం rAga | ఖమాసు | khamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చెలువుడ నీవు అటునిటు నిలుంటక నన్ను నలుగురిలో నన్ను బలిమి సేయ వద్దురా | cheluvuDa nIvu aTuniTu nilunTaka nannu nalugurilO nannu balimi sEya vaddurA |
| చరణం charaNam 1 | అంతరంగము వలె సొంతముగా పంతము చేసెద వింత నేనెరుగనా | antarangamu vale sontamugA pantamu chEseda vinta nEneruganA |
| చరణం charaNam 2 | పడక ఇంటికి వచ్చి పయ్యెద చేకొని పుక్కిటి విడమిచ్చితే వెర్రిదాననా | paDaka inTiki vachchi payyeda chEkoni pukkiTi viDamichchitE verridAnanA |
| చరణం charaNam 3 | ధర్మపురీశ మగవారల మర్మము సారసారెకొక తీరు నేనెరుగనా | dharmapurISa magavArala marmamu sArasArekoka tIru nEneruganA |
#566 నిన్ను నమ్మినార ninnu namminAra
| Title | నిన్ను నమ్మినార | ninnu namminAra |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 403 | |
| పల్లవి pallavi | నిన్ను నమ్మినార నీరజ నయన నన్ను విడనాడ న్యాయమా నా సామి | ninnu namminAra nIraja nayana nannu viDanADa nyAyamA nA sAmi |
| కమ్మనీ మోవిచ్చి కౌగిలియ్యవేరా నమ్మిన దానరా నా సామి ఈ వేళ | kammanI mOvichchi kaugiliyyavErA nammina dAnarA nA sAmi I vELa | |
| ఎంత వేడినను పంతమా నా పైని సంతతంబు నిన్నే చింతించు చున్నారా | enta vEDinanu pantamA nA paini santatambu ninnE chintinchu chunnArA | |
| మరుని బారికి నోర్వజాల మర్మమెల్ల దెలిసె శ్రీ ధర్మపురి నివాస | maruni bAriki nOrvajAla marmamella delise SrI dharmapuri nivAsa | |
#565 ఇది నీకు మరియాదగా idi nIku mariyAdagA
| Title | ఇది నీకు మరియాదగా | idi nIku mariyAdagA |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఇది నీకు మరియాదగా ఏరా నా సామి ఇది నీకు మరియాదగా దానింటికి పోయి అలసి సొలసి గూడి యిందున రావైతివి అయ్యయ్యో | idi nIku mariyAdagA ErA nA sAmi idi nIku mariyAdagA dAninTiki pOyi alasi solasi gUDi yinduna rAvaitivi ayyayyO |
| 1 | పట్టి మంచము బిగి పట్టించి నా పడకింట పవళించమని వేడితే నన్ను చట్ట చేయక నందు ఆ సవతి గుడిసె కేగి పట్టిలో పవళించితివి అయ్యయ్యో | paTTi manchamu bigi paTTinchi nA paDakinTa pavaLinchamani vEDitE nannu chaTTa chEyaka nandu A savati guDise kEgi paTTilO pavaLinchitivi ayyayyO |
| 2 | గుత్తపు గుబ్బల గదియు కౌగిలించుచు వద్దికగా ముద్దియ్య వేడితే దిద్ది పోలిన పాత చిలికిన పాలించు కొత్తు నిపుడు కౌగలించ వైతి వయ్యయ్యో | guttapu gubbala gadiyu kaugilinchuchu vaddikagA muddiyya vEDitE diddi pOlina pAta chilikina pAlinchu kottu nipuDu kaugalincha vaiti vayyayyO |
| 3 | ధరను వెలయు ధర్మపురి వేణుగోపాలా మరుకేలిత మై మరువ గూడమని వేడ సారె సారెకు నాతో చలము చేయుచు చాల పర నారీ మణుల పొందను పో అయ్యయ్యో | dharanu velayu dharmapuri vENugOpAlA marukElita mai maruva gUDamani vEDa sAre sAreku nAtO chalamu chEyuchu chAla para nArI maNula pondanu pO ayyayyO |
#564 చాలు నిలుపంతట chAlu nilupantaTa
| Title | చాలు నిలుపంతట | chAlu nilupantaTa |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | చాలు నిలుపంతట నట్టి ఉపచారము లెందుకురా నిన్న రేయి చిన్న దానింటను నన్ను జూచి నవ్వినారటరా | chAlu nilupantaTa naTTi upachAramu lendukurA ninna rEyi chinna dAninTanu nannu jUchi navvinAraTarA |
| అనుపల్లవి anupallavi | అదెల్ల నా పెను సిగ్గయెరా కాంతా మణిని రాణి వనుచు కీర్తిం బొగిడికొని ఆడినా వింతలు విన చలల్ల నాయెనురా | adella nA penu siggayerA kAntA maNini rANi vanuchu kIrtim bogiDikoni ADinA vintalu vina chalalla nAyenurA |
| చరణం charaNam 1 | తారాధిప సంకాశా గంభీరా భూధారా శ్రీ ధర్మ పురీశుడు నను జేసి దూరుట మరియాద గాదటరా ఎందుకు వందన ఏలుమురా | tArAdhipa samkASA gambhIrA bhUdhArA SrI dharma purISuDu nanu jEsi dUruTa mariyAda gAdaTarA enduku vandana ElumurA |
#563 ఏమి బల్కెనో Emi balkenO
| Title | ఏమి బల్కెనో | Emi balkenO |
| Written By | దుడ్డు సీతారామయ్య (1883-1949) | duDDu sItArAmayya (1883-1949) |
| Book | సెంటినరీ మ్యాగజైన్ (1983) | Centenary Magazine 1983 |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Published At | 302 | |
| పల్లవి pallavi | ఏమి బల్కెనో శ్రీ సఖుడేమి బల్కెనో అలవా | Emi balkenO SrI sakhuDEmi balkenO alavA |
| అనుపల్లవి anupallavi | మోమాటమేమీ లేక దేల్పగదె చెలి | mOmATamEmI lEka dElpagade cheli |
| చరణం charaNam 1 | నే వ్రాయు చీటీ జూచెనా నిరసించి పారవైచెనా ఏమైన నుల్లసమ్ము లాడెనా చెలి | nE vrAyu chITI jUchenA nirasimchi pAravaichenA Emaina nullasammu lADenA cheli |
| చరణం charaNam 2 | నను బాయనంచు జెప్పెనా నిను జూచి వేరె దాగెనా నీకేమైన భూషలిచ్చెనా చెలి | nanu bAyananchu jeppenA ninu jUchi vEre dAgenA nIkEmaina bhUshalichchenA cheli |
| చరణం charaNam 3 | ఆ కాంత యింటనుండెనా అన్యాలయమున నుండెనా మనసిచ్చి మారు జాబు వ్రాసెనా చెలి | A kAnta yinTanunDenA anyAlayamuna nunDenA manasichchi mAru jAbu vrAsenA cheli |
| చరణం charaNam 4 | ఇటు తాను వత్తుననియనా అటు నన్ను రమ్మనియెనా ఎటు బల్కె సీతరామ శాస్త్రి కవినుతు | iTu tAnu vattunaniyanA aTu nannu rammaniyenA eTu balke sItarAma SAstri kavinutu |
Strangely, the lyrics of 302 and this, are almost identical – but, with a different mudra.