#442 రావేలర చెంతకు rAvElara chentaku

Titleరావేలర చెంతకుrAvElara chentaku
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviరావేలర చెంతకు రాజసమా
ఏ వనిత చెవి గఱిచె
rAvElara chentaku rAjasamA
E vanita chevi ga~riche
చరణం
charaNam 1
భావభవుని బారికి నను ద్రోసి బాధ
నొంద జేయకు నే వేడగ
bhAvabhavuni bAriki nanu drOsi bAdha
nonda jEyaku nE vEDaga
చరణం
charaNam 2
ఆనాటి నేస్తమెంచకను నన్నగడు చేయ న్యాయమటర సామిగ
ఏణాక్షి వలను దగిలి చలమును మానవేర కరుణ సుంత లేక
AnATi nEstamenchakanu nannagaDu chEya nyAyamaTara sAmiga
ENAkshi valanu dagili chalamunu mAnavEra karuNa sunta lEka
చరణం
charaNam 3
వాదేల చేసేవురా నావంటి చెలిని నేచగ తగునటరా
నీ దాన ననుచు నమ్మినందుకు నెనరుతోను కలిసి మెలసి యుండగ
vAdEla chEsEvurA nAvanTi chelini nEchaga tagunaTarA
nI dAna nanuchu namminanduku nenarutOnu kalisi melasi yunDaga
చరణం
charaNam 4
శ్రీ రాజగోపాల నీదు చిత్తమీ రీతి యైన నా సరి వారిజాక్షులెల్ల నన్ను నెంతుర మేరగాదు నేరమేమి చేసితిSrI rAjagOpAla nIdu chittamI rIti yaina nA sari vArijAkshulella nannu nentura mEragAdu nEramEmi chEsiti

#441 సామిని తోడి తేగదే sAmini tODi tEgadE

Titleసామిని తోడి తేగదేsAmini tODi tEgadE
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందోళhindOLa
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviసామిని తోడి తేగదే నా
సకియరో జాగు సేయవలదే బిరాన
sAmini tODi tEgadE nA
sakiyarO jAgu sEyavaladE birAna
చరణం
charaNam 1
భామరో నేనేమి సేతు కాముని బారికి
తాళగ జాలనే ప్రేమ యుంచి రా రమ్మటంచు
bhAmarO nEnEmi sEtu kAmuni bAriki
tALaga jAlanE prEma yunchi rA rammaTanchu
చరణం
charaNam 2
ఇంతిరో వాడిందు రాక పంతము సాధించెను గదవే
అంతరంగ మెఱిగించి వేగ
intirO vADindu rAka pantamu sAdhinchenu gadavE
antaranga me~riginchi vEga
చరణం
charaNam 3
కమల వైరి గాసి చేయ రమణిరో రాజగోపాలుని
జూడక నిమిషమైన తమి నిలుపజాల
kamala vairi gAsi chEya ramaNirO rAjagOpAluni
jUDaka nimishamaina tami nilupajAla

#440 రారా రమ్మనెరా rArA rammanerA

Titleరారా రమ్మనెరాrArA rammanerA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviరారా రమ్మనెరా చెలియ నిను
మారుబారి కోర్వలేక వేగమే
rArA rammanerA cheliya ninu
mArubAri kOrvalEka vEgamE
చరణం
charaNam 1
కోరి యున్నదిరా సుదతిపై కోపము చేయకురా
సరోజ ముఖి విరాళి మై మఱచెనురా
ఇటు విరసము తగదుర
kOri yunnadirA sudatipai kOpamu chEyakurA
sarOja mukhi virALi mai ma~rachenurA
iTu virasamu tagadura
చరణం
charaNam 2
చలమేలరా మగువకును సాటెవరున్నారురా
విలాసముగను నేలుటకు సమయమురా
మనవిని విని కరుణను
chalamElarA maguvakunu sATevarunnArurA
vilAsamuganu nEluTaku samayamurA
manavini vini karuNanu
చరణం
charaNam 3
రాజగోపాలా నీకిటుల రాజసమేలా
నిజమ్ముగను సదా
వలచినది వినురా
మునుపటి దయ తలచుచు
rAjagOpAlA nIkiTula rAjasamElA
nijammuganu sadA
valachinadi vinurA
munupaTi daya talachuchu

#439 ఎందుకే యాచలము endukE yAchalamu

Titleఎందుకే యాచలముendukE yAchalamu
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఎందుకే యాచలము నీ కిందు వదనరో
సుందరాంగి నిన్ను జూచి
సొక్కి చాల మరులు కొంటి
endukE yAchalamu nI kindu vadanarO
sundarAngi ninnu jUchi
sokki chAla marulu konTi
చరణం
charaNam 1
నిను బాసి నిదుర రాదు
నిమిషమైన ప్రొద్దు పోదు
మనసిజు బారి కోర్వరాదు
మమత నిలుప పశము గాదు
ninu bAsi nidura rAdu
nimishamaina proddu pOdu
manasiju bAri kOrvarAdu
mamata nilupa paSamu gAdu
చరణం
charaNam 2
తరుణిరో నే తాళజాల
దయ నాపై దాచనేల
కరుణ యుంచి యీ వేళ
కలయుట కిక జాగులేల
taruNirO nE tALajAla
daya nApai dAchanEla
karuNa yunchi yI vELa
kalayuTa kika jAgulEla
చరణం
charaNam 3
కోపము నాపై మాను
కోమలి నిను నమ్మినాను
ప్రాపు కోరి వచ్చినాను
పరక నీకు పుణ్యమౌను
kOpamu nApai mAnu
kOmali ninu namminAnu
prApu kOri vachchinAnu
paraka nIku puNyamaunu

#438 మాయ చేసేవేరా mAya chEsEvErA

Titleమాయ చేసేవేరాmAya chEsEvErA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaనాదనామక్రియnAdanAmakriya
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviమాయ చేసేవేరా నాతో సామి నాతోmAya chEsEvErA nAtO sAmi nAtO
చరణం
charaNam 1
హాయి మీఱ నిన్న రేయి దాని ననుభవించలేదా
ఱాయివంటి దాయె లేర నీమది రాను రాను జాడలెల్ల దెలిసెర
hAyi mI~ra ninna rEyi dAni nanubhavinchalEdA
~rAyivanTi dAye lEra nImadi rAnu rAnu jADalella delisera
చరణం
charaNam 2
నల్లవాని నమ్మరాదనే నుడి సల్లగాదు గదరా చెల్లదురా
నీ నడతలు నా యెడ చేరరాకు దక్కితినని పలుకుచు
nallavAni nammarAdanE nuDi sallagAdu gadarA chelladurA
nI naDatalu nA yeDa chErarAku dakkitinani palukuchu
చరణం
charaNam 3
తరుణి యెట్టి వలపు మందు పెట్టెనొ తాళ లేవు గదరా
సరసుడైన రాజగోపాల చాలు చాలు వగలు చేయకుర ఇట
taruNi yeTTi valapu mandu peTTeno tALa lEvu gadarA
sarasuDaina rAjagOpAla chAlu chAlu vagalu chEyakura iTa

#437 ఊరక చలమేల Uraka chalamEla

Titleఊరక చలమేలUraka chalamEla
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaతిశ్ర లఘువుtiSra laghuvu
పల్లవి pallaviఊరక చలమేల నీకిది మేరగాదురా సామి
వారిజాక్షి వలచిన నను గారవించి చూడరా
Uraka chalamEla nIkidi mEragAdurA sAmi
vArijAkshi valachina nanu gAravinchi chUDarA
చరణం
charaNam 1
పద్దు చేయ వలదుర నా యొద్దికి రారా
సుద్దులనే తేలించి ప్రొద్దు పుచ్చకురా
paddu chEya valadura nA yoddiki rArA
suddulanE tElinchi proddu puchchakurA
చరణం
charaNam 2
తరుణుల వలె నే వలపు దాచ జాలరా
మరునిల్లు చెమ్మగిలి మైమఱవ సాగెరా
taruNula vale nE valapu dAcha jAlarA
marunillu chemmagili maima~rava sAgerA
చరణం
charaNam 3
అక్కఱ తెలిసికొని నీదు ప్రక్క జేర్చరా
ఎక్కువైన రతులచే గ్రక్కున నను నేలుకోరా
akka~ra telisikoni nIdu prakka jErcharA
ekkuvaina ratulachE grakkuna nanu nElukOrA
చరణం
charaNam 4
పచ్చ విల్తు కేళి సుఖము పడయ జేయరా
రచ్చ సేయ వలదురా రాజగోపాల సామి
pachcha viltu kELi sukhamu paDaya jEyarA
rachcha sEya valadurA rAjagOpAla sAmi

#436 మేరగాదురా mEragAdurA

TitleమేరగాదురాmEragAdurA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaచతురశ్ర లఘువుchaturaSra laghuvu
పల్లవి pallaviమేరగాదురా నీకిది సామి ఇది
కోరిన చెలినిటు వేఱుగ దలచుట
mEragAdurA nIkidi sAmi idi
kOrina cheliniTu vE~ruga dalachuTa
చరణం
charaNam 1
సారెసారెకా చానను నేలుచు
వారిజాక్ష నను వంచన చేయుట
sAresArekA chAnanu nEluchu
vArijAksha nanu vanchana chEyuTa
చరణం
charaNam 2
వాసి కెక్కిన వాడని నమ్మితే
గాసి పెట్టి నను మోసము చేయుట
vAsi kekkina vADani nammitE
gAsi peTTi nanu mOsamu chEyuTa
చరణం
charaNam 3
వరద రాజగోపాల సామి
కరుణ మాని నను నిరతము దూఱుట
varada rAjagOpAla sAmi
karuNa mAni nanu niratamu dU~ruTa

#435 రారా సామిగా rArA sAmigA

Titleరారా సామిగాrArA sAmigA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviరారా సామిగా
వేగమే ప్రియ సఖినేల
సమయమిదేర రమణి తాళలేదురా
మనవి చేకోరా
rArA sAmigA
vEgamE priya sakhinEla
samayamidEra ramaNi tALalEdurA
manavi chEkOrA
చరణం
charaNam 1
మారుబారి కోర్వక మమత జెంది
నీదారి జూచు చున్నదిరా దయ యుంచి
mArubAri kOrvaka mamata jendi
nIdAri jUchu chunnadirA daya yunchi
చరణం
charaNam 2
చెలులు మాటాడిన చెవి యిచ్చి వినదురా
తలపంత నీపైనిరా దయ యుంచి
chelulu mATADina chevi yichchi vinadurA
talapanta nIpainirA daya yunchi
చరణం
charaNam 3
విడెమని అస్నమని వేడుకని నిదురని
పడతికి లేదురా దయ యుంచి
viDemani asnamani vEDukani nidurani
paDatiki lEdurA daya yunchi
చరణం
charaNam 4
రమణి నీ యాసచే రాజగోపాల
ప్రాణము నిలుపు కొన్నదిరా దయ యుంచి
ramaNi nI yAsachE rAjagOpAla
prANamu nilupu konnadirA daya yunchi

#434 సామి రాడాయెనే sAmi rADAyenE

Titleసామి రాడాయెనేsAmi rADAyenE
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaతిశ్ర లఘువుtiSra laghuvu
పల్లవి pallaviసామి రాడాయెనే
సరగున రమ్మనవే
నా మనోహరుని కేభామ బోధించెనో
sAmi rADAyenE
saraguna rammanavE
nA manOharuni kEbhAma bOdhinchenO
చరణం
charaNam 1
ఇంతి వాని దలచితే మది
ఎంతయు రంజిల్లునే కంతు బారి
కోర్వలేక కరగు చుండుటే కాని
inti vAni dalachitE madi
entayu ranjillunE kantu bAri
kOrvalEka karagu chunDuTE kAni
చరణం
charaNam 2
నిమిషమైన నను జూడక
నిలిచి యుండ జాలడే
రమణు డిపుడు చలము జేసి
రట్టు చేయ బూనెనే
nimishamaina nanu jUDaka
nilichi yunDa jAlaDE
ramaNu DipuDu chalamu jEsi
raTTu chEya bUnenE
చరణం
charaNam 3
రామరో నన్నేలిన రాజగోపాలుడే
ప్రేమ సుంతైన లేక
మోహము జూప కున్నాడే
rAmarO nannElina rAjagOpAluDE
prEma suntaina lEka
mOhamu jUpa kunnADE

#433 చలము చేసేవదేలరా chalamu chEsEvadElarA

Titleచలము చేసేవదేలరాchalamu chEsEvadElarA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviచలము చేసేవదేలరా సామి నీకిది మేరా
సామి వినురా నీకిది మేరా సరగున నను
నేలుకోర నీదానరా సామి
chalamu chEsEvadElarA sAmi nIkidi mErA
sAmi vinurA nIkidi mErA saraguna nanu
nElukOra nIdAnarA sAmi
చరణం charaNam 1కలకాలము నీ కౌగిలి బాయక
చెలిమిని గోరుచున్న నాతో
kalakAlamu nI kaugili bAyaka
chelimini gOruchunna nAtO
చరణం charaNam 2పగదాననా పంతగించకురా
తగదుర పలు మఱు నీవిట్లు
pagadAnanA pantaginchakurA
tagadura palu ma~ru nIviTlu
చరణం charaNam 3రాజసమేలరా రట్టు సేయకురా
రాజగోపాల సామి నాతో
rAjasamElarA raTTu sEyakurA
rAjagOpAla sAmi nAtO