| Title | ఏడే కాన్పించడె | EDE kAnpinchaDe |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | పూర్వ కల్యాణి | pUrva kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఏడే కాన్పించ డెడన్నున్నాడే రాము | EDE kAn&pincha DeDannunnADE rAmu |
| అనుపల్లవి anupallavi | నేడే నా జన్మము సఫలము వాడే హా యందగాడే | nEDE nA janmamu saphalamu vADE hA yandagADE |
| చరణం charaNam 1 | పొంది యవ్వాని బల్కరించినే మంచి సమయమేనా | pondi yavvAni balkarinchinE manchi samayamEnA |
| చరణం charaNam 2 | చూడు క్రొమ్మబ్బు వన్నెకాడు వాడు లేడా కనరాడా యయ్యయ్యో | chUDu krommabbu vannekADu vADu lEDA kanarADA yayyayyO |
#551 వెదకి రావే vedaki rAvE
| Title | వెదకి రావే | vedaki rAvE |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | మిశ్ర గతి | miSra gati |
| పల్లవి pallavi | వెదకి రావే వేవేగ బోవే | vedaki rAvE vEvEga bOvE |
| అనుపల్లవి anupallavi | ముదితరో యిటువంటి పురుషు డెందున్నాడో | muditarO yiTuvanTi purushu DendunnADO |
| చరణం charaNam 1 | రాముడంట దశరధ రాజు సుతుడట కోమలి వీనిపై కోరిక పుట్టెనే | rAmuDanTa daSaradha rAju sutuDaTa kOmali vInipai kOrika puTTenE |
| చరణం charaNam 2 | వీరుడంట గర్వితా సురాంతకుడట యారూఢిగా ధర్మావతారమట | vIruDanTa garvitA surAntakuDaTa yArUDhigA dharmAvatAramaTa |
| చరణం charaNam 3 | ఎటుల నోర్తు వీని నిప్పుడే చూడకున్న పటము గాంచుమెంతో వన్నెకాడబ్బబ్బ | eTula nOrtu vIni nippuDE chUDakunna paTamu gAnchumentO vannekADabbabba |
#550 ఎంత జేసితివి enta jEsitivi
| Title | ఎంత జేసితివి | enta jEsitivi |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | సారంగ | sAranga |
| తాళం tALa | ఖండ గతి | khanDa gati |
| పల్లవి pallavi | ఎంత జేసితివి నిన్నే మందునో మాయి కాంతుతో నీవునుం గలసి తోయమ్మాయి | enta jEsitivi ninnE mandunO mAyi kAntutO nIvunum galasi tOyammAyi |
| చరణం charaNam 1 | కోరినానా నాకు గోతి మొగ ముంచుమని నేరకే గడ్డి తిని నీ మాట నమ్మితిని | kOrinAnA nAku gOti moga munchumani nErakE gaDDi tini nI mATa nammitini |
| చరణం charaNam 2 | మొగమాట మెక్కడిది మోసకాడా నీకు నగుబాటు తెచ్చితివ నలుగురిలో నాకు | mogamATa mekkaDidi mOsakADA nIku nagubATu techchitiva nalugurilO nAku |
#549 నా వంటి సొగసు nA vanTi sogasu
| Title | నా వంటి సొగసు | nA vanTi sogasu |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | ఖమాచ్ | khamAch |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | నా వంటి సొగసు కాడేడీ వలవదా ముద్దులాడి | nA vanTi sogasu kADEDI valavadA muddulADi |
| అనుపల్లవి anupallavi | తుంటవిల్తుడీడా నాకు దొయ్యలి నాపై బడదా | tunTaviltuDIDA nAku doyyali nApai baDadA |
| చరణం charaNam 1 | అదిగో గన్ను వైచి నాపయి హంస నడకలన్వచ్చెడు ముదిత నన్ను గనుకొని తన మోము ద్రిప్పె సిగ్గు కదా | adigO gannu vaichi nApayi hamsa naDakalanvaccheDu mudita nannu ganukoni tana mOmu drippe siggu kadA |
| చరణం charaNam 2 | ఆ వైపు కల నృపుల గని యీ వరుసకు మళ్ళిన హహ యీ వంక నొకడు తప్ప నేనే తుది నుండి నిహిహి | A vaipu kala nRpula gani yI varusaku maLLina haha yI vanka nokaDu tappa nEnE tudi nunDi nihihi |
#548 ఇతడెవ్వడో itaDevvaDO
| Title | ఇతడెవ్వడో | itaDevvaDO |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | ఇతడెవ్వడో కాని యింతీ నిన్న నా కలలో నేగుదెంచిన వీరుడే మారాకారుడే | itaDevvaDO kAni yintI ninna nA kalalO nEgudenchina vIruDE mArAkAruDE |
| చరణం charaNam 1 | ప్రాణ నాయకీ చేర రమ్మని నను బిలిచి వలచి సందిట గ్రుచ్చెనే ముద్దులిచ్చెనే ఏను బులకించి యేమరి యుండగ నెంతో వింత కూడ సేసెనే వీని జూడకున్న నా యుసురు వీసమైన నిక నిల్వబోదు | prANa nAyakI chEra rammani nanu bilichi valachi sandiTa gruchchenE muddulichchenE Enu bulakinchi yEmari yunDaga nentO vinta kUDa sEsenE vIni jUDakunna nA yusuru vIsamaina nika nilvabOdu |
#547 ఎవరి దానవే evari dAnavE
| Title | ఎవరి దానవే | evari dAnavE |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | శహన | Sahana |
| తాళం tALa | చతురస్ర గతి | chaturasra gati |
| పల్లవి pallavi | ఎవరి దానవే తరుణీ నీవెందుకుంటి వీకరణి | evari dAnavE taruNI nIvendukunTi vIkaraNi |
| అనుపల్లవి anupallavi | చివురు చేతులకు గరుకు వెదురు గడ చెల్లునె యోడం గడుప జమన కడ | chivuru chEtulaku garuku veduru gaDa chellune yODam gaDupa jamana kaDa |
| చరణం charaNam 1 | ఇమ్ము రాచ సుంకమ్ము నీ కెమ్మోవి మానికమ్ము కొమ్మా నీ కటాక్షమ్మున దాటం గోరెద మమ్మురంపు మోహాంబుధి | immu rAcha sunkammu nI kemmOvi mAnikammu kommA nI kaTAkshammuna dATam gOreda mammurampu mOhAmbudhi |
#546 ఏర యింత Era yinta
| Title | ఏర యింత | Era yinta |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | అఠాణా | aThANA |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఏర యింత నక్క వినయమేల జూపినావు ఱేడ | Era yinta nakka vinayamEla jUpinAvu ~rEDa |
| అనుపల్లవి anupallavi | కోరిన పొసగెదనని వాకొనలేలేదా నా తోడ | kOrina posagedanani vAkonalEdA nA tODa |
| చరణం charaNam 1 | కల్లలాడు వాడు నిక్కముగ నొక్క మగవాడా చెల్లరే సంపద వంతులకి సీ మాట పరువేడ | kallalADu vADu nikkamuga nokka magavADA chellarE sampada vantulaki sI mATa paruvEDa |
| చరణం charaNam 2 | ఏల భయము నీ నుతుపై నీగ వాల నిచ్చెనే చాల దెలసె నీ యోగ్యత చాలు పోయి వచ్చెదనే | Ela bhayamu nI nutupai nIga vAla nichchenE chAla delase nI yOgyata chAlu pOyi vachchedanE |
#545 కొమ్మా గాకిది kommA gAkidi
| Title | కొమ్మా గాకిది | kommA gAkidi |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
| తాళం tALa | త్రస్య గతి | trasya gati |
| పల్లవి pallavi | కొమ్మా గాకిది మేలి బంగారు బొమ్మా యౌరరా యీ ముద్దు గుమ్మ సొగసు వర్ణింప నా తరమ్మా హా | kommA gAkidi mEli bangAru bommA yaurarA yI muddu gumma sogasu varNimpa nA tarammA hA |
| చరణం charaNam 1 | చూపా పువ్విలు కాని క్రొవ్వాడి తూపా తమి ద్రుల్లెడు బేడిస చేపా దీని చూచి శక్యము ధైర్యమాప హా | chUpA puvvillu kAni krovvADi tUpA tami drulleDu bEDisa chEpA dIni chUchi Sakyamu dhairyamApa hA |
| చరణం charaNam 2 | కరుణా మౌని మానసంబుల కైన మురులా తమ్మి ముసురు కొన్న భ్రమరులా కారా వేల్పులైన గింకరులా హా | karuNA mouni mAnasambula kaina murulA tammi musuru konna bhramarulA kArA vElpulaina ginkarulA hA |
#544 సరసకు రావేమిరా sarasaku rAvEmirA
| Title | సరసకు రావేమిరా | sarasaku rAvEmirA |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | కాఫీ | kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సరసకు రావేమిరా శ్రీకృష్ణ సరసకు రమ్మని నిరతము నిన్ను నే పరిపరి విధముల స్మరణ జేసిన గాని | sarasaku rAvEmirA SrIkRshNa sarasaku rammani niratamu ninnu nE paripari vidhamula smaraNa jEsina gAni |
| చరణం charaNam 1 | మదన బాధలతో నే మది నిల్ప లేనురా నిదుర లేక నిను ఎదురు జూచితిరా మధురమైన నీ మృదువైన పలుకులు హృదయమందు నను బాధ జేసిన గాని | madana bAdhalatO nE madi nilpa lEnurA nidura lEka ninu eduru jUchitirA madhuramaina nI mRduvaina palukulu hRdayamandu nanu bAdha jEsina gAni |
| చరణం charaNam 2 | శృంగారమైన నీ అంగ సంగమునకు ముంగురులను దూపి నిలచి యుంటినిరా మంగళ రూప నీ మోము జూపక ఆ రంగైన మేడలో రంజిల్లు కృష్ణ | SRngAramaina nI anga sangamunaku mungurulanu dUpi nilachi yunTinirA mangaLa rUpa nI mOmu jUpaka A rangaina mEDalO ranjillu kRshNa |
#543 ఏమి సేతురా Emi sEturA
| Title | ఏమి సేతురా | Emi sEturA |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | అమీరు కల్యాణి | amIru kalyANi |
| తాళం tALa | అద్దా | addA |
| పల్లవి pallavi | ఏమి సేతురా నా మనోభవా | Emi sEturA nA manObhavA |
| చరణం charaNam 1 | ఏమో కాని నిన్ను నే మఱుతునన్న నా మనము నందు నాటి యుంటివిరా | EmO kAni ninnu nE ma~rutunanna nA manamu nandu nATi yunTivirA |
| చరణం charaNam 2 | మలయ సమీరము వడ గాలియై తోచె చలువల పన్నీరు చిలువల విసమయ్యె | malaya samIramu vaDa gAliyai tOche chaluvala pannIru chiluvala visamayye |
| చరణం charaNam 3 | మారుని శరముల బారికి బాల్పడ గూరిచి నా విధి క్రూరత సూపెరా | mAruni Saramula bAriki bAlpaDa gUrichi nA vidhi krUrata sUperA |
| చరణం charaNam 4 | మహిత భుజంగ మాన్య కవిపాలా మహిమ తెలిసెరా మాటలాడ రారా | mahita bhujanga mAnya kavipAlA mahima teliserA mATalADa rArA |