| Title | ఏమి సేతునే | Emi sEtunE |
| Written By | Dr పసుమర్తి విఠల్ | Dr pasumarti viThal |
| Book | ||
| రాగం rAga | అభేరి | abhEri |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఏమి సేతునే చెలియా ఏమనందునే ఏఁ ఏమి సేతునే చెలియా నిన్నేమనందునే ఏఁ | Emi sEtunE cheliyA EmanandunE E@M Emi sEtunE cheliyA ninnEmanandunE E@M |
| దొరయైన నా స్వామి దొంగిలించె మనము || ఏమి|| | dorayaina nA swAmi dongilinche manamu || Emi|| | |
| పలుమారు నను పలుకరించి సరసమాడి పోయేనే || ఏమి|| | palumAru nanu palukarinchi sarasamADi pOyEnE || Emi|| | |
| నిన్న మొన్న దాక నన్ను రవ్వ చేసినాడే వీనుల విందుగ నాతో మధుర భాష లాడెనే కమ్మని పిలుపుతో విఠలుని కబురు పంపితే గదవే || ఏమి|| | ninna monna dAka nannu ravva chEsinADE vInula vinduga nAtO madhura bhAsha lADenE kammani piluputO viThaluni kaburu pampitE gadavE || Emi|| | |
Category: Javali
#796 అరుళ్వాయ్ మురుగా aruLvAy murugA
| Title | అరుళ్వాయ్ మురుగా | aruLvAy murugA |
| Written By | చిత్రవీణ రవికిరణ్ | chitravINa ravikiraN |
| Book | rasikas.org | |
| రాగం rAga | బేగడ | bEgaDa |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | అరుళ్వాయ్ మురుగా మయిల్ మీదేరి వన్ | aruLvAy murugA mayil mIdEri van |
| అనుపల్లవి anupallavi | విళైయాడి ఓడి పాడి నాం కళిత్తిడవే నీ విరైవిల్ వన్ | viLaiyADi ODi pADi nAm kaLittiDavE nI viraivil van |
| చరణం charaNam 1 | సోమశేఖరన్ ప్రేమ సుతనే రామన్ మరుగనే కుమరనే కురమగళ్ కామ సుందరనే రవి శశి వేణ్డుం పుణ్ణియనే నీ వన్ | sOmaSEkharan prEma sutanE rAman maruganE kumaranE kuramagaL kAma sundaranE ravi SaSi vENDum puNNiyanE nI van |
| చరణం charaNam 2 | తామదం ఎన్నాల్ తాళ ఇయలవిల్లై కరుణై సైవాయ్ ఉయర్ సామం పుగళుం శీలనే తమిళ్ లోలనే వడివేలనే | tAmadam ennAl tALa iyalavillai karuNai seivAy uyar sAmam pugazhum SIlanE tamizh lOlanE vaDivElanE |
| Audio Link: | https://www.youtube.com/watch?v=_ynPQ_5XcXw |
#795 ఇన్నాళ్ళవలె innALLavale
| Title | ఇన్నాళ్ళవలె | innALLavale |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | ఇన్నాళ్ళవలె గాదమ్మ మా గోపాలుడు ఎన్నెన్నొ నేర్చినాడమ్మా | innALLavale gAdamma mA gOpAluDu ennenno nErchinADammA |
| చరణం charaNam 1 | నన్ను కనుల మూసి నా చెంతనుండి సన్నుతాంగి మోసి చప్పరించెనె | nannu kanula mUsi nA chentanunDi sannutAngi mOsi chapparinchene |
| చరణం charaNam 2 | పదరాకనూ వాగు గోపాలుడు నను జూడ మదిరాక్షిరొ దాని మమత జేర్చుకొనెనె | padarAkanU vAgu gOpAluDu nanu jUDa madirAkshiro dAni mamata jErchukonene |
| చరణం charaNam 3 | కొదమ గుబ్బల పైని కోకాడు దలగింప కదిలి నే నడిగితె తుద నన్ను గూడెనె | kodama gubbala paini kOkADu dalagimpa kadili nE naDigite tuda nannu gUDene |
#794 యేమొ చెలియా yEmo cheliyA
| Title | యేమొ చెలియా | yEmo cheliyA |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కమాస్ | kamAs |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | యేమొ చెలియా మోసమాయె యేమి చేతునే ఓ చెలియా నేనేమి చేతునే చెలియా నేనేమి చేతునే | yEmo cheliyA mOsamAye yEmi chEtunE O cheliyA nEnEmi chEtunE cheliyA nEnEmi chEtunE |
| చరణం charaNam 1 | ప్రేమ పాత్రుడైన సామి యిక యేమొ దయలేక సుందరాంగుడైన నా సఖుడెందుకో రాడాయెనయ్యో | prEma pAtruDaina sAmi yika yEmo dayalEka sundarAnguDaina nA sakhuDendukO rADAyenayyO |
| చరణం charaNam 2 | గరపురీశుడైన (?) సామి కరుణ తోనె నాదు కరము బట్టి సరస మాడి మరులు చేసి పోయెనయ్యో | garapurISuDaina (?) sAmi karuNa tOne nAdu karamu baTTi sarasa mADi marulu chEsi pOyenayyO |
#793 మగడొచ్చి magaDochchi
| Title | మగడొచ్చి | magaDochchi |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | మగడొచ్చి పిలచేడు పోయి వత్తుర ప్రీతి మరువ కుండుర నా సామి | magaDochchi pilachEDu pOyi vattura prIti maruva kunDura nA sAmi |
| చరణం charaNam 1 | పగవారు జూచిన పలు విధముల నన్ను నగుబాటు జేతురు వగపూల బాలను నా | pagavAru jUchina palu vidhamula nannu nagubATu jEturu vagapUla bAlanu nA |
| చరణం charaNam 2 | సరసాన నీ వదనము అర నిమిష మైనను దర్శించకుంటె భరియింప ప్రాణముల్ | sarasAna nI vadanamu ara nimisha mainanu darSinchakunTe bhariyimpa prANamul |
| చరణం charaNam 3 | సరగూన వచ్చి నీ పరితాప మార్చెద నెరదాత వైనట్టి వరద వేణుగోపాల | saragUna vachci nI paritApa mArcheda neradAta vainaTTi varada vENugOpAla |
#792 నా హృదయ nA hRdaya
| Title | నా హృదయ | nA hrudaya |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | నా హృదయ ఫలకమున యా నాతి రూపు రేఖా విలాసములు నాటి పోయెగా | nA hRdaya phalakamuna yA nAti rUpu rEkhA vilAsamulu nATi pOyegA |
| చరణం charaNam 1 | చీమ చిటుకుమన్న మరల చెలియ వచ్చెనని యెంతొ యేమేమో తీరుల నెంచు చుంటినిగా | chIma chiTukumanna marala cheliya vachchenani yento yEmEmO tIrula nenchu chunTinigA |
| చరణం charaNam 2 | ఆ హొయలును ఆ నడలు ఆ పలుకులు ఆ కులుకులు ఆహా నా మదికి మరపు రాక యుండెగా | A hoyalunu A naDalu A palukulu A kulukulu AhA nA madiki marapu rAka yunDegA |
#791 చెఱగు మాసె che~ragu mAse
| Title | చెరగు మాసె | cheragu mAse |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | చెఱగు మాసె నేమి సేతురా దరి జేరనైన వీలు గాదురా కొఱమాలిన దైవమక్కట నెలకు సరిగ మూడు నాళ్ళు చెలితనము చూడరాదు | che~ragu mAse nEmi sEturA dari jEranaina vIlu gAdurA ko~ramAlina daivamakkaTa nelaku sariga mUDu nALLu chelitanamu chUDarAdu |
| చరణం charaNam 1 | మురిపెము గల మొదటి రతిలో ముచ్చటైన దీర లేదు మరి యొక తరి కూడుదమని మురియుచుండ నింతలోనె | muripemu gala modaTi ratilO muchchaTaina dIra lEdu mari yoka tari kUDudamani muriyuchunDa nintalOne |
| చరణం charaNam 2 | మృదుల హృదయ నౌపురీశ మదిని చింత యింతగాదు మరిచెద రెండ్నాళ్ళకు నీ ముదము తీర కలియు దాన | mRdula hRdaya naupurISa madini chinta yintagAdu maricheda renDnALLaku nI mudamu tIra kaliyu dAna |
#790 శివ దీక్షా Siva dIkshA
| Title | శివ దీక్షా | Siva dIkshA |
| Written By | ఘనం శీనయ్య | ghanam SInayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కురంజి | |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | శివ దీక్షా పరురాలనురా యేర | Siva dIkshA parurAlanurA yEra |
| అనుపల్లవి anupallavi | శీలమంతైనన్ విడువ జాలనురా నే శీలమంతైనన్ విడువ జాలనురా | SIlamantainan viDuva jAlanurA nE SIlamantainan viDuva jAlanurA |
| చరణం charaNam 1 | శివశివ గురునాజ్ఞ మీరనురా నే శ్రీ వైష్ణవుడంటె చేరనురా | SivaSiva gurunAjna mIranurA nE SrI vaishNavuDanTe chEranurA |
| చరణం charaNam 2 | వడిగ వచ్చి మఠము చొరవకురా శివార్చన వేళ తలుపు తెరవకురా మడుగు దాన్ని శరగు ముట్టకురా మాటిమాటికి నోరు మూయకురా | vaDiga vachchi maThamu choravakurA SivArchana vELa talupu teravakurA maDugu dAnni Saragu muTTakurA mATimATiki nOru mUyakurA |
| Dance video at | https://www.youtube.com/watch?v=uu_sxwbrbnk |
Edited on 10 Dec 2025 : https://guruguha.org/tag/siva-deeksha/ says this jAvaLi was composed by Ghanam Seenayya. Adi tALa also mentioned there. Added dance video link. The mentioned page has a few audio recordings too
Edited on 11 Dec 2025 – found 2 more ‘complete’ lyrics at https://www.octavesonline.com/post/shiva-diksaparu-p-lyrics and https://www.rasikas.org/forums/viewtopic.php?p=363055#p363055
| Title | శివ దీక్షా | Siva deekshA |
| Written By | ఘనం శీనయ్య | ghanam SInayya |
| Book | ||
| రాగం rAga | కురంజి | kuranji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | శివ దీక్షా పరురాలనురా నే శీలమెంతైన విడువజాలనురా | Siva dIkshA parurAlanurA nE SIlamentaina viDuvajAlanurA |
| అనుపల్లవి anupallavi | శివశివా గురునాజ్ఞ మీరనురా నే శ్రీ వైష్ణవుడంటే చేరనురా | SivaSivA gurunAjna mIranurA nE SrI vaishNavuDanTE chEranurA |
| చరణం charaNam 1 | వడిగ వచ్చి మఠము జొరవకురా శివార్చన వేళ తలుపు దెరవకురా మడుగు కావి చెరగు దియ్యకురా నన్ను మాటి మాటికి నోరుముయ్యకురా (*OR* మాటిమాటికి నీవు నోరు మూయకురా) | vaDiga vacchi maThamu joravakurA SivArchana vELa talupu deravakurA maDugu kAvi cheragu diyyakurA nannu mATi mATiki nOrumuyyakurA (*OR* mATimATiki nIvu nOru mUyakurA) |
| చరణం charaNam 2 | పంచాక్షరీ జప శీలనురా కూకి పలుకులు నే విన జాలనురా కొంచెపు వగలు నే నెంచనురా నీకె మ్రొక్కెదు రుద్రాక్ష సరులు తెంచకురా | panchAksharI japa SIlanurA kUki palukulu nE vina jAlanurA konchepu vagalu nE nencanurA nIke mrokkedu rudrAksha sarulu tenchakurA |
| చరణం charaNam 3 | అబ్బ (అజ్జ?) జూచి చన్ను లదమకురా నా సజ్జను గొలుసు బట్టి గదియకు రా బుజ్జగించకు పసిగోలనురా నా కెమ్మోవి నొక్కకు భక్తురాలనురా | abba (ajja?) jUci channu ladamakurA nA sajjanu golusu baTTi gadiyaku rA bujjaginchaku pasigOlanurA nA kemmOvi nokkaku bhakturAlanurA |
| చరణం charaNam 4 | మోము మోమును బట్టి జేర్చకురా నీ నామము తోడ బూతి గూర్చకురా వేమరు తొడ భిక్ష వేడకురా పోపోరా మన్నారు రంగమల్లాడకురా | mOmu mOmunu baTTi jErchakurA nI nAmamu tODa bUti gUrchakurA vEmaru toDa bhiksha vEDakurA pOpOrA mannAru rangamallADakurA |
#789 మోహనాంగి mOhanAngi
| Title | మోహనాంగి | mOhanAngi |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | మోహనాంగి మదన రేఖ పీల కుంతలా | mOhanAngi madana rEkha pIla kuntalA |
| చరణం charaNam 1 | రావె వేగ కౌగిలీవె రాజ సుందరీ | rAve vEga kaugilIve rAja sundarI |
| చరణం charaNam 2 | మోము మోము కదియ జేర్చి ముద్దొసంగవే | mOmu mOmu kadiya jErchi muddosangavE |
| చరణం charaNam 3 | ఏల నాలసించెదవె తాళ జాలనె | Ela nAlasinchedave tALa jAlane |
#788 మోడి జేసే mODi jEsE
| Title | మోడి జేసే | mODi jEsE |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కమాచ్ | kamAch |
| తాళం tALa | ||
| Previously Published At | 719, 707, 676 | |
| పల్లవి pallavi | మోడి జేసే వేలరా యీడుకాడ నే పాడి సరస మాడి నీతో ముద్దాడినాను | mODi jEsE vElarA yIDukADa nE pADi sarasa mADi nItO muddADinAnu |
| చరణం charaNam 1 | వయ్యారి మాటలతో సయ్యాట లాడుచును మోహాన రా ప్రియ యన నిన్నే చేయీడ్చితి | vayyAri mATalatO sayyATa lADuchunu mOhAna rA priya yana ninnE chEyIDchiti |
| చరణం charaNam 2 | తాళ వశమొ మొర లాలించి నాతొ సమ కేళిం గలసి దేలించుమ గోరితి | tALa vaSamo mora lAlinchi nAto sama kELim galasi dElinchuma gOriti |