| Title | కొమ్మరొ వాని | kommaro vAni |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కమాచ్ | kamAch |
| తాళం tALa | ||
| Previously Published At | 644 | |
| పల్లవి pallavi | కొమ్మరొ వానికెంత బిగువె పిలచిన పలుకడు యేమి చేతునే | kommaro vAnikenta biguve pilachina palukaDu yEmi chEtunE |
| చరణం charaNam 1 | సదయుడురో దానాడుచు పోట్లాడి తిరిగి తిరిగి నన్ చూచుచు పొమ్మనే | sadayuDurO dAnADuchu pOTlADi tirigi tirigi nan chUchuchu pommanE |
| చరణం charaNam 2 | తాండవ కృష్ణుడు తగిన వల్లభుడు దారిలో జూచి నన్ తాకి పోయెనే | tAnDava kRshNuDu tagina vallabhuDu dArilO jUchi nan tAki pOyenE |
Category: Javali
#786 ఊరకె పక్కకు Urake pakkaku
| Title | ఊరకె పక్కకు | Urake pakkaku |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | ఊరకె పక్కకు రమ్మంటె వచ్చునా ఊరివారి పడుచు | Urake pakkaku rammanTe vachchunA UrivAri paDuchu |
| అనుపల్లవి anupallavi | ఏరా దాని జూచి ఎంతెంతొ ఏచేవు ఎంచరాని దెల్ల ఎంచితె ఏమౌనో | ErA dAni jUchi entento EchEvu encharAni della enchite EmaunO |
| చరణం charaNam 1 | మమత తోను ఆ మగువను చేయి బట్టి మాటిమాటికి మళ్ళీ వచ్చేవురా విడరాదు దాశరథి రాముడు మును విలు ద్రుంచి సీతను పెళ్ళాడ లేదా | mamata tOnu A maguvanu chEyi baTTi mATimATiki maLLI vachchEvurA viDarAdu dASarathi rAmuDu munu vilu drunchi sItanu peLLADa lEdA |
#785 సఖియ వినుమా sakhiya vinumA
| Title | సఖియ వినుమా | sakhiya vinumA |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ఇంగ్లీషు మెట్టు | inglIshu meTTu |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | సఖియ వినుమా సరిగ చనుమా సఖుని రమ్మనుమా | sakhiya vinumA sariga chanumA sakhuni rammanumA |
| అనుపల్లవి anupallavi | సఖుని రమ్మనుమా ఇంత జాలమేలమ్మా ఇంత జాలమేలమ్మా నే సైపలేనమ్మా | sakhuni rammanumA inta jAlamElammA inta jAlamElammA nE saipalEnammA |
| చరణం charaNam 1 | పంచ శరము డెద పొంచి శరముల మించి వేసె గదే మించి వేసె గదే సహించ రాదు గదే సహించ రాదు గదే ప్రేమించడాయె గదే | pancha Saramu Deda ponchi Saramula minchi vEse gadE minchi vEse gadE sahincha rAdu gadE sahincha rAdu gadE prEminchaDAye gadE |
| చరణం charaNam 2 | సవతి మాటలు చాల విని నను చౌక జేసె గదే చౌక జేసె గదే నాపై చలము బూనె గదే చలము బూనె గదే మోసంబు జేసె గదే | savati mATalu chAla vini nanu chauka jEse gadE chauka jEse gadE nApai chalamu bUne gadE chalamu bUne gadE mOsambu jEse gadE |
| చరణం charaNam 3 | వసుధ మానేపల్లి పురమున వాసి కెక్కె గదే వాసి కెక్కె గదే నను బాసి పోయె గదే బాసి పోయే గదే గోపాల స్వామి గదే | vasudha mAnEpalli puramuna vAsi kekke gadE vAsi kekke gadE nanu bAsi pOye gadE bAsi pOyE gadE gOpAla svAmi gadE |
#784 రాజహంస rAjahamsa
| Title | రాజహంస | rAjahamsa |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ఇంగ్లీషు మెట్టు | inglIshu meTTu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రాజహంస యానరా రారార మా మనోహరా | rAjahamsa yAnarA rArAra mA manOharA |
| అనుపల్లవి anupallavi | రాజముఖి పిలువనంపె రాజ సంబంధి యేలరా రామ నీకై వేచెరా రారమ్ము వైలంబేలరా | rAjamukhi piluvanampe rAja sambandhi yElarA rAma nIkai vEcherA rArammu vailambElarA |
| చరణం charaNam 1 | అందరిలో నీవె చాలా అందగాడని కోరెరా పొందుమా మా నాతిని చలమందు నీకది ఏలరా | andarilO nIve chAlA andagADani kOrerA pondumA mA nAtini chalamandu nIkadi ElarA |
| చరణం charaNam 2 | వసుధలో సద్భక్తులకు వరములియ్యు మానేపల్లి వాసుడవై యున్న శ్రీ గోపాల బాల ఏలరా | vasudhalO sadbhaktulaku varamuliyyu mAnEpalli vAsuDavai yunna SrI gOpAla bAla ElarA |
#783 సమయమిదె samayamide
| Title | సమయమిదె | samayamide |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | బిలహరి | bilahari |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | సమయమిదె యనుచు నిన్ను చాల బ్రతిమాలితిర సుమ శరుని శరములకు సొక్కి యుంటినేర రారా | samayamide yanuchu ninnu chAla bratimAlitira suma Saruni Saramulaku sokki yunTinEra rArA |
| చరణం charaNam 1 | మల్లె పందిరి దరిని జేరి మలయ మారుతము వీవగ చల్లగా బిలహరి రాగము కోర్కె దీర పాడెద రార | malle pandiri darini jEri malaya mArutamu vIvaga challagA bilahari rAgamu kOrke dIra pADeda rAra |
| చరణం charaNam 2 | విరి పాన్పున జేరి నీతో విరివిగ చౌశీతి బంధముల్ జూపించి మెప్పించి కరగించెద కఠిన మనసు | viri pAn&puna jEri nItO viriviga chauSIti bandhamul jUpinchi meppinchi karagincheda kaThina manasu |
| చరణం charaNam 3 | వాసిగ అభినవ భూతపురి ఈశ రామశర్మ పోష దోసిలొగ్గి వేడెద రార దుఃఖంబును బాపుట కిదె | vAsiga abhinava bhUtapuri ISa rAmaSarma pOsha dOsiloggi vEDeda rAra du@hkhambunu bApuTa kide |
#782 అన్యాయముగా anyAyamugA
| Title | అన్యాయముగా | anyAyamugA |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | బేగడ | bEgaDa |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | అన్యాయముగా నే అపవాదు పాలైతి అతివరో ఏమందునే | anyAyamugA nE apavAdu pAlaiti ativarO EmandunE |
| అనుపల్లవి anupallavi | మన్నారు రాజ గోపాల స్వామికి నాకు కన్నెలెల్ల చెలిమి కలదని పలికేరు | mannAru rAja gOpAla svAmiki nAku kannelella chelimi kaladani palikEru |
| చరణం charaNam 1 | బోటుల ఎదుటనే పొద్దు వానింటికి పోయి వచ్చినందుకా ఆటపాటల కొరకు అతని తోడే నేను మాటలాడి నందుకా ఏటికే ఈ గేలి ఏ పాప మెరుగను తాటి కింద పాలు త్రావిన చందము | bOTula eduTanE poddu vAninTiki pOyi vachchinandukA ATapATala koraku atani tODE nEnu mATalADi nandukA ETikE I gEli E pApa meruganu tATi kinda pAlu trAvina chandamu |
#781 ఏర సామి Era sAmi
| Title | ఏర సామి | Era sAmi |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | ఏర సామి సరసకు మరి మరి పిలిచిన పలుక వేమిరా | Era sAmi sarasaku mari mari pilichina paluka vEmirA |
| చరణం charaNam 1 | చిన్న నాడే చెలిమి కోరి యున్న దానరా నాతో పంతమేల జేసెదవురా నీ చెంత జేరి యున్నదానరా యేర మరుబారి కోర్వజాల మరి మరి వేడితిరా | chinna nADE chelimi kOri yunna dAnarA nAtO pantamEla jEsedavurA nI chenta jEri yunnadAnarA yEra marubAri kOrvajAla mari mari vEDitirA |
| చరణం charaNam 2 | కామ శాస్త్ర విభుడవని కలసినానురా నాతో కయ్యమేల జేసెదవురా యేర మార్కాపుర వాస నను కరుణించి బ్రోవరా | kAma SAstra vibhuDavani kalasinAnurA nAtO kayyamEla jEsedavurA yEra mArkApura vAsa nanu karuNinchi brOvarA |
#780 తెలిసెనురా నీ telisenurA nI
| Title | తెలిసెనురా నీ | telisenurA nI |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | సావేరి | sAvEri |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | తెలిసెనురా నీ తెరగెల్లను నేడు చక్క తెలిసెనురా | telisenurA nI teragellanu nEDu chakka telisenurA |
| అనుపల్లవి anupallavi | ఎలిమిని నన్నేలి ప్రాణేశ శ్రీ వెంకటేశ తలపున నన్నెంచ లేదా తప్పు తంట లెల్ల నేడు | elimini nannEli prANESa SrI venkaTESa talapuna nannencha lEdA tappu tanTa lella nEDu |
| చరణం charaNam 1 | మాటల పస దానింట మౌనంబు నా యింట | mATala pasa dAninTa maunambu nA yinTa |
| చరణం charaNam 2 | ఆట పాట దానింట అలుకలు నా యింట | ATa pATa dAninTa alukalu nA yinTa |
| చరణం charaNam 3 | జూటు వగలు నా యింట సొగసెల్లను దానింట | jUTu vagalu nA yinTa sogasellanu dAninTa |
| చరణం charaNam 4 | నాటకములు నా యింట నమ్మికెల్ల దానింట | nATakamulu nA yinTa nammikella dAninTa |
#779 ఇది మరియాద idi mariyAda
| Title | ఇది మరియాద | idi mariyAda |
| Written By | ||
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ధన్యాసి | dhanyAsi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇది మరియాద గాదటే సరోజ ముఖిరో దూరేటి వారికి | idi mariyAda gAdaTE sarOja mukhirO dUrETi vAriki |
| అనుపల్లవి anupallavi | సదయుడు నాతో సదా సరసము లాడినది మరియాద గాదటే | sadayuDu nAtO sadA sarasamu lADinadi mariyAda gAdaTE |
| చరణం charaNam 1 | కాంత మదమంత మిదే వింత మాట లాడుచును ఇంతులెల్ల గూడి నాపై పూబంతులు వేసినది | kAnta madamanta midE vinta mATa lADuchunu intulella gUDi nApai pUbantulu vEsinadi |
#778 కరుణ జూడ karuNa jUDa
| Title | కరుణ జూడ | karuNa jUDa |
| Written By | భూసురపల్లి వేంకటేశ్వర్లు | bhUsurapalli vEnkaTESvarlu |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కాపీ | kApI |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | కరుణ జూడ డేలనో కాంచనాంగి చెప్పి రావె | karuNa jUDa DElanO kAnchanAngi cheppi rAve |
| అనుపల్లవి anupallavi | కలలో నైనా స్వామిని గాంచక నే నుండ లేను | kalalO nainA svAmini gAnchaka nE nunDa lEnu |
| చరణం charaNam 1 | మనసంతా అతడె నిండి మగువకు దాగుట తగవా అతనికి చేతనైనచొ నా మనసు నుంచి పొమ్మనవే | manasantA ataDe ninDi maguvaku dAguTa tagavA ataniki chEtanainacho nA manasu nunchi pommanavE |
| చరణం charaNam 2 | వాంఛ కాదు వనితా యిది వలపు పెంచు కొంటి విభుని కిది తగదని చెప్పవేమె తడవు లేక రమ్మనవే | vAnCha kAdu vanitA yidi valapu penchu konTi vibhuni kidi tagadani cheppavEme taDavu lEka rammanavE |