#512 మానినీ వాని mAninI vAni

Titleమానినీ వానిmAninI vAni
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At21, 181
పల్లవి pallaviమానినీ వాని జోలి దానను నే గాదే ఓmAninI vAni jOli dAnanu nE gAdE O
కానిదాని మాట విని
కరుణ మఱచి యుండెనే
kAnidAni mATa vini
karuNa ma~rachi yunDenE
చరణం
charaNam 1
కలికిరో నను బాయనని పలికిన దేమాయెనే
అల చెలితో కలసి రాక అయిదాఱు నెల లాయెనే
kalikirO nanu bAyanani palikina dEmAyenE
ala chelitO kalasi rAka ayidA~ru nela lAyenE
చరణం
charaNam 2
బోటిరో నను బాయనని బూటకములు చేసెనే
మాట తప్పి యున్న వాని మోము జూడ రాదే ఓ
bOTirO nanu bAyanani bUTakamulu chEsenE
mATa tappi yunna vAni mOmu jUDa rAdE O
చరణం
charaNam 3
సన్నుతాంగి చాల వలచి యిన్ని దినము లుంటినే
నన్ను గూడి వేంకటేశుడన్న మాట వింటినే
sannutAngi chAla valachi yinni dinamu lunTinE
nannu gUDi vEnkaTESuDanna mATa vinTinE

#511 మనసేమో సైచదే manasEmO saichadE

Titleమనసేమో సైచదేmanasEmO saichadE
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaఆదిAdi
Previously Posted At25
పల్లవి pallaviమనసేమో సైచదే మానినీ మణి నాmanasEmO saichadE mAninI maNi nA
చరణం
charaNam 1
వారిజ ముఖి సరివారిలో నన్నిటు
దూఱి దాని యిల్లు జేరగ నా
vArija mukhi sarivArilO nanniTu
dU~ri dAni yillu jEraga nA
చరణం
charaNam 2
మరు శరములు అతి దురుసుగ నిరతము
గురు కుచములపై గురియగ
maru Saramulu ati durusuga niratamu
guru kuchamulapai guriyaga
చరణం
charaNam 3
గోపాలుడు నను రాపు జేసె
పరితాపములకు నెటులోపుదు నే
gOpAluDu nanu rApu jEse
paritApamulaku neTulOpudu nE

#510 పోయి రమ్మనే pOyi rammanE

Titleపోయి రమ్మనేpOyi rammanE
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Posted At26
పల్లవి pallaviపోయి రమ్మనే పొలతిరో సామిని
పొగడే చెలి యింటికి
pOyi rammanE polatirO sAmini
pogaDE cheli yinTiki
చరణం
charaNam 1
ఒంటిగా నిన్న దానింటిలో జూచి నా
వంటి చెలి దెల్పెనే కంటినని నాతో
onTigA ninna dAninTilO jUchi nA
vanTi cheli delpenE kanTinani nAtO
చరణం
charaNam 2
వెలదిరో మును వనజాసను డేమని
వ్రాసెనో ఏ పెనుగొనుటేలను
veladirO munu vanajAsanu DEmani
vrAsenO E penugonuTElanu
చరణం
charaNam 3
వెలదిరో చక్కని సురపురి సూనుతో
మదనుని కేళిలో మనసీయ నంటే
veladirO chakkani surapuri sUnutO
madanuni kELilO manasIya nanTE

#509 పోపోవే చెలియా pOpOvE cheliyA

Titleపోపోవే చెలియాpOpOvE cheliyA
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Posted At22, 161
పల్లవి pallaviపోపోవే చేలియా రాపేలేpOpOvE chEliyA rApElE
చరణం
charaNam 1
అక్కర వేళలో దక్కిన విటుల కెక్కడి మమతakkara vELalO dakkina viTula kekkaDi mamata
చరణం
charaNam 2
జారులు సమరతి తీఱిన వెనుక దూఱేదే మరియాదjArulu samarati tI~rina venuka dU~rEdE mariyAda
చరణం
charaNam 3
వాసిగ నను శ్రీనివాసుడు గూడి మోసము చేసెనేvAsiga nanu SrInivAsuDu gUDi mOsamu chEsenE

#508 నాపై ప్రేమ nApai prEma

Titleనాపై ప్రేమnApai prEma
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaచాపుchApu
Previously Posted At99
పల్లవి pallaviనాపై ప్రేమ లేని జాడ
నాడే తెలిసెను పోపో పోరా
nApai prEma lEni jADa
nADE telisenu pOpO pOrA
పాపి సవతి మాయలలో జిక్కి
గోపాల నీ కొనగోరంతైన
pApi savati mAyalalO jikki
gOpAla nI konagOrantaina
చరణం
charaNam 1
ఎందాక జూచిన ఈ మగజాతి
ఇంతుల నేలేదాక ఈ ప్రీతి
సందేహమా మాట ప్రఖ్యాతి
సరసుల లక్షణమా యీ రీతి
endAka jUchina I magajAti
intula nElEdAka I prIti
sandEhamA mATa prakhyAti
sarasula lakshaNamA yI rIti
చరణం
charaNam 2
మోహమందు మోసమిందు
ఏ వేళ బుద్ధులు నీయందు
ఏల కలిగెనో ఇక నేమందు
స్నేహము జేసినదే బలు పొందు
mOhamandu mOsamindu
E vELa buddhulu nIyandu
Ela kaligenO ika nEmandu
snEhamu jEsinadE balu pondu

#507 తలచి తాళగ talachi tALaga

Titleతలచి తాళగtalachi tALaga
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaచాపుchApu
Previously Posted At12
పల్లవి pallaviతలచి తాళగ లేనే ఓ చెలియ నేtalachi tALaga lEnE O cheliya nE
చరణం
charaNam 1
కస్తూరి విడెమిచ్చి కరికర గతి చూపి
కుస్తరించి నన్ను కొసరి వేడిన లీల
kastUri viDemichchi karikara gati chUpi
kustarinchi nannu kosari vEDina lIla
చరణం
charaNam 2
కనుల చెక్కుల మోవి చనుల కంఠము
బలమున ముక్కు నాభి చుంబనము జేసిన వాని
kanula chekkula mOvi chanula kanThamu
balamuna mukku nAbhi chumbanamu jEsina vAni

#506 చెలియా కాంతుడు cheliyA kAntuDu

Titleచెలియా కాంతుడుcheliyA kAntuDu
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Posted At34
పల్లవి pallaviచెలియా కాంతుడు నన్నెడ బాసి
చాల నన్నిటు చేసెనే గాసి
cheliyA kAntuDu nanneDa bAsi
chAla nanniTu chEsenE gAsi
మరుడు నా యురమునను శరము లేయmaruDu nA yuramunanu Saramu lEya
చరణం
charaNam 1
మందమగు మారుతము డాయ
విరహము నేనెటు సైతునే సఖియ
ఒంటిగా నేనుండనాయె
mandamagu mArutamu DAya
virahamu nEneTu saitunE sakhiya
onTigA nEnunDanAye
చరణం
charaNam 2
వెన్నెల గాయగ మిగుల తాపమాయెనే
అన్నమని సైచ దాయెనే
కన్నులకు నిదుర రాదే ఓ మగువా
కామిని బోధన లాయెనే
vennela gAyaga migula tApamAyenE
annamani saicha dAyenE
kannulaku nidura rAdE O maguvA
kAmini bOdhana lAyenE
చరణం
charaNam 3
మరుని కేళిలో నన్ను గూడెనే
మానినిరో దానితో గూడెనే
ధరగిరి సామికి న్యాయము నటవే
తాళను వానిక రమ్మనవే ఓ
maruni kELilO nannu gUDenE
mAninirO dAnitO gUDenE
dharagiri sAmiki nyAyamu naTavE
tALanu vAnika rammanavE O

#505 చిన్నదానరా chinnadAnarA

Titleచిన్నదానరాchinnadAnarA
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At15, 119
పల్లవి pallaviచిన్నదానరా నేchinnadAnarA nE
కన్ను దోయి కింపు దోచే
కన్నెలు లేరేమిరా నే
kannu dOyi kimpu dOchE
kannelu lErEmirA nE
చరణం
charaNam 1
మగని మోము జూచి చాల
దిగులు చెంది యున్న నాపై
పొగరు మాటలాడి నన్ను
అగడు సేతు రేమిరా నే
magani mOmu jUchi chAla
digulu chendi yunna nApai
pogaru mATalADi nannu
agaDu sEtu rEmirA nE
చరణం
charaNam 2
చెక్కు నొక్కి ముదమున
చను ముక్కు నులిమి గావరమున
గ్రక్కున నను కౌగిలించి
పక్క జేర్తు రేమిరా నే
chekku nokki mudamuna
chanu mukku nulimi gAvaramuna
grakkuna nanu kaugilinchi
pakka jErtu rEmirA nE
చరణం
charaNam 3
రత్నపురి నిలయుడ ప్రయత్నముతో
నన్ను గూడి
రత్న సరాలిచ్చేనని
రవ్వ సేతువేమిరా నే
ratnapuri nilayuDa prayatnamutO
nannu gUDi
ratna sarAlichchEnani
ravva sEtuvEmirA nE

#504 చానరో వాని బాసి chAnarO vAni bAsi

Titleచానరో వాని బాసిchAnarO vAni bAsi
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At10
పల్లవి pallaviచానరో వాని బాసి నేనెటువలె సైతునేchAnarO vAni bAsi nEneTuvale saitunE
దాని బోధనలు వినుట మానడేమి సేతునేdAni bOdhanalu vinuTa mAnaDEmi sEtunE
చరణం
charaNam 1
సన్నుతాంగి సరసుడని చాల నమ్మి యుంటినే
నిన్న దాని యింట జేరి యున్న వగలు వింటినే
sannutAngi sarasuDani chAla nammi yunTinE
ninna dAni yinTa jEri yunna vagalu vinTinE
చరణం
charaNam 2
సదయుడు మదనుని బారికి ముదముతో నను ద్రోసెనే
వదలక తన ప్రాయమెల్ల సుదతి పాలు చేసెనే
sadayuDu madanuni bAriki mudamutO nanu drOsenE
vadalaka tana prAyamella sudati pAlu chEsenE
చరణం
charaNam 3
వాసవ నుతుడైన శ్రీనివాసుడు నను గూడెనే
బాసలెల్ల మఱచి యా దోసకారి గూడెనే
vAsava nutuDaina SrInivAsuDu nanu gUDenE
bAsalella ma~rachi yA dOsakAri gUDenE

#503 కాముని విరి శరముల kAmuni viri Saramula

Titleకాముని విరి శరములkAmuni viri Saramula
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Posted At29
పల్లవి pallaviకాముని విరి శరముల బారికి నే
నేమని సహింతునే
kAmuni viri Saramula bAriki nE
nEmani sahintunE
చరణం
charaNam 1
సామి రాడాయనే నిమిష మేడాయనే
నా మనవి తెలియ బలికే
ప్రేమ సఖి లేదాయనే
sAmi rADAyanE nimisha mEDAyanE
nA manavi teliya balikE
prEma sakhi lEdAyanE
చరణం
charaNam 2
బాలరో ఈ చలమేలనే వానికి
ఏ లలనా మణి బోధించె
నేమో నను మఱచెనే
bAlarO I chalamElanE vAniki
E lalanA maNi bOdhinche
nEmO nanu ma~rachenE
చరణం
charaNam 3
భామరో కాముని కేళి నన్నేలిన
సామి ధర గిరి నిలయునిపై
ప్రేమ యెటు మఱతునే
bhAmarO kAmuni kELi nannElina
sAmi dhara giri nilayunipai
prEma yeTu ma~ratunE