#532 బలె బలె నను bale bale nanu

Titleబలె బలె ననుbale bale nanu
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaహిందుస్థానీ కాఫీhindusthAnI kAfI
తాళం tALaఅటaTa
పల్లవి pallaviబలె! బలె! నను జేరి బాసలు చేసి
కలికిరో! నా మాట తలపడే రాడే
bale! bale! nanu jEri bAsalu chEsi
kalikirO! nA mATa talapaDE rADE
చరణం
charaNam 1
అత్తరు వేలనే అల గంద మేలనే
పొత్తు మఱచి పోయి పురుషుడు రాడాయె
చిత్తజు బారి నే జేరితినే చెలి
attaru vElanE ala ganda mElanE
pottu ma~rachi pOyi purushuDu rADAye
chittaju bAri nE jEritinE cheli
చరణం
charaNam 2
సారెకు బయ్యెద జాఱ దీయుచు వాడు
కూరిమి కౌగిటి గోరెడు వాడేడే
మారు బారి నెటు నోరుతునే చెలి
sAreku bayyeda jA~ra dIyuchu vADu
kUrimi kaugiTi gOreDu vADEDE
mAru bAri neTu nOrutunE cheli
చరణం
charaNam 3
సన్మానముల నెంతో సలుపుచున్న నాపై
మన్మనోహరునకు మనసేమి రాకపోయె
మన్మధు చేతలెటు మాన్పుదునే చెలి
sanmAnamula nentO salupuchunna nApai
manmanOharunaku manasEmi rAkapOye
manmadhu chEtaleTu mAn&pudunE cheli
చరణం
charaNam 4
రంగనాధుడు కవి రాజ భుజంగ రావు
మంగళ నుతుల నన్మఱచి రాకున్నాడే
యంగజు ఢాకకు నాగుదునే చెలి
ranganAdhuDu kavi rAja bhujanga rAvu
mangaLa nutula nanma~rachi rAkunnADE
yangaju DhAkaku nAgudunE cheli

#531 పలుకడేమే చెలి palukaDEmE cheli

Titleపలుకడేమే చెలిpalukaDEmE cheli
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఏకEka
పల్లవి pallaviపలుకడేమే చెలి కలికి బోధన వినిpalukaDEmE cheli kaliki bOdhana vini
చరణం
charaNam 1
కలకాలము నీ యలుకలె యౌటను
వలపు లనునవి తలపు లాయెగదె
kalakAlamu nI yalukale yauTanu
valapu lanunavi talapu lAyegade
చరణం
charaNam 2
వెన్నెల నా బిగి చన్నుల మోపుచు
నున్నను నా మోము కన్నుల జూడడె
vennela nA bigi channula mOpuchu
nunnanu nA mOmu kannula jUDaDe
చరణం
charaNam 3
విరి బంతులు పై విసరిన గాంతుడు
మరుని కేళి మాట మనమున దల్పడె
viri bantulu pai visarina gAntuDu
maruni kELi mATa manamuna dalpaDe
చరణం
charaNam 4
రమణిరో! భుజంగ రావు నుతిపయి
తమి సుమ శయ్యను దార్పగ జూడడె
ramaNirO! bhujanga rAvu nutipayi
tami suma Sayyanu dArpaga jUDaDe

#530 ఓ విరిబోడిరో O viribODirO

Titleఓ విరిబోడిరోO viribODirO
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఓ విరిబోడిరో యోర్వగ జాలనె
కావవె నన్ను గూడి ఘన రతుల దేల్చి
O viribODirO yOrvaga jAlane
kAvave nannu gUDi ghana ratula dElchi
చరణం
charaNam 1
చెమ్మగిల్లు నీకు చమ్ముల నాయెద
గ్రుమ్ముచు గౌగిలి యిమ్మని వేడెద
chemmagillu nIku chammula nAyeda
grummuchu gaugili yimmani vEDeda
చరణం
charaNam 2
కళలూరగ నిక గాము కేళిని నా
కలవర ముడుపవే కాంతరో! మ్రొక్కెద
kaLalUraga nika gAmu kELini nA
kalavara muDupavE kAntarO! mrokkeda
చరణం
charaNam 3
లలనా మణిరో వలసిన రతుల
గలలో నిను గూడి సొలయు చుంటినే
lalanA maNirO valasina ratula
galalO ninu gUDi solayu chunTinE
చరణం
charaNam 4
రాజ బహదరు విరాజి భుజంగ్రావు
పూజల గైకొను భూజన ప్రియుడనే
rAja bahadaru virAji bhujangrAvu
pUjala gaikonu bhUjana priyuDanE

#529 లీల మరువలేనే lIla maruvalEnE

Titleలీల మరువలేనేlIla maruvalEnE
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఏకEka
పల్లవి pallaviలీల మఱువలేనే వాని లీల మఱువలేనేlIla ma~ruvalEnE vAni lIla ma~ruvalEnE
చరణం
charaNam 1
ఏలాగు తాళుదు బాలామణిరో నేడు
చాల రతుల చేత సౌఖ్యము గూర్చిన
ElAgu tALudu bAlAmaNirO nEDu
chAla ratula chEta saukhyamu gUrchina
చరణం
charaNam 2
నిన్నటి రేయి నా కన్నులు మూసి తా
దిన్నగా నిలుమని చన్నుల జేబట్టు
ninnaTi rEyi nA kannulu mUsi tA
dinnagA nilumani channula jEbaTTu
చరణం
charaNam 3
దూరమున నిల్వ మారు కేళికిటు
చేరు మనుచు నా జారు పైట లాగు
dUramuna nilva mAru kELikiTu
chEru manuchu nA jAru paiTa lAgu
చరణం
charaNam 4
తనయుల వలె దన దాసుల జూచుచు
దనర భుజంగ రావు దాసు నేలువాని
tanayula vale dana dAsula jUchuchu
danara bhujanga rAvu dAsu nEluvAni

#528 సరసకు రారా sarasaku rArA

Titleసరసకు రారాsarasaku rArA
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaహిందుస్థానీ భైరవిhindusthAnI bhairavi
తాళం tALaఅద్దాaddA
పల్లవి pallaviసరసకు రారా సమయమిదేరాsarasaku rArA samayamidErA
చరణం
charaNam 1
పరిపరి విధముల బ్రతిమాలు కొన్నను
చిరచిర లాడెదు సరసుడ వౌదురా
paripari vidhamula bratimAlu konnanu
chirachira lADedu sarasuDa vaudurA
చరణం
charaNam 2
అరవిరి పానుపు లమరిచితినిరా
కురువ ముదవనము కుదురు పఱచితిరా
araviri pAnupu lamarichitinirA
kuruva mudavanamu kuduru pa~rachitirA
చరణం
charaNam 3
బిగువగు గుబ్బల పొగురన రవికెలు
పగులగ సాగెను సెగలను సైపరా
biguvagu gubbala pogurana ravikelu
pagulaga sAgenu segalanu saiparA
చరణం
charaNam 4
మనవి చేకొనవేమి మదన గోపాల
ఘనమా భుజంగ రాయ కవిరాజ పాలా
manavi chEkonavEmi madana gOpAla
ghanamA bhujanga rAya kavirAja pAlA

#527 తాళజాలరా tALajAlarA

TitleతాళజాలరాtALajAlarA
Written Byమంత్రిప్రగడ భుజంగరావుmantripragaDa bhujangarAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaహిందుస్థానీ కమాచిhindusthAnI kamAchi
తాళం tALaఅటaTa
పల్లవి pallaviతాళజాలరా యిక నే దాళజాలరా
జాలమేల వెన్నెలల రాజు వలరాజు జేరెనిక
tALajAlarA yika nE dALajAlarA
jAlamEla vennelala rAju valarAju jErenika
చరణం
charaNam 1
చనుమానముచే మనవి చేసినను
మనమున నెన్నవు మంచివాడవౌ
chanumAnamuchE manavi chEsinanu
manamuna nennavu manchivADavau
చరణం
charaNam 2
సరసుడంచు నిను సరసకు బిలిచితి
గరుణ జేసి తాప భరము తీర్పరా
sarasuDanchu ninu sarasaku bilichiti
garuNa jEsi tApa bharamu tIrparA
చరణం
charaNam 3
మదనుడు శరముల పదనురా నూరెడు
నదనిదే కౌగిట గదియింప గనను
madanuDu Saramula padanurA nUreDu
nadanidE kaugiTa gadiyimpa gananu
చరణం
charaNam 4
రాజనుత భుజంగ రాయ కవిదేవ
భూజమా! నీ కీర్తి రాజిల్లు నిక భూమి
rAjanuta bhujanga rAya kavidEva
bhUjamA! nI kIrti rAjillu nika bhUmi

#526 ఆపలేని మోహమేలరా ApalEni mOhamElarA

Titleఆపలేని మోహమేలరాApalEni mOhamElarA
Written Byమంత్రిప్రగడ భుజంగరావుmantripragaDa bhujangarAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaశుద్ధ తోడిSuddha tODi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఆపలేని మోహమేమిరా సామిగ నాపైApalEni mOhamEmirA sAmiga nApai
చరణం
charaNam 1
రేపటికి మాపటికి గోపమేల దానితోడ
నాపలేక దాని పొందు నమృతపు సారమొందు
rEpaTiki mApaTiki gOpamEla dAnitODa
nApalEka dAni pondu namRtapu sAramondu
చరణం
charaNam 2
మనసు తీర నొక్కసారి మారుకేళి గూడుమని
మనవి చేసి వేడుకొన్న మాటలాడని వానికింత
manasu tIra nokkasAri mArukELi gUDumani
manavi chEsi vEDukonna mATalADani vAnikinta
చరణం
charaNam 3
ఎన్ని దినముల నాడు నన్ను జూచి నాడవో
యిన్ని నాళ్ళు లేని ప్రేమ యిప్పుడేల కలిగెరా
enni dinamula nADu nannu jUchi nADavO
yinni nALLu lEni prEma yippuDEla kaligerA
చరణం
charaNam 4
మదన జనక నేడు నీదు మనసు తీరిచెదరా
ముదము మీఱ భుజంగ రావు సదయత బాలింప బోరా
madana janaka nEDu nIdu manasu tIrichedarA
mudamu mI~ra bhujanga rAvu sadayata bAlinpa bOrA

#525 మ్రొక్కెద సామి mrokkeda sAmi

Titleమ్రొక్కెద సామిmrokkeda sAmi
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaఆనంద భైరవిAnanda bhairavi
తాళం tALaఅటaTa
పల్లవి pallaviమ్రొక్కెద సామి నీకు మ్రొక్కెదmrokkeda sAmi nIku mrokkeda
చరణం
charaNam 1
రేపు రమ్మని మాపు రమ్మని
తేప తేపకు ద్రిప్ప బోకుర
కాపురము బాసితిని నీకై
యోప జాలర మారు బారి
rEpu rammani mApu rammani
tEpa tEpaku drippa bOkura
kApuramu bAsitini nIkai
yOpa jAlara mAru bAri
చరణం
charaNam 2
నిబ్బరంబుగ నాదు బిగి చను
గుబ్బలం గొని కౌగిలింపర
గొబ్బు నను నబ్బబ్బ! యామరు
దెబ్బలకు నే నోర్వ జాలర
nibbarambuga nAdu bigi chanu
gubbalam goni kaugilimpara
gobbu nanu nabbabba! yAmaru
debbalaku nE nOrva jAlara
చరణం
charaNam 3
మల్లెలును విరి జాజి పూవులు
కొల్లగా దెప్పించి యుంచితి
నుల్లమిక రంజిల్ల నాపై
చల్లి పాపర కాము తాపము
mallelunu viri jAji pUvulu
kollagA deppinchi yunchiti
nullamika ramjilla nApai
challi pApara kAmu tApamu
చరణం
charaNam 4
చాలు చాలు భుజంగ రావటు
చాలగా నిను సన్నుతించిన
జాలమిటు సేయంగ నౌర
యేలరా యీ కోపమేలర?
chAlu chAlu bhujanga rAvaTu
chAlagA ninu sannutinchina
jAlamiTu sEyanga naura
yElarA yI kOpamElara?

#524 మేలమా సామీ mElamA sAmI

Titleమేలమా సామీmElamA sAmI
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaహిందుస్థాని కాఫీhindusthAni kAfI
తాళం tALaఅటaTa
పల్లవి pallaviమేలమా? సామీ! యేమిర మేలమా?
తాళజాలదు బాలరా మరు-
కేళి గూడగ వేళరా తడ-
వేల చేసెదు గోలరా నీ
లీల నైనను దేఱి చూడవు
mElamA? sAmI! yEmira mElamA?
tALajAladu bAlarA maru-
kELi gUDaga vELarA taDa-
vEla chEsedu gOlarA nI
lIla nainanu dE~ri chUDavu
చరణం
charaNam 1
పంతమా? సామీ! దానితో బంతమా?
చెంత చేరవు కోపమా? యిసు-
మంత జూడవు శాపమా? యల-
కంతుడే చెర పాపమా? యా
యింతి నీకయి యెంత సొక్కెర
pantamA? sAmI! dAnitO bantamA?
chenta chEravu kOpamA? yisu-
manta jUDavu SApamA? yala-
kantuDE chera pApamA? yA
yinti nIkayi yenta sokkera
చరణం
charaNam 2
మాటరా సామీ! నీకు మాటరా
సాటి దానితో గూటమా? నీ
పాటి వారికి వాటమా? యా
బోటికై యారాటమా – హా!
సూటి కాదది మేటి వారికి
mATarA sAmI! nIku mATarA
sATi dAnitO gUTamA? nI
pATi vAriki vATamA? yA
bOTikai yArATamA – hA!
sUTi kAdadi mETi vAriki
చరణం
charaNam 3
యంత్రమా? సామీ! యేమిర? యంత్రమా
మంత్రిప్రగడ కులేంద్రుడు కవి-
తంత్ర పరమానందుడు స-
న్మంత్రియౌ భుజగేంద్రుడీ నీ
మంత్ర మెఱగెను దంత్ర మేలర?
yantramA? sAmI! yEmira? yantramA
mantripragaDa kulEndruDu kavi-
tantra paramAnanduDu sa-
nmantriyau bhujagEndruDI nI
mantra me~ragenu dantra mElara?

#523 రారా మా చెలి rArA mA cheli

Titleరారా మా చెలిrArA mA cheli
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaకన్నడkannaDa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviరారా మా చెలినేలరా లేచి రారా మా చెలి
మేరా నీకిది మంచిదేరా వేకువ యయ్యె లేరా
లోకులు నవ్వి పోరా రారా చెలినేలరా
rArA mA chelinElarA lEchi rArA mA cheli
mErA nIkidi manchidErA vEkuva yayye lErA
lOkulu navvi pOrA rArA chelinElarA
చరణం
charaNam 1
మల్లి విరుల జాల వెల్లి విరియగ బాన్పు జల్లి
కురుల జడలల్లి సిరుల విలసిల్లి త్రుళ్ళినదిర
malli virula jAla velli viriyaga bAn&pu jalli
kurula jaDalalli sirula vilasilli truLLinadira
చరణం
charaNam 2
సొక్కి మారుని ఢాక జిక్కి యారని కాక స్రుక్కి
తీరని మోహమెక్కి నేరము సైప మ్రొక్కి దక్కితి ననె
sokki mAruni DhAka jikki yArani kAka srukki
tIrani mOhamekki nEramu saipa mrokki dakkiti nane
చరణం
charaNam 3
మేని మెఱుగుల జాల బైని మెఱయగ జేయు దాని
మెఱపుల మోసపోని తెఱగును గానవేని హాని యౌననె
mEni me~rugula jAla baini me~rayaga jEyu dAni
me~rapula mOsapOni te~ragunu gAnavEni hAni yaunane
చరణం
charaNam 4
మేల? చనవు తడవేల? కినుక కిది వేళ?
విను భుజగ పాల! ఘనుల కిది వాల? పోలదుర
mEla? chanavu taDavEla? kinuka kidi vELa?
vinu bhujaga pAla! ghanula kidi vAla? pOladura