| Title | ముక్కు పచ్చలారని | mukku pacchalArani |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | ముక్కు పచ్చలారని చిన్నదాన నన్నెక్కడి కంపెదరే సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే | mukku pacchalArani chinnadAna nannekkaDi kampedarE siggAye nannekkaDi kampedarE |
| అనుపల్లవి anupallavi | నిక్కము రేయెల్ల నిదుర బోయెనమ్మా తక్కిన పనులేమి నే నెరుగ నోయమ్మా | nikkamu rEyella nidura bOyenammA takkina panulEmi nE neruga nOyammA |
| చరణం charaNam 1 | వంచిన నా చేయి మంచి గంధము లోన ముంచి యెత్తెద రేలనే సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే మంచిదేరమ్మ మగవారి చేయిబట్టు మంచు దెల్పెదరు నాకలవాటు లేదమ్మా | vanchina nA chEyi manchi gandhamu lOna munchi yetteda rElanE siggAye nannekkaDi kampedarE manchidEramma magavAri chEyibaTTu manchu delpedaru nAkalavATu lEdammA |
| చరణం charaNam 2 | అందముగా నున్న మాకీనెదీసి నే నంటరాయ నేరనే అందగాని నోటి కంటీయమని యెద రిందరిలో మనసెట్టు లొప్పునోయమ్మా | andamugA nunna mAkInedIsi nE nanTarAya nEranE andagAni nOTi kanTIyamani yeda rindarilO manaseTTu loppunOyammA |
| చరణం charaNam 3 | ఈ పను లాపను లేల చెప్పెదరు నేనేపని కోపలేనే ప్రాపై దాసు శ్రీరాము నేలిన వేణు గోపాల దేవుని గూడి యుండెదనమ్మా | I panu lApanu lEla cheppedaru nEnEpani kOpalEnE prApai dAsu SrIrAmu nElina vENu gOpAla dEvuni gUDi yunDedanammA |
Category: Carnatic Music
1272 నేనెరుగనా nEneruganA
| Title | నేనెరుగనా | nEneruganA |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | దర్బారు | darbAru |
| తాళం tALa | జంపె | jampe |
| పల్లవి pallavi | నేనెరుగనా నీజాడ నాసామి నేనెరుగనా | nEneruganA nIjADa nAsAmi nEneruganA |
| అనుపల్లవి anupallavi | మాను నీ వగలెల్ల మా వద్దనా సామి | mAnu nI vagalella mA vaddanA sAmi |
| చరణం charaNam 1 | మరుపెన్నటికి రాని మంచి మాటలె చెప్పి అర చేత వైకుంఠ మట్టె చూపి పరిపూర్ణ దయ గలిగి పనులెల్ల కానిచ్చి సరసుడవు నీ వింద్రజాలములు జేసేవు | marupennaTiki rAni manchi mATale cheppi ara chEta vaikunTha maTTe chUpi paripUrNa daya galigi panulella kAnicchi sarasuDavu nI vindrajAlamulu jEsEvu |
| చరణం charaNam 2 | ముద్దు నా సామి నీ మురిపంపు సుద్దులివి ముత్యాలు పది వేలు మూట గట్టు బద్దులాడను పంచ బాణుడాన నీ వలపు మిద్దెపై నిడు పరుగు మీసాలపై తేనె | muddu nA sAmi nI muripampu suddulivi mutyAlu padi vElu mUTa gaTTu baddulADanu pancha bANuDAna nI valapu middepai niDu parugu mIsAlapai tEne |
| చరణం charaNam 3 | కనికరము పూజ్య మాకాశ పుష్పము నిజము వినవోయి మగవారి వింతలెల్ల ఘన దాసు శ్రీరామ కవి కీర్తనంబులే విన వేడుకాయె నీ పని పదిల మాయెనిక | kanikaramu pUjya mAkASa pushpamu nijamu vinavOyi magavAri vintalella ghana dAsu SrIrAma kavi kIrtanambulE vina vEDukAye nI pani padila mAyenika |
1271 అప్పటి మాటలకు appaTi mATalaku
| Title | అప్పటి మాటలకు | appaTi mATalaku |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | అప్పటి మాటలకు దుప్పటిచ్చె గాని అప్పటి గప్ప నిచ్చెనటే చెలి | appaTi mATalaku duppaTicche gAni appaTi gappa nicchenaTE cheli |
| అనుపల్లవి anupallavi | తప్ప నేనితరుల దరి జేరనని యెన్నో చెప్పిన తలచు కొంటినే ఓ చెలి | tappa nEnitarula dari jEranani yennO cheppina talachu konTinE O cheli |
| చరణం charaNam 1 | తొలినాటి వగలేయా మలునాటి వగలు మా చెలిమి కాకియు కోవెల చందమాయెనే | tolinATi vagalEyA malunATi vagalu mA chelimi kAkiyu kOvela chandamAyenE |
| చరణం charaNam 2 | పడతి మగవారు బారు పడకింట మితిమీరు గడప దాటిన వెనుక కారు మనవారు బడి బడి నాడు వారు బ్రతిమాలి పాదముల బడి వేడుకొన్న గాని పలుకే మేల్మి బంగారు | paDati magavAru bAru paDakinTa mitimIru gaDapa dATina venuka kAru manavAru baDi baDi nADu vAru bratimAli pAdamula baDi vEDukonna gAni palukE mElmi bangAru |
| చరణం charaNam 3 | కాసు వీసములిచ్చి గోస గూసల మసి బూసి నేరేడు గాయ జేసెనే చెలి వేసాల మారి మా వేణుగోపాల మూర్తి దాసు శ్రీరామ కవి డాసి యేలుచుండెనే ఓ చెలి | kAsu vIsamulicchi gOsa gUsala masi bUsi nErEDu gAya jEsenE cheli vEsAla mAri mA vENugOpAla mUrti dAsu SrIrAma kavi DAsi yEluchunDenE O cheli |
1270 ముద్దుముద్దుగ muddumudduga
| Title | ముద్దుముద్దుగ | muddumudduga |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | అఠాణ | aThANa |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ముద్దు ముద్దుగ పిలవనా నా సామిని ముదుగు ముదుగుగ పిలవనా నా సామిని | muddu mudduga pilavanA nA sAmini mudugu muduguga pilavanA nA sAmini |
| అనుపల్లవి anupallavi | ముద్దు ముద్దుగ పిలువ చులక సేయునేమో ముదుగు ముదుగుగ పిలువ బాగని తోచేనే | muddu mudduga piluva chulaka sEyunEmO mudugu muduguga piluva bAgani tOchEnE |
| చరణం charaNam 1 | పాటలు పాడుదునా మంచి ఆటలు ఆడుదునా వాటమైన గుబ్బ పోటు జూపింతునా గోటి కొన చెక్కిలి మీటుదునా | pATalu pADudunA manchi ATalu ADudunA vATamaina gubba pOTu jUpintunA gOTi kona chekkili mITudunA |
| చరణం charaNam 2 | ఆకు మడుపు లిత్తునా మంచి తావి అత్తరు పైబూతునా తేకువతో జడ త్రిప్పి కొట్టుదునా మోక మావి చిగురు మోవి గరతునా | Aku maDupu littunA manchi tAvi attaru paibUtunA tEkuvatO jaDa trippi koTTudunA mOka mAvi chiguru mOvi garatunA |
| చరణం charaNam 3 | కోపగించకు మందునా యేర వేణు గ్గోపాల రమ్మందునా శ్రీపూర్ణమగు దాసు శ్రీరాము మనసున ప్రాపై నివసించి పాలించమందునా | kOpaginchaku mandunA yEra vENu ggOpAla rammandunA SrIpUrNamagu dAsu SrIrAmu manasuna prApai nivasinchi pAlinchamandunA |
1269 కామాంధకారము kAmAndhakAramu
| Title | కామాంధకారము | kAmAndhakAramu |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | కామాంధకారము కప్పెనా నీవింత కనుగానక యుంటివి | kAmAndhakAramu kappenA nIvinta kanugAnaka yunTivi |
| అనుపల్లవి anupallavi | ఏమిరా తెలియదా ఇది కాదని నీకు నీ ముద్దు కోమలి నివసించిన ఇల్లు | EmirA teliyadA idi kAdani nIku nI muddu kOmali nivasinchina illu |
| చరణం charaNam 1 | పంజరమున చిలుక పగిది నేనుండగ పరులకు పని ఏమిరా సంజ చీకటి దారి జాడ తెలియ లేక కంజాత నయన ఇక్కడ వచ్చితివా లేక | panjaramuna chiluka pagidi nEnunDaga parulaku pani EmirA sanja chIkaTi dAri jADa teliya lEka kanjAta nayana ikkaDa vacchitivA lEka |
| చరణం charaNam 2 | వగకాడ నీవంటి వానికి నావంటి మగువ పొందది ఏలరా మొగలి పూజిదుమబో ముల్లా కంటిన యట్లు తగని ఈ నా యిల్లు దారి దాకెనా లేక | vagakADa nIvanTi vAniki nAvanTi maguva pondadi ElarA mogali pUjidumabO mullA kanTina yaTlu tagani I nA yillu dAri dAkenA lEka |
| చరణం charaNam 3 | భ్రమ లేల నిన్నటి రాతిరి గలసిన భామ ఇల్లిది గాదురా రమణీయ దాసు శ్రీరామ కవీంద్రుని అమల చిత్తాంబుజ మనుకొంటివా లేక | bhrama lEla ninnaTi rAtiri galasina bhAma illidi gAdurA ramaNIya dAsu SrIrAma kavIndruni amala chittAmbuja manukonTivA lEka |
1268 వలచితిరా నిను valachitirA ninu
| Title | వలచితిరా నిను | valachitirA ninu |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | దర్బారు | darbAru |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | వలచితిరా నిను వదలను సామీ జలజాక్ష నీ దర్శనమే పది వేలు | valachitirA ninu vadalanu sAmI jalajAksha nI darSanamE padi vElu |
| చరణం charaNam 1 | ఇచ్చిన సరే ఇవ్వకున్న సరే వచ్చి నాతో నొక ముచ్చటాడిన చాలు | icchina sarE ivvakunna sarE vacchi nAtO noka mucchaTADina chAlu |
| చరణం charaNam 2 | నీళ్ళనే ముంచు పాలనే ముంచు కాళ్ళకు మ్రొక్కెద కరుణించరా | nILLanE munchu pAlanE munchu kALLaku mrokkeda karuNincharA |
| చరణం charaNam 3 | వేణుగోపాలా వేడితి చాలా రాణించు దాసు శ్రీరాము నుల్లము వలె | vENugOpAlA vEDiti chAlA rANinchu dAsu SrIrAmu nullamu vale |
1267 వట్టు బెట్టెద vaTTu beTTeda
| Title | వట్టు బెట్టెద | vaTTu beTTeda |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | వట్టు బెట్టెద నా చై పట్ట రాకురా సామి | vaTTu beTTeda nA chai paTTa rAkurA sAmi |
| అనుపల్లవి anupallavi | గట్టిగ పది వేల కరకు వరాల మూట గట్టి నా కట్టెదుట బెట్టి మాటాడర | gaTTiga padi vEla karaku varAla mUTa gaTTi nA kaTTeduTa beTTi mATADara |
| చరణం charaNam 1 | గారాన నొక యమ్మ కని పెంచిన బిడ్డ యూరకే వచ్చునా తేరా సరిగ చీర | gArAna noka yamma kani penchina biDDa yUrakE vacchunA tErA sariga chIra |
| చరణం charaNam 2 | వలచి వచ్చిన వారు ఇలువ బెట్టక పోరు అలరింతు తేరా మంచి ఆణి ముత్యాల పేరు | valachi vacchina vAru iluva beTTaka pOru alarintu tErA manchi ANi mutyAla pEru |
| చరణం charaNam 3 | భాసుర వేణుగోపాల జేజేల మిన్న దాసు శ్రీరామ కవి డాసి ఏలక యున్న | bhAsura vENugOpAla jEjEla minna dAsu SrIrAma kavi DAsi Elaka yunna |
1266 మగువ నేనెంత maguva nEnenta
| Title | మగువ నేనెంత | maguva nEnenta |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | మగువ నేనెంత మంద బుద్ధినైతి మగని తూలనాడితి మోసపోయితి | maguva nEnenta manda buddhinaiti magani tUlanADiti mOsapOyiti |
| అనుపల్లవి anupallavi | తెగువ తొల్లి యిల్లు తిరిగి చూచుచున్న నగధర నినుజూచి నగరా పొమ్మంటి | teguva tolli yillu tirigi chUchuchunna nagadhara ninujUchi nagarA pommanTi |
| చరణం charaNam 1 | బెట్టు విడచి మ్రొక్కు బెట్టు వచ్చిన నన్ను బట్టకురా నీ బవిసి దెలిసె నంటి | beTTu viDachi mrokku beTTu vacchina nannu baTTakurA nI bavisi delise nanTi |
| చరణం charaNam 2 | వాసిగా నా తోడ యూసు లాడెదనన్న దాసు శ్రీరామకవి డాసి ఏలుకొమ్మంటి | vAsigA nA tODa yUsu lADedananna dAsu SrIrAmakavi DAsi ElukommanTi |
1265 సరియేనో sariyEnO
| Title | సరియేనో | sariyEnO |
| Written By | ||
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | జంజూటి | janjUTi |
| తాళం tALa | ధాపు | dhApu |
| పల్లవి pallavi | సరియేనో సారసాక్ష చారుగాత్ర క్రూరతనవిదు | sariyEnO sArasAksha chArugAtra krUratanavidu |
| అనుపల్లవి anupallavi | ఇరువనోర్వ తరుళా వరనాకృతిగె సైరిసదె కరుణిసదె హొర హాకువరె | iruvanOrva taruLA varanAkRtige sairisade karuNisade hora hAkuvare |
| చరణం charaNam 1 | పుత్రారహిత అర్థ వ్యర్థావెనుతా పృథ్వియొళు ఉత్తమరు నుడియవరు | putrArahita artha vyarthAvenutA pRthviyoLu uttamaru nuDiyavaru |
| చరణం charaNam 2 | ధనలోభియు నీ ఘనతోషదలిక్షణదోళ్ వన వాసరె తనయా నను కళుహువరే | dhanalObhiyu nI ghanatOshadalikshaNadOL vana vAsare tanayA nanu kaLuhuvarE |
| చరణం charaNam 3 | సుగుణవంతా మననెగింత చింతా కాంతారదొళ్ కళుహూవదు నినగుచితవె | suguNavantA mananeginta chintA kAntAradoL kaLuhUvadu ninaguchitave |
1264 కీర రాజ kIra rAja
| Title | కీర రాజ | kIra rAja |
| Written By | ||
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | కాంబోజి | kAmbOji |
| తాళం tALa | ఖ. చాపు | kha. chApu |
| పల్లవి pallavi | కీరరాజ బారో పోగువ సార సాక్షన బళిగె | kIra rAja bArO pOguva sAra sAkshana baLige |
| చరణం charaNam 1 | భూరుహదిం భూరుహకె సారదె నీం పోగదిరు సానతి నొందె కాపది చెందె పోగదె ముందె బా హిందెందె | bhUruhadim bhUruhake sArade nIm pOgadiru sAnati nonde kApadi chende pOgade munde bA hindende |
| చరణం charaNam 2 | కాంతారదొళు కామిని మార్గవను ఈక్షిసుతిహళు ఎంతిహళో కాంతె తా నంతరది బెంతిపళో గగన విహారి వన సంచారి పరోపకారి రమ్య శరీరి కీరరాజ బారో పోగువ | kAntAradoLu kAmini mArgavanu IkshisutihaLu entihaLO kAnte tA nantaradi bentipaLO gagana vihAri vana sanchAri parOpakAri ramya SarIri kIrarAja bArO pOguva |